జరుగబోయే జుగుప్సాకరమైన ప్రోగ్రామ్ తనకు తెలుసు. అది జరిగితే జీవన తట్టుకోలేదు. చింపిన అరిటాకు అవుతుంది. బ్రెయిన్ హామరేజ్ అయిపోతుంది. ఈ లోపే తప్పించుకోవాలి ఎలా? ఎలా? అని ఆలోచిస్తూ ఉండిపోయాడు. కటకటాలకు వేసిన తాళం చాలా పెద్దదిగా ఉంది. కటకటాలకు ఎదురుగా హాలు లాంటి ప్రదేశంలో నలుగురు రౌడీలు అలాగే ఉన్నారు. అదేదో పాత ఇల్లులాంటిదయి ఉంటుంది. దాన్ని వీళ్ళు స్థావరంగా చేసుకున్నారు. దేని తాలూకు చప్పుళ్ళూ లేవు. అంటే సిటీకి చాలా దూరంలో ఉన్నట్లుగా అర్థమయింది. అప్పుడే ఒక ఫ్లైట్ వెళ్లినట్లుగా శబ్దం. ఆ శబ్దాన్ని బట్టి అది ఎంత ఎత్తులో వెళ్లిందో ఊహించుకోగలిగాడు.
మాటువేసిన చిరుతపులి వేట దొరికితే ఎలా వదిలిపెట్టదో జీవనను వీళ్ళు వదలరు. జీవన మీద వచ్చే ఆదాయాన్ని వదలరు. తననేం చేస్తారు? మహా అయితే కాలూ చెరుూ్య తీసేస్తారు, కిడ్నీలు తీసి అమ్ముకుంటారు. ఇంకా ఘోరం అంటే కళ్ళు పీకేస్తారు. కానీ జీవననూ ఏదీ తీయకుండానే హింసిస్తారు. ఆ హింస ఊహించలేనిది, భరించరానిది. దాని బదులు మరణం చాలా సుఖమైనది. ఏం చెయ్యాలిపుడు నన్ను నమ్మి భుజంమీద సేద తీరుతున్న ఈ అమ్మాయిని ఎలా రక్షించుకోవాలి.
తనకంటూ ఎవరూ లేరు. ఇన్నాళ్ళకు తనను ఆధారం చేసుకున్న ఈ మల్లెతీగను ఎలా కాపాడగలను? ఇన్నాళ్ళు తనకంటూ ఎవరూ లేరని బాధపడ్డాడు. ఈ క్షణాన తనది అనిపించిన ఈ అమ్మాయి కోసం బాధపడుతున్నాడు. అంటే బంధాలు ఉంటే ఒక బాధ. లేకపోతే ఒక బాధ అన్నమాట. ఆ బాధ పేరే ప్రేమ కాబోలు. ఆలోచనలతో పిచ్చెక్కేలా అనిపించింది. ఆ ఆలోచనలు డిస్ట్రబ్ చేస్తూ గ్రిల్ బలంగా నెట్టబడింది. ఉలికిపడి అటు చూశాడు. ఆ శబ్దానికి జీవన కూడా ఉలికిపడింది. అది రాత్రో పగలో తెలీడంలేదు.
సన్నగా, పీలగా పొడుగ్గా ఉన్న ఒకడు లోపలికి వచ్చి దిగ్గున నిలబడి జీవన జుట్టు పట్టుకోబోయాడు. జీవనను వెనక్కి నెట్టి తన వీపుకాన్చుకుని ముందుకొచ్చాడు అవినాష్. డ్రగ్ తీసుకున్నట్లు ఓవర్ ఉషారుగా వాడు వికారంగా ‘హి.. హి.. హ్హి’ అని నవ్వి అవినాష్ వెనక్కి జంప్ చేసి జీవన జుట్టు పట్టుకున్నాడు. కెవ్వున అరిచింది జీవన.
‘‘వదులు’’ అని అవినాష్ వాడి చేతిమీద ఒక్కటేశాడు. దున్నపోతుమీద వాన కురిసినట్లు లెక్క చేయకుండా జీవనను జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్ళసాగాడు. వెనకనుంచి అవినాష్ లాగుతున్నా వాడికసలు ఒంటిమీద సెనే్సషన్ లేనట్టు బరబరా లాక్కెళుతూనే ఉన్నాడు. జీవన కెవ్వు కెవ్వున అరుస్తోంది. జుట్టు నెప్పిపుట్టి అవినాష్ వాడిని కొట్టడానికి ఏదైనా దొరుకుతుందేమోనని చుట్టూ చూశాడు.
