అంజలి నీకు ఏ సమస్య ఉన్నా నిన్ను ఆదుకోవడానికి తెలుగు పరిశ్రమ సిద్ధంగా ఉందని, నీవు ఇలా చెప్పాపెట్టకుండా వెళ్లిపోవడంవల్ల పెద్ద చిత్రాల షూటింగ్‌లకు అంతరాయం కలుగుతోందని, ఇది హర్షణీయం కాదని, దయచేసి ఎక్కడ ఉన్నా నీ క్షేమ సమాచారాలతో సంప్రదించవలసిందిగా కోరుతున్నామని క్రేజీ చిత్ర నిర్మాత సురేష్ కొండేటి విజ్ఞప్తి చేశారు. ఆర్య, హన్సిక, అంజలి ప్రధానపాత్రధారులుగా నటించిన క్రేజీ చిత్రం విడుదల సందర్భంగా ఆయన ఈ మాటలు తెలిపారు. కన్నన్ దర్శకత్వంలో కె.వి.శ్రీ్ధర్‌రెడ్డి సమర్పణలో రూపొందిన ఈ చిత్రం బాలీవుడ్‌లో విడుదలైన ఢిల్లీబెల్లీ చిత్రానికి రీమేక్‌గా నిర్మించారు. తమిళంలో సేట్టైగా విడుదలైన ఈ చిత్రం గూర్చి నిర్మాత సురేష్ మాట్లాడుతూ ఉగాదినాడు చిత్రం విడుదలవుతుండడం ఆనందంగా వుందని, దాదాపు 200 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని, అంజలి విషయం బాధాకరమని, ఆమెను ఎవరూ కిడ్నాప్ చేయలేదు కానీ కుటుంబ కలహాల నేపధ్యంలో ఎటో వెళ్లిపోయిందని ఆయన వివరించారు. చిత్ర సమర్పకుడు శ్రీ్ధర్‌రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే ఇటీవల విడుదలైన ఆడియో పెద్ద హిట్‌గా మారిందని, తమిళంలో కూడా చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతోందని, స్క్రీన్‌ప్లే హైలెట్‌గా నిర్మించిన ఈ చిత్రం ప్రేమిస్తే చిత్రంలా విజయవంతమవ్వాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాగర్ పాల్గొన్నారు.
అంజలి నీకు ఏ సమస్య ఉన్నా నిన్ను ఆదుకోవడానికి తెలుగు పరిశ్రమ సిద్ధంగా ఉందని,
english title:
anjali
Date:
Thursday, April 11, 2013