హైదరాబాద్, ఏప్రిల్ 12: బిహెచ్‌ఇఎల్ హైదరాబాద్ యూనిట్ 2012-13 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.6,999 కోట్ల టర్నోవర్ సాధించింది. రూ.1650 కోట్ల లాభం ఆర్జించినట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(హెచ్‌పిఇపి) ఎన్ రవిచందర్ వెల్లడించారు. రామచంద్రాపురంలోని సంస్థ పరిపాలన భవనంలో శుక్రవారం ఏర్పాటు చేసిన వార్షిక పత్రికా సమావేశంలో వివరాలను వెల్లడించారు. హెచ్‌పిఇపి విభాగంలో 6,490 కోట్ల టర్నోవర్ సాధించడం ద్వారా 1525 కోట్ల లాభాలు పొందినట్లు చెప్పారు. ప్రాజెక్ట్ ఇంజనీరింగ్, సిస్టమ్స్ డివిజన్‌కు సంబంధించి 509 కోట్ల టర్నోవర్ ద్వారా 125 కోట్ల లాభం సాధించినట్లు ఆ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అరవింద్ గుప్త వివరించారు. పరిశోధన, అభివృద్ధికి రూ.171 కోట్లు వెచ్చించినట్లు భెల్ ఇడి రవిచందర్ పేర్కొన్నారు. బిజినెస్ ఎక్సెలెన్స్ అవార్డు, ఐఎస్‌వో 27001 సర్ట్ఫికెట్, ప్రధాన మంఅతి శ్రమశ్రీ అవార్డులను తమ యూనిట్ సాధించిందని తెలిపారు. సామాజిక బాధ్యతలో భాగాంగా పరిసర గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు.
శుక్రవారం జరిగిన బిహెచ్‌ఇఎల్ వార్షిక సమావేశం