అంటున్నారు ఇప్పుడు టాలీవుడ్‌లో అక్ష పరిస్థితిని చూసి. తెలుగు, మలయాళ భాషలతో పాటు బాలీవుడ్‌లోనూ ఓ చిత్రంలో నటించిన ఈ ముద్దుగుమ్మకు ఇప్పటి వరకు కాలం కలిసిరాలేదనే చెప్పాలి. 2004లో వచ్చిన ‘ముసాఫిర్’ (హిందీ) చిత్రం ద్వారా నటనారంగంలోకి అడుగుపెట్టిన అక్షకు ఆ చిత్రం ఏ మాత్రం పేరుని తెచ్చిపెట్టలేకపోయింది. కెరీర్‌కు ఎంతగానో ఉపయోగపడుతుందని అక్ష లక్ష కలలు కన్నా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ తర్వాత 2007లో ‘గోల్’ (మలయాళం) చిత్రంలో నటించింది. అదీ ఆమెకు నిరాశనే మిగిల్చింది. ఇక లాభం లేదనుకున్న అక్ష 2008లో తెలుగు చిత్రసీమలోకి ప్రవేశించి ‘యువత’ (2008) చిత్రంలో విశాలాక్షిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహించారు. నిఖిల్ హీరోగా నటించిన ఈ చిత్రం తర్వాత అక్షకు కొద్దో గొప్పో అవకాశాలు వచ్చినా అవి ఆమె కెరీర్‌ని నిలబెట్టలేకపోయాయి. తనీష్ నటించిన ‘రైడ్’ (2009)లో పూజగా,
‘అదే నువ్వు’ (2010)లో సమీరగా, రామ్ సరసన ‘కందిరీగ’(2011)లో సంధ్యగా, ‘శత్రువు’ (2013)లో అనూషగా, ‘రయ్ రయ్’ (2013) లక్ష్మీగా..ఇలా దాదాపు అన్ని భాషల్లో కలిపి ఎనిమిది చిత్రాల దాకా చేసిన ఇప్పటికీ ఆమె కెరీర్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. ఇవేగాక మరో మలయాళం చిత్రం ‘బంగ్లాస్’లోనూ నటించింది. ఒక భాషలో కాకుంటే మరో భాషలోనైనా నిలదొక్కుకోవాలని చూస్తున్న అక్షకు అంతటా నిరాశే ఎదురవుతోంది. టాలీవుడ్‌లో అడుగుపెట్టినప్పుడు అందరూ ఆమెను చూసి కెరీర్‌లో తప్పకుండా పైకొస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. వరుసగా చిత్రాలు చేస్తున్న అక్షను చూసి అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ముఖ్యం తన సహనటీమణులు అయితే మంచి అవకాశాలు కొట్టేస్తుందని ఈర్ష్య పడ్డారు కూడా. అయితే ఇది ఎంతో కాలం నిలవలేదు. రామ్‌లాంటి హీరోతో ‘కందిరీగ’లో అందాల ఆరబోత చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. చిన్నా చితకా హీరోలతో నటించడమే ఆమె చేసిన పెద్ద తప్పు అని పరిశ్రమలో ఆమె సన్నిహితులు వాపోతున్నారు. ఇప్పుడు చేతిలో చిత్రాలేవీ లేకపోవడంతో గోళ్లు గీక్కుంటూ కూర్చుంటోంది. ఎలాంటి అవకాశం వచ్చినా చేయడానికి సై అంటోందిట. హీరో, బ్యానర్, క్యారెక్టర్ ఇలాంటివేమీ చూడకుండా ఎలాంటి పాత్రనైనా చేయడానికి సిద్ధంగా వుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది అని అక్షను ఇటీవల మీడియా ప్రశ్నిస్తే-‘‘ ఏం చేయమంటారు. మంచి అవకాశాలు వస్తాయని ఇప్పటికీ ఎదురు చూస్తున్నాను. దాదాపు పది చిత్రాల వరకు చేసినా ఇప్పటికీ నా కెరీర్ ఇంకా నత్తనడకనే నడుస్తోంది. అయినా ఇంకా నా ఆశ చావలేదు. మంచి బ్యానర్‌లో ఓ మంచి సినిమా త్వరలో వస్తుందన్న నమ్మకం నాకుంది. ఇది విచిత్ర పరిశ్రమ. ఇక్కడ ఎప్పుడు ఒకరిదే పై చేయి వుండదు. అది మారుతుంటుంది. అందుకే ఎవరికి ఎప్పుడు ఎలా అవకాశం తలుపుతడుతుందో ఎవరూ చెప్పలేరు. ఎవరి అదృష్టం వారిది. ఎవరి అవకాశాలు వారివి. నటనతో పాటు అదృష్టమూ కలిసి రావాలంటాను. అప్పుడే ఏ నటి అయినా ఇక్కడ నాలుగు కాలాల పాటు నిలదొక్కుకుంటుందనేది నా నమ్మకం’’అంటూ చెప్పుకొచ్చిందట. ప్చ్...అక్ష! ఎప్పటికి మారుతుందో..ఏమో!!
అంటున్నారు ఇప్పుడు టాలీవుడ్‌లో అక్ష పరిస్థితిని చూసి.
english title:
aksha
Date:
Monday, April 8, 2013