తిరుపతి, ఏప్రిల్ 13: తిరుమల శ్రీవారి ఆలయంలోని వంటశాల (పోటు) శనివారం సాయంత్రం 5.30 గంటలకు స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. అయితే పోటులో లడ్డు, వడ తయారు చేస్తుండగా నెయ్యి ద్వారా విడుదలయ్యే పొగ దట్టంగా ఉండటంతో ఈ మంటలకు నల్లటి పొగలు ఎగజిమ్మాయి. దీంతో ఆలయంలో భారీ అగ్నిప్రమాదం జరిగిందని ఇటు స్థానికులు, భక్తులు ఆందోళనకు గురైయ్యారు. అధికారులకు కూడా ఆందోళన చెందారు. అయితే గతంలో ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నా ఈసారి సిబ్బంది మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే రెండు ఫైరింజన్లు అక్కడకు చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది తక్కువ వ్యవధిలోనే మంటలను అదుపు చేయగలిగారు. కాగా ఈ మంటల కారణంగా అక్కడ ఉన్న బూందీ, నెయ్యిడబ్బాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. సమాచారం తెలుసుకున్న తిరుమల జేఇఓ శ్రీనివాసరాజు , ఇఒ ఎల్వీ సుబ్రహ్మణ్యం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా పోటులో మంటలు రేగడానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమని ఒక వాదన వినిపిస్తోంది. (చిత్రం) తిరుపతి శ్రీవారి ఆలయ పోటులో శనివారం సంభవించిన అగ్ని ప్రమాదంతో కమ్ముకున్న దట్టమైన పొగలు
తిరుమల శ్రీవారి ఆలయంలోని వంటశాల (పోటు) శనివారం సాయంత్రం
english title:
fire accident
Date:
Sunday, April 14, 2013