Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

నేర్చుకుందాం

$
0
0

అమరంగా ధనమిచ్చి కాతురు మహీయః ప్రీతి బ్రాణంబు బ్రా
ణము నర్థంబును నిచ్చికాతు రభిమానంబు న్విశేషించి మా
నము బ్రాణంబును నర్థము న్నొసగి సన్మానంబుగా నుత్తమో
త్తమ చారిత్రులు భక్తిగాతురు ప్రమోదం బంది సర్వేశ్వరా!
భావం: సర్వేశ్వరా! గొప్ప ప్రీతితో డబ్బిచ్చి ప్రాణాన్ని, డబ్బునీ ప్రాణాన్నీ ఇచ్చి అభిమానాన్ని , మాన ప్రాణ ధనాల నిచ్చి ఈశ్వర భక్తినీ ఉత్తమోత్తమ చారిత్రులు కాపాడ్తారు.
లోకులు మొదట ధనానికీ, దానికన్నా ఎక్కువగా ప్రాణానికీ, ఈ రెంటికన్నాఎక్కువగా అభిమానానికీ విలువనీ ప్రాధాన్యాన్నీ ఇస్తారు. ఉత్తమోత్తమశీలం కల్గిన వాళ్లు ఈ మూడింటి కన్నా భక్తికి ఎక్కువ ప్రాధాన్యాన్నిస్తారు. అందువల్ల భక్తిని పోగొట్టుకోకుండా, కాపాడుకోవడానికి ప్రాజ్ఞులు ఈ మూడింటినీ త్యజించడానికి వెనుకాడరు అని శివభక్తుల అంటారు. వారికి అన్నింటికన్నా ముఖ్యమైనది ప్రాముఖ్యతను కలిగున్నది కేవలం శివభక్తే.

సర్వేశ్వర శతకములోని పద్యమిది

అమరంగా ధనమిచ్చి కాతురు మహీయః ప్రీతి బ్రాణంబు బ్రా
english title: 
nerchukundam
author: 
నిర్వహణ: శ్రీపావని సేవా సమితి, హైదరాబాద్

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>