ఓ పదిమంది వాళ్ళను రౌండప్ చేస్తూ నిలబడి పహారా కాస్తున్నారు.
పిచ్చిది మగరాయుడిలా ఒక కాలు మడిచి ఒక కాలు చాచి నిర్లక్ష్యంగా కూర్చుని ఉంది. నోట్లో ఏదో పైపులాంటిది పెట్టుకుని చుట్టలా పొగ పీలుస్తూంది. జీవన ఆమె కాళ్ళ దగ్గర పడి ఉంది. విసురుగా నెట్టడాన తల దిమెక్కిందేమో అలాగే పడి ఉంది. ‘‘రేయ్ దీనిబట్టలిప్పెయ్‌బె. అన్నలొస్తుండ్రు అరుస్తరు’’ అంది. మత్తు కళ్లు విరబోసిన జుట్టు, భారీ కాయ మగరాయుడి గొంతు.. చూస్తుంటే తాటకిలా ఉంది. జీవనను కాలుతో ఓ నెట్టు నెట్టింది. జీవన కదిలి వణుకుతూ లేచి కూర్చుంది. అక్కడ వాళ్లందదరూ క్రూరంగా అనేకంటే అసహ్యంగా ఉన్నారు.
‘‘హ్హి హ్హి అక్కా ముందు నాకిడువే ముందు నాకిడువే’’ కుప్పిగంతులు వేస్తూ ఒకడడిగాడు.
‘‘నాకిడువక్కమ్మా నాకిడువే’’ ఇంకొకడు తూలుతూ జీవన దగ్గరకు రాబోయాడు.
‘‘చుబ్బే! అందరు దీస్కోండి పోండి’’ అరిచింది.
‘‘మాయక్క కుంతీదేవిరా! ఆయమ్మ ద్రౌపది నిడిసినట్లు ఇడిసింది.. ఇంక మనిష్టం.
జల్ది జేయుండి అన్నొస్తడు. అందరు చుట్టుముట్టి జీవన దగ్గరకు రాసాగారు. జీవన భయపడుతూ వెనక్కి జరిగింది.
పిచ్చిదానికి అందుబాటులోకి రాగానే ఒక్క తన్ను తన్నింది. జీవనెళ్లి వామన్రాములు కాళ్ళ దగ్గర పడింది. చేతిలో చుట్టలాంటిది దాంతో జీవన నడుంమీద అంటించాడు.
‘‘అమ్మా’’ అని అరిచింది జీవన. అందరూ పగలబడి నవ్వారు. అవినాష్ ఇనప తలుపును బలంగా నెట్టాడు. ‘రేయ్’ అనరిచాడు. ఎవ్వరికీ అవినాష్ అరుపు వినిపించలేదు. అందరూ అదొక మత్తులో ఉన్నారు.
‘‘మస్తుగ గాల్చినలే’’ అడిగాడు వామన్రాములు.
‘‘అవ్వన్న నాకు మస్తు ఖుషి అయ్యింది’’ ఇంకొకడు ఎగురుతూ అన్నాడు. వాళ్ళసలు మనుషుల్లా లేరు. పిచ్చెక్కిన జంతువుల్లా మదమెక్కిన క్రూరమృగాల్లా ఉన్నారు. చూస్తుంటే జుగుప్సగా అసహ్యంగా ఉన్నారు. వాళ్ళ ఆనందం ఎదుటివాళ్ళ బాధను చూసినకొద్దీ పెరిగేలా ఉంది.
‘‘జీవనా, జీవనా ఇటురా’’ అనరిచాడు అవినాష్. జీవన రాబోతుంటే కాళ్ళకున్న పైజామా పట్టుకున్నాడొకడు. వాడి బలానికి పైజామా నాడా తెగి జారిపోయింది. ముడుచుకుని కూర్చుండిపోయింది జీవన.
‘‘అన్నొస్తుండు అన్నొస్తుండు’’ ఇంకొకడు కేరింతలు కొడుతూ అన్నాడు. అందరూ ఒక మూలకు ఉన్న గుహలాంటి ద్వారం వైపు చూశారు.
