విజయనగరం , ఏఫ్రిల్ 5: పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జిల్లా కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. పట్టణంలో గంటస్తంభం జంక్షన్ వద్ద 40లక్షల రూపాయల లైలా తుఫాన్ నిధులతో నిర్మించనున్న కల్వర్టు నిర్మాణానికి శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కోలగట్ల మాట్లాడుతూ పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కరించేందుకు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తామన్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లా మంత్రి బొత్స సత్యనారాయణ సూచనల మేరకు గంటస్తంభం జంక్షన్ వద్ద కల్వర్టు నిర్మించాలని నిర్ణయించామన్నారు. పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రతిపాదనలు తయారు చేస్తామన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో ట్రాఫిక్ సమస్యను పరిశీలించారు. గంటస్తంభం జంక్షన్ నుంచి నెహ్రు పార్కు వరకు సెంటర్‌లైటింగ్, అగ్నిమాపక కార్యాలయం నుంచి నెహ్రు పార్కువరకు రోడ్డు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గంటస్తంభం నుంచి కన్యకాపరమేశ్వరి కోవెల వరకు ట్రాఫిక్ క్రమబద్దీకరణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌కలెక్టర్, మున్సిపల్ ప్రత్యేక పిఎశోభ, మున్సిపల్ కమిషనర్ ఎస్.గోవిందస్వామి, మున్సిపల్ డిప్యూటీ ఇంజనీరింగ్ పి.వెంకటరావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పిళ్లా విజయకుమార్, యడ్ల రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని
english title:
issues
Date:
Saturday, April 6, 2013