చీపురుపల్లి, ఏప్రిల్ 5 : తమ గ్రామంలో తమకు తెలియకుండా ఉఫాధి సిబ్బంది తప్పుడు మస్తర్లు వేసి 16 లక్షల రూపాయలు స్వాహా చేశారంటూ మండలంలోని రావివలస గ్రామానికి చెందిన ఉపాధి కూలీలు శుక్రవారం ఉదయం ఎంపిడిఓ కార్యాలయాన్ని ముట్టడించారు. రాత్రి 10 గంటల వరకు ఆందోళన కొనసాగింది. అంతకు ముందు బాధ్యులపై శనివారం సాయంత్రం ఐదు గంటల్లోగా చర్యలు తీసుకుంటామని ఎపిడి అప్పలనాయడు హామీ ఇవ్వడంతో శాంతించిన వేతనదారులు 212 గంటల తర్వత ఆందోళన విరమించారు. వివరాల్లోకి వెళితే... గ్రామంలో సుమారుగా ఉన్న 15 బృందాలు ఫిబ్రవరి నెలలో ఒక వారం, మార్చి నెలలో ఒక వారం పని చేయగా ఫిబ్రవరి నెలలో 4 వారాలు, మార్చి నెలలో 4 వారాలు పనిచేసినట్లు నమోదు చేసి ఉపాధి, సంతకాలను ఫోర్జరీ చేశారని కూలీలు ఆరోపించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కూలీలు ఎపిఒ ఎం శ్రీనివాసరావును నిలదీసారు. గ్రామానికి ఎన్ని పనులు మంజూరు చేశారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఎవరెవరికి ఎంత మొత్తం చెల్లించారో తేల్చి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ఎపిఓ స్పందిస్తూ ఈవ్యవహారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతానని హామీ ఇచ్చారు. అయితే కూలీలు వెంటనే న్యాయం చేయాలని కార్యాలయం ముందు బైఠాయించారు. దీంతో స్థానిక ఎస్సై అబ్ధుల్‌మారూఫ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇప్పిలి అనంతం కూలీలతో చర్చలు జరిపినా వారు ఆందోళన విరమించలేదు. సాయంత్రం ఐదు గంటల లోగా తేలుస్తామని ఎపిఓ హామీ ఇచ్చారు. విచారణ జరపనిదే ఇక్కడి నుంచి కదిలేది లేదని వారు భీష్మించారు. కూలీల చ ఆందోళనకు మద్దతుగా స్థానిక టిడిపి నాయకులు ఈవ్యవహారం త్వరగా తేల్చాలని ఎపిఓను కోరారు. ఉదయం నుంచి తాము ఆందోళన కొనసాగిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదంటూ సాయంత్రం మళ్లీ ఎపిఓ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళను ఉద్ధృతం చేశారు. పరిస్థితి చేయిదాటుతుందని గ్రహించిన పోలీసులు చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. మహిళలను పురుష పోలీసులు బలవంతంగా నెట్టివేయడాన్ని నిరసిస్తూ కూలీలు మళ్లీ మండల పరిషత్ కార్యాలయం వద్ద ఆందోళన జరిపారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. రెండంతవస్తుల భవనంపైకి ఎక్కి కూలీలు మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకుంటామంటూ హెచ్చరించారు.ఈ పరిస్థితుల్లో సిఐ మోహనర్‌రావు వచ్చి జిల్లా అధికారులు వస్తున్నారని చెప్పడంతో ఉపాధి కూలీలు క్రిందికి దిగి ఆందోళనను కోనసాగించారు. రాత్రి 8 గంటల వరకు ఆ ప్రాంతానికి అధికారులు చేరుకోలేదు. అయినప్పటికీ ఆందోళనను కొనసాగించారు.
తమ గ్రామంలో తమకు తెలియకుండా ఉఫాధి సిబ్బంది
english title:
mpdo office
Date:
Saturday, April 6, 2013