హైదరాబాద్, ఏప్రిల్ 1: విద్యుత్ చార్జీలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని దేవాదాయశాఖ మంత్రి రామచంద్రయ్య మండిపడుతుంటే, రామచంద్రయ్య చేసిన వ్యాఖ్యలను తాను స్పందించనని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రకటించడం ఆశ్చర్యం కల్గించింది. అసలు విద్యుత్‌పై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం భేటీనే కావడంలేదని రామచంద్రయ్య అన్నారు. పెంచిన విద్యుత్ చార్జీల్లో సగభాగం ప్రభుత్వం భరించాలని రామచంద్రయ్య ముఖ్యమంత్రికి సూచించారు. ప్రజా సమస్యలపై కేబినెట్‌లో చర్చలు జరగడంలేదన్నారు. విద్యుత్ సమస్యపై దిశ దశ లేకుండా ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మాత్రం పెంచిన విద్యుత్ చార్జీలపై కాంగ్రెస్ పార్టీలో విస్తృతంగా చర్చస్తామని ప్రకటించడం పట్ల పార్టీలో గందరగోళం ఏర్పడిందని పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. కిరణ్ కేబినెట్‌లో ఉన్న మంత్రులు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయడం పార్టీకి నష్టదాయకం అవుతుందని పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. సోమవారం మంత్రులు వేర్వేరుగా మీడియా సమావేశాల్లో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని పిసిసి అధ్యక్షుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంపన్నులకు విద్యుత్ చార్జీలు పెంచకూడదన్నదనే విధంగా ప్రతిపక్షాల వాదనగా ఉందన్నారు. విద్యుత్ చార్జీలు పెంచాలన్న ఈఆర్‌సి ప్రతిపాధనలపై ఈ నెల 4, 5 తేదీల్లో సమీక్షిస్తామని బొత్స చెప్పారు. తప్పని పరిస్థితి వస్తే ఖచ్చితంగా అందరితో చర్చస్తామని చెప్పారు.
సచివాలయంలో ఏడుసార్లు కరంట్ కట్
పాలనా యంత్రాగానికి కేంద్రమైన సచివాలయంలో సోమవారం ఏడుసార్లు కరంట్ పోవడంతో అధికారులు కొవ్వుత్తులు వెలిగించి విధులను నిర్వహించారు.
ఏక పక్ష నిర్ణయాలు పార్టీకి నష్టమన్న రామచంద్రయ్య
english title:
charges
Date:
Tuesday, April 2, 2013