అనేక చిత్రాల్లో కథ, మాటలు అందించిన రచయిత కోనా వెంకట్ ఇటీవల ఓ తెలుగు దినపత్రికలో ఇచ్చిన ఇంటర్‌వ్యూలో విషయాలు, వ్యాఖ్యలు ఆక్షేపణీయాలని దర్శకుల సంఘం ఆరోపించింది. మాటల రచయిత వెంకట్ ఇటీవల ఓ తెలుగు దినపత్రికలో ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుల వల్ల తాను ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులను తెలిపారు. ఈ నేపధ్యంలో హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ హాలులో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుల సంఘం తరఫున వి.సాగర్, మద్దినేని రమేష్, శ్రీనాధ్ పాల్గొని వెంకట్ వ్యాఖ్యలను కొట్టివేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెంకట్‌కు ఎటువంటి అభ్యంతరాలున్నా అది డైరెక్టర్స్ అసోసియేషన్‌లో పెట్టి శాంతియుతంగా పరిష్కరించుకోవాలి కానీ అనవసరమైన రాద్ధాంతాలు చేయకూడదని, ఆయన కూడా రైటర్స్ అసోసియేషన్‌లో మెంబరు కనుక పరిస్థితిని అందరూ సానుకూలంగా పరిశీలిస్తారని, పర్సనల్ ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కరించుకోవాలి గానీ దర్శకులందరూ చెడ్డవారు అని చెప్పడం సబబుకాదని తెలిపారు. గత రెండు రోజుల్లో ఆయనను చర్చలకు ఆహ్వానిస్తే వస్తాను అని చెప్పి రాలేదని, మనసు కవి ఆత్రేయతో తాను కలసి మద్యపానం చేశానని చెప్పడం ఓ రైటర్‌గా అతని స్థాయికి తగిన విషయాలు కాదని, ఏ విషయాలు చెప్పాలో ఏ విషయాలు చెప్పకూడదో తెలియకుండా వ్యాఖ్యానాలు చేయడం మంచి పద్ధతి కాదని, ఆయనకు ఏ సమస్య ఉన్నా అసోసియేషన్‌కు వచ్చి పరిష్కరించుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
అనేక చిత్రాల్లో కథ, మాటలు అందించిన రచయిత కోనా వెంకట్
english title:
v
Date:
Thursday, April 11, 2013