గతంలో తాను నటించిన శ్రీరామ్ చిత్రంలో పోలీస్ ఉద్యోగంకోసం పోరాడితే జైశ్రీరామ్ చిత్రంలో ఎసిపి శ్రీరామ్ శ్రీనివాస్‌గా ప్రజలకోసం పోరాడతానని, ఎసిపిగా తన కెరీర్‌లో తొలిసారిగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రతీ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుని చేశానని కథానాయకుడు ఉదయ్‌కిరణ్ తెలిపారు. ఫైవ్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై బాలాజీ ఎన్.సాయి దర్శకత్వంలో తేళ్ల రమేష్, ఎన్.సిహెచ్.రాజేష్ నిర్మిస్తున్న జైశ్రీరామ్ చిత్రం ఈనెల 11న విడుదలవుతున్న సందర్భంగా కథానాయకుడు ఉదయ్‌కిరణ్ పాత్రికేయులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మరిన్ని సంగతులు వివరిస్తూ తన 13ఏళ్ల సినిమా ప్రయాణంలో ఓ మైలురాయిలా ఈ చిత్రం నిలుస్తుందని, పూర్తి యాక్షన్ హీరోగా నిరూపించుకునే అవకాశం ఈ చిత్రం ద్వారా దొరికిందని తెలిపారు. షూటింగ్ చేయటానికి ముందు అనేక మంది పోలీస్ అధికారుల సలహాలు తీసుకున్నానని, ఆరు బాంబు బ్లాస్ట్‌ల మధ్య మోటార్ సైకిల్‌తో ప్రయాణించడం ఈ చిత్రంలో హైలెట్‌గా నిలుస్తుందని, ఇప్పటికే పాటలకు, ట్రైలర్స్‌కు మంచి స్పందన లభిస్తోందని ఆయన తెలిపారు. దర్శకుడు బాలాజీ పనితనం, ఫైట్ మాస్టర్ డ్రాగన్‌ప్రకాష్ డిజైన్ చేసిన ఫైట్స్ సరికొత్తగా ఉంటాయని, చిన్ననాటి నుండి యాక్షన్ సినిమాలంటే ఇష్టం ఉండడంవల్ల ఈ చిత్రంలో కూడా తాను నటించడం సులువైందని ఆయన అన్నారు. 13ఏళ్ల సినీ ప్రయాణంలో జయం, అపజయం అనేది మన చేతుల్లో లేదని, మొదటి నుంచి తన పనిని తాను ప్రేమిస్తూ వచ్చానని, అయితే సినిమాను మార్కెట్ చేసుకోవడం తనకు తెలియనిపని అని, ప్రస్తుతం ఉన్న హీరోలతో పోటీ పడాలంటే సినిమాను వ్యాపార వస్తువుగా కూడా అవగాహన చేసుకునే తత్వం ఉండాలని ఆయన అన్నారు. ఉగాది రోజున విడుదల కానున్న ఈ చిత్రం తప్పక విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందని, త్వరలో సుధీర్‌వర్మ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ కమర్షియల్ సినిమాలో నటించనున్నానని ఆయన వివరించారు.
గతంలో తాను నటించిన శ్రీరామ్ చిత్రంలో పోలీస్ ఉద్యోగంకోసం పోరాడితే జైశ్రీరామ్ చిత్రంలో
english title:
action
Date:
Wednesday, April 10, 2013