హైదరాబాద్, ఏప్రిల్ 13: మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో ద్రవ్యోల్భణం ప్రభావంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల బంగారం ధర ఒక్కరోజే 1300 రూపాయలు తగ్గింది. కిలో వెండి ధర 2800 తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 28,150 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం ధర 27,600 రూపాయలు కిలో వెండి ధర 49,700 రూపాయలు పలికింది. ధరలు ఇంకా తగ్గుతాయేమోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు. 10 గ్రాముల బంగారం ధర 25వేలకు చేరుకుంటే కొనుగోలు కూడా బాగా పెరుగుతాయని వ్యాపారస్తులు భావిస్తున్నారు. గత కొద్దిరోజులుగా పసిడి సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయిందని ప్రజలు అంటున్నారు.
మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి
english title:
gold and silver
Date:
Sunday, April 14, 2013