సన్నగా, పీలగా ఒళ్ళంతా తెల్లటి పొడలతో మచ్చలతో పాములా ఉన్నాడు అతను. బల్లికి కొద్దిగా గెటప్ వేసి మనిషి ఆకారాన్ని తెస్తే ఎలా ఉంటాడో అలా ఉన్నాడు. వాడ్ని చూడగానే జీవన భయంతో ముడుచుకుపోయింది. వాడి కళ్ళు పచ్చగా మెరుస్తున్నాయి. వాడు పాక్కుంటూ పాక్కుంటూ పిచ్చిదాని దగ్గరకు వచ్చాడు. మోకాలు కనబడుతుంటే ఆ మోకాల్ని ఆబగా నాకాడు. అది మత్తులో ఉండటాన మోకాలు వెనక్కి తీసుకుని ఒక్క తన్ను తన్నింది అంతే.
‘‘అఅ... అఅ.. అఅ’’ అని రొప్పుతూ అంత బలమైనదాన్ని చుట్టుకుని, ఒక్క ఒడుపుతో కిందపడేసి, ఒళ్ళంతా గోళ్ళతో రక్కేసి...ఒళ్ళంతా తడమసాగాడు. గోళ్ళు దిగబడి రక్తం ఓడుతోంది. అది చూసి జీవన ప్రాణాలు ఉగ్గబట్టుకుంది. వాడో భయంకరమైన సైకిక్‌లా అనిపించాడు.
కిందపడి పిచ్చిదాని ఒళ్ళంతా రక్కుతూ నెత్తుటి మరకలూ ఏర్పడ్డాయి. పిచ్చిది మత్తులోంచి బయటపడి.
‘‘రేయ్ చింపుగా నీకా పిల్లను దెచ్చినా, దాంతోటి ఆడుకోరా, అగజూడు ముద్దుగుంది. మెత్తగుంది. గక్కడవోరా గక్కడవో. పోరా... పో’’ అని సముదాయించసాగింది. వాడు జీవన వైపు తిరిగాడు. జీవన వాడి చూపులకే కెవ్వున అరుస్తూ గోడకు అతుక్కుపోయింది. భయంతో వణికిపోయింది. వాడటు చూడగానే బట్టలు సర్దుకుని..
‘‘దొంగ కొడుకు ఆడదాన్ని జూస్తే సాలు అంగలల్లారుస్తడు, నీయమ్మ ఒళ్ళంతా వూనం చేసిండు’’ అని గొణికి మళ్ళీ చుట్ట కాల్చడంలో మునిగిపోయింది పిచ్చిది. అక్కడున్న వాళ్ళందరూ అప్పటిదాకా కామెడీ సీన్‌లోని అడ్వర్‌టైజ్‌మెంట్ చూసి ఆకర్షించబడ్డవాళ్ళలా... అదే పనిగా చూస్తున్నారు.
నెక్ట్స్ చూడబోయే సినిమా తలుచుకుని సస్పెన్స్ ఫీలవ్వసాగారు. నవ్వడానికి సిద్ధమవ్వసాగారు. ఆనందంతో పిచ్చి గంతులు వేశారు. అవినాష్‌లో కసి, కోపం, ఏమీ చేయలేని తన స్థితి, ఉద్రేకం తెప్పిచ్చింది. కాలితో ఇనప కచ్చడాన్ని తన్నాడు.
చింపు అనబడినవాడు పాక్కుంటూ మెల్లగా జీవన వైపు బయల్దేరాడు.
‘‘వద్దూ.. వద్దూ.. జీవన వణుకుతూ పలవరిస్తోంది. జీవన ముఖంలోని భయాన్నిచూసి అందరూ మహదానందపడిపోతున్నారు.
జీవన అవినాష్‌వైపు జరగడానికి ప్రయత్నించసాగింది.
ఎదురుగా ఒకడు అడ్డం వచ్చి ‘‘కబ్బాడి... కబ్బాడి.. కబ్బాడి’’ అంటూ జీవనను పట్టుకోవడానికి కబాడీ ఆటలోలాగా ఆడసాగాడు.
జీవన వెనక్కి పరుగెత్తింది. వెనకనుంచీ ఒకడు ‘కబ్బాడి.. కబ్బాడి... కబ్బాడి’’ అంటూ తరిమాడు.
-ఇంకాఉంది
ఓ పదిమంది వాళ్ళను రౌండప్ చేస్తూ నిలబడి పహారా కాస్తున్నారు.
english title:
daily serial
Date:
Tuesday, April 9, 2013