అప్పుడు మోగింది జేబులోని జనార్ధన్ ఇచ్చిన సెల్. తన దగ్గర సెల్ ఉందన్న విషయమే మర్చిపోయిన తనను తాను తలమీద కొట్టుకుని సెల్ తీసాడు ‘హలో’ అనగానే గొంతు గుర్తుపట్టి.
‘‘రేయ్ నేనురా జనార్ధన్‌ను. రాత్రి పోలీసు స్టేషన్‌లో న్యూస్ కలెక్ట్ చేయరా అంటే సీన్ క్రియేట్ చేశావట. నువ్వూ ఆ కుప్పతొట్టి పిల్లను పెంచుకున్న అఅమ్మారుూ... కనిపించడం లేదనే వార్త అన్ని పేపర్లలోనూ వచ్చేసిందిరా. మన ఆఫీసులో కూడా అంత టెన్షన్‌గా ఉన్నారు. నిన్ను వెతకమని పోలీసుల మీద ప్రెషర్ తేవడానికి అందరం కమీషనర్‌కు కలవడాని కెళ్తున్నాం. ఇంతకీ ఎక్కడున్నావురా నువ్వు. నీ దగ్గర నా సెల్ ఉందన్న విషయం ఇప్పుడే గుర్తొచ్చి... ఇంకేదో చెప్పబోతున్న జనార్ధన్‌ను ఆపి...
‘‘రేయ్ నేను.. అని మొదలెట్టగానే జీవనను లాక్కుపోతున్నవాడు వెనక్కి తిరిగి ‘హ్హి... హ్హి... హ్హి...’ అని నవ్వి అలవోకగా కత్తి విసిరాడు. అదొచ్చి ఫోన్ పట్టుకున్న చెయ్యి తగిలి ఫోన్ కిందపడింది. దాన్ని ఇంకో చేత్తో అందుకుని..
‘‘ఒరేయ్ నేను ఎయిర్‌పోర్ట్‌కు దగ్గర.. ఎంత దగ్గరంటే ఫ్లైట్ హండ్రెడ్ ఫీట్స్ ఎత్తులో ఉండేంత దగ్గరలో పాతబడినట్లున్న ఇంట్లో కిడ్నాప్...’’ అనే లోపు మరో కత్తి విసిరాడు. అది ఫోన్‌కు తగిలి ఫోన్‌తో సహా పోయి దూరంగా పడింది. దాన్ని తెచ్చుకుందామనుకునేలోపు జీవన ‘అవినాష్’ అని అరవడంతో జీవన దగ్గరకు పరుగెత్తాడు.
‘‘జీవనను లాక్కెళ్ళి గుయ్యారంగా ఉన్న అండర్‌గ్రౌండ్‌లో తోసాడు. అడ్డం వచ్చిన అవినాష్‌ను తలగోడకు కొట్టుకునేలా విసిరాడు. అసలతను మామూలు మనిషిలా లేడు.
తేరుకునేసరికి అవినాష్‌కూ ఆ చీకటి గ్రౌండ్ ఫ్లోర్‌కూ మధ్య ఉన్న తలుపు విసిరేవాడు ఒక్కదుటన. అవినాష్ ఆ తలుపును ఎంత తట్టినా, కాలితో తన్నినా కదలడంలేదు. దానికి ఆలీ జాలీగా సందులు ఉండడంతో లోపల జరిగేది కనిపిస్తోంది.
వీళ్ళ చీకటి వ్యాపారాన్ని ఫిలిమ్‌గా తీసి రైటర్స్ కాన్ఫరెన్స్‌లో చూపించిన డా.సునీత అక్కడ్నుంచీ లోపల జరిగే తంతును వీడియో తీసిందని అర్థమయింది అవినాష్‌కు.
అప్పటిదాకా మసక మసకగా కనిపిస్తూ ఉన్న ఆ గ్రౌండ్ ఫ్లోర్‌లో గుప్పుమంటూ నెగడులాంటిది వెలిగింది. ఆ వెలుతుర్లో వామన్రాములు, స్టేషన్‌లో పిచ్చిదానిలా ప్రవర్తించినది, ఆమె భర్తలా ఉన్నతను, ఇంకా కొందరు కూర్చుని ఉన్నారు.
-ఇంకాఉంది