Quantcast
Viewing all articles
Browse latest Browse all 69482

‘ఇద్దరమ్మాయిలతో’ అర్జున్

Image may be NSFW.
Clik here to view.

అల్లు అర్జున్ కథానాయకుడిగా పరమేశ్వరా ఆర్ట్స్ పతాకంపై పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం
‘ఇద్దరమ్మాయిలతో’. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత బండ్ల గణేశ్ మాట్లాడుతూ- తమ సంస్థ అందించిన గబ్బర్‌సింగ్, బాద్‌షా చిత్రాల స్థాయిలోనే ‘ఇద్దరమ్మాయిలతో’ చిత్రాన్ని నిర్మిస్తున్నామని, ప్రస్తుతం బాద్‌షా బ్లాక్‌బస్టర్ హిట్టయిన ఆనందంలో ఉండగానే అల్లు అర్జున్ పుట్టినరోజు రావడం మరింత సంతోషాన్ని ఇస్తోందని అన్నారు. స్పెయిన్‌లో ఇద్దరమ్మాయిలతో షూటింగ్‌లో ఉండగా తన పనులన్నీ అర్జునే చూసుకొని బాద్‌షా చిత్రం విడుదల చేసి బ్లాక్‌బస్టర్ కొట్టండి అని ‘ఆల్‌ది బెస్ట్’ చెప్పి పంపించాడని బండ్ల గణేశ్ చెప్పారు. అర్జున్‌కు ఈ చిత్రం నెంబర్ వన్ చిత్రంగా నిలుస్తుందని, మళ్లీమళ్లీ బన్నీతో సినిమాలు చేసే అవకాశం రావాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. బాంకాక్‌లో ఇంటర్నేషనల్ ఫైట్‌మాస్టర్ కిచ్చా డిజైన్ చేసిన యాక్షన్ పార్ట్ అద్భుతంగా వచ్చిందని, స్పెయిన్‌లో చిత్రీకరించిన పాట హైలెట్‌గా నిలుస్తుందని, దేవిశ్రీప్రసాద్ అందించిన అద్భుతమైన ఆడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆయన
వివరించారు. టోటల్‌గా ఈ చిత్రం క్వాలిటీ ఎంత గ్రాండ్‌గా వుంటుందో విడుదలయ్యాక ప్రేక్షకులే చూస్తారని నిర్మాత అన్నారు. ఆమలాపాల్, కేథరీన్, బ్రహ్మానందం, నాజర్, షావర్ అలీ, సుబ్బరాజు, శ్రీనివాసరెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:అమోల్ రాధోడ్,
ఎడిటింగ్:ఎస్.ఆర్.శేఖర్, సంగీతం:దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్:బ్రహ్మ కడలి, నిర్మాత:బండ్ల గణేశ్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:పూరీ జగన్నాధ్.

అల్లు అర్జున్ కథానాయకుడిగా పరమేశ్వరా ఆర్ట్స్ పతాకంపై
english title: 
idda

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles