Quantcast
Viewing all articles
Browse latest Browse all 69482

13న ‘ఒక కాలేజ్ స్టోరీ’

Image may be NSFW.
Clik here to view.

శ్రావణ్, మోనాల్ గుజ్జర్ హీరో హీరోయిన్లుగా ఆర్.ఆర్.మూవీస్, లైమ్ లైట్ సినిమా సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం ‘ఓ కాలేజ్ స్టోరీ’. టి.ప్రభాకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని నిర్మాణానంతర పనులను సైతం ముగించుకుంది. అన్ని పనులు పూర్తయిన ఈ చిత్రాన్ని ఈనెల 13న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు టి.ప్రభాకర్ చిత్ర విశేషాలను వివరిస్తూ-‘‘ విద్యార్థుల జీవితాలను ఆవిష్కరిస్తూ, కాలేజీల్లో జరుగుతున్న వివిధ సంఘటనలను విపులంగా చూపుతూ ఈ చిత్రాన్ని రూపొందించాం. కాలేజీ జీవితం అనగానే కేవలం ప్రేమలు, పెళ్లిళ్లు కాదు. జీవితగమనాన్ని నిర్ధేశించే కీలకమైన పునాది. కాలేజ్‌లో జరుగుతున్న పరిణామాలు, కెరీర్ పరంగా వారు ఎదుర్కొంటున్న ఒత్తిడి, అక్కడ జరిగే ర్యాగింగ్ దాని పర్యవసానం వంటి అంశాలను ఈ చిత్రంలో ఆవిష్కరిస్తున్నాం. ఈ చిత్రంలో ఊహించిన కొన్ని సన్నివేశాలు కాకతాళీయంగా సమాజంలో జరుగుతున్నాయి. అందుకే ఈ చిత్రం రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఏకకాలంలో నిర్మించడం జరిగింది. ఈ చిత్రం పాటలకు మంచి స్పందన లభించింది. సంగీతం, సాహిత్యపరంగా ఆ ఈచిత్రం అందర్నీ అలరిస్తుందన్న నమ్మకం వుంది’’అని చెప్పారు. నిర్మాత టి.రాజారెడ్డి మాట్లాడుతూ-‘‘తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో నిర్మిస్తున్న ఈ చిత్రం విద్యార్థులనే కాదు, వారి తల్లిదండ్రులను కూడా ఆకట్టుకుంది’’ అని చెప్పారు. ఈ చిత్రంలో ఇతర పాత్రల్లో విజయభాస్కర్, ఆర్తిపురి, నవీన్, అనుజ్‌రామ్, నవభారత్ బాలాజీ, గోపాల్ శ్యాం, ఆనంద్‌కుమార్, మంజులారాథోడ్, శైలజ, మీనాసింగ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: ఖాజాపాష.ఎస్, ఎడిటింగ్: ప్రవీణ్, కెమెరా: ఆర్.కె.శానాపతి, సమర్పణ: విహాన్, సంగీతం, దర్శకత్వం: టి.ప్రభాకర్.

శ్రావణ్, మోనాల్ గుజ్జర్ హీరో హీరోయిన్లుగా ఆర్.ఆర్.మూవీస్,
english title: 
oka college story

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles