లండన్, మార్చి 31: మన పాలపుంత ఆవల దాదాపు రెండు వేలకు పైగా మహా కృష్ణబిలాలు అనాథలుగా ఉన్నాయని తాజాగా జరిగిన అధ్యయనంలో వెల్లడైంది. సాధారణంగా నక్షత్ర కూటముల మధ్య భాగంలో ఉండాల్సిన ఈ కృష్ణబిలాలు పాలపుంత అంచుల వరకూ వెళ్లిపోవడానికి దారితీసిన పరిస్థితులపై ఈ అధ్యయనం జరిగింది. కాలిఫోర్నియా యూనివర్శిటీకి చెందిన శాస్తవ్రేత్తలు చిన్న నక్షత్ర కూటములు విలీనమై విస్తృత నక్షత్ర మండలాలుగా ఎలా ఏర్పడతాయన్న దానిపై కంప్యూటర్ విశే్లషణలు చేశారు. నక్షత్ర కూటములు విలీనమైనప్పుడు వాటి మధ్యలో ఉండే కృష్ణబిలాలు కూడా విలీనమవుతాయని, ఫలితంగా మహా కృష్ణబిలాలు.. సూర్యుడికి లక్షలాది రెట్లు ఎక్కువ ద్రవ్యరాశితో ఆవిర్భవిస్తాయని వెల్లడించారు. అయితే కృష్ణబిలాలు పరస్పరం ఢీకొన్నప్పుడు గురుత్వాకర్షక తరంగాలు ఉద్భవిస్తాయని, వాటి ప్రభావం వలన కొత్తగా విలీనమైన కృష్ణబిలాలు తమకు ఆతిథ్యమిచ్చే నక్షత్ర కూటమి నుంచి విసిరివేయబడతాయని, ఇలాంటి పరిణామాల కారణంగానే దాదాపు రెండు వేలకు పైగా కృష్ణబిలాలు మన పాలపుంత అంచులకు చేరుకున్నాయని వారు పేర్కొన్నారు.
మన పాలపుంత ఆవల దాదాపు రెండు
english title:
p
Date:
Monday, April 1, 2013