బుక్కరాయసముద్రం, ఏప్రిల్ 1: బుక్కరాయసముద్రం మండల పరిధిలో ఆదివారం రాత్రి కురిసిన వడగళ్ళ వానకు పొడరాళ్ళకు చెందిన పెద్దన్న, రమేష్, మల్లిఖార్జున అనే రైతులకు చెందిన వరి పంట 88 ఎకరాల్లో నేలమట్టం అయిపోవడంతో దాదాపు రూ.4 లక్షలు నష్టం వాటిల్లిందని, వడియంపేటకు చెందిన మహిళా రైతు రామసుబ్బమ్మ 5 ఎకరాల పొలంలో కాపుకు వచ్చిన అరటి మొక్కలు నేలకూలి తీవ్రనష్టం వాటిల్లింది. నష్టపోయిన పంటలను అంచనా వేయడానికి ఆర్‌ఐ ఈశ్వర్, విఆర్‌ఓ కృష్ణవేణి, వ్యవసాయ విస్తరణ అధికారి ప్రసాద్, హార్టికల్చర్ రామాంజినేయులు సందర్శించారు.
ఉరవకొండలో...
ఉరవకొండ: మండలంలోని వివిధ గ్రామాల్లో ఆదివారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులకు మండలంలోని పలు గ్రామాల్లో సాగుచేసిన కలింగర పంట దెబ్బతిని, దాదాపు 15 లక్షల ఆస్థి నష్టం సంబవించింది. ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో ప్రారంభమైన వర్షం వడగండ్ల వానగా మారింది. దీంతో మండలంలోని షెక్షానుపల్లి గ్రామంలో దాదాపు 30 ఎకరాలలో సాగు చేసిన కలింగర కాయల పంట దెబ్బతింది. అకాల వర్షంతో చేతికి అందివచ్చిన పంట నాశనమైందని బాధితులు తెలిపారు. గ్రామానికి చెందిన వెంకటరమణప్ప, చెన్న కేశవులు, శ్రీనివాసులు, రాజశేఖర్ గౌడ్‌లు దాదాపు రెండు మాసాల క్రితం కలింగరకాయల పంటను సాగు చేశారు. ఎకరానికి దాదాపు 50 నుండి 60 వేల రూపాయల వరకు వెచ్చించి పంట సాగు చేసినట్లు తెలిపారు. అకాల వర్షం కారణంగా దెబ్బతినిందన్నారు. పట్టణంలో అకాల వర్షానికి విద్యుత్ స్థంభాలు దెబ్బతిని విద్యుత్ తీగలు నెల వాలాయి. మరికొన్ని ప్రాంతాల్లోని 10 వార్డులోని దస్తగిరికి చెందిన షెడ్ పూర్తిగా దెబ్బతిని దాదాపు లక్ష నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. స్థానిక గాంధీ చౌక్, ఆర్‌అండ్‌బి వద్ద చెట్లు నెలకొరిగాయి. అలాగే మండలంలోని వెలిగొండ గ్రామంలో సుంకన్న ఇంటిపై పిడుగు పడి ఇళ్లు పూర్తిగా దెబ్బతినిందన్నారు.
గోరంట్లలో...
గోరంట్ల: మండలంలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం రాత్రి ఈదుర గాలులతో కూడిన వర్షాలు మామిడి రైతులకు అపార నష్టం కలిగించాయి. అంతంత మాత్రంగా కాసిన మామిడి కాయలు ఈదురు గాలులకు రాలిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పులేరు వద్ద సోమశేఖర్‌కు చెందిన 18 ఎకరాల మామిడి తోటలో ఏ చెట్టు కింద చూసినా కుప్పలు, కుప్పలుగా మామిడి కాయలు రాలి పడ్డాయి. సుమారు రూ లక్ష వరకు నష్టం వాటిల్లిందని సంబంధిత రైతు వాపోయాడు. జీనంవాండ్లపల్లి, ఎముకులగుట్టపల్లి, మరువపల్లి, సుబ్బరాజుపల్లి మామిడి రైతులు తీవ్ర నష్టాలకు గురయ్యారు. ఆదివారం రాత్రి వీచిన ఈదురు గాలులకు పెద్ద వృక్షాలతో పాటు విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
బుక్కరాయసముద్రం మండల పరిధిలో
english title:
n
Date:
Tuesday, April 2, 2013