విశాఖపట్నం, ఏప్రిల్ 14: గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థలో అనకాపల్లి, భీమిలి మున్సిపాలిటీలతోపాటు, కొన్ని గ్రామాలను కూడా విలీనం చేయాలన్న ప్రతిపాదనపై సోమవారం హైదరాబాద్‌లో సమీక్ష జరగనుంది. ఇటీవల జిల్లాలో పర్యటించిన హామీల కమిటీ ముందుకు వచ్చిన వివిధ అంశాలపై సోమ, మంగళవారాల్లో చర్చ జరగనుంది. ఇందులో జివిఎంసికి చెందిన విలీనం, పార్కింగ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తదితర అంశాలపై చర్చ జరగనుంది. ఇప్పటికే జివిఎంసిలో అనకాపల్లి, భీమిలి మున్సిపాలిటీల విలీనాన్ని వద్దంటూ ఎంపి పురంధ్రీశ్వరి గట్టిగా పట్టుపడుతున్నారు. అయితే, మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు చింతలపూడి, అవంతి శ్రీనివాస్ విలీనానికి అనుకూలంగా ఉన్నారు. ఇప్పుడు ఈ అంశం రాజకీయమైంది. ఎవరి పంతం నెగ్గుతుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. విలీనాన్ని మెజార్టీ ప్రజలు వద్దనుకుంటున్నారు. జివిఎంసి పాలకవర్గం ఉన్నప్పుడు కూడా విలీన ప్రతిపాదనను తిరస్కరించింది. జివిఎంసి పాలకవర్గం అనుమతి లేకుండా విలీనాన్ని ఏవిధంగా చేస్తారు. అలాగే, పంచాయతీల పాలకవర్గం లేకుండా గ్రామాలను జివిఎంసిలో ఏవిధంగా విలీనం చేస్తారు? ఒకవేళ విలీనం చేయాల్సి వస్తే, ప్రజాభిప్రాయ సేకరణ జరపాల్సి ఉంది. ప్రస్తుతం వివిధ పరిశ్రమల స్థాపనకు సంబంధించి నిర్వహిస్తున్నా ప్రజాభిప్రాయ సేకరణల్లో 99 శాతం మంది కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నా, వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా, పనులు సాగిస్తున్నారు. అయితే, ఈ మున్సిపాలిటీల విలీనం విషయంలో అది సాధ్యం కాదని తెలుస్తోంది. ఇప్పటికే వివిధ పార్టీలు విలీనాన్ని వ్యతిరేకిస్తున్నాయి.
కాంగ్రెస్‌లో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు విలీనాన్ని తప్పుపడుతున్నారు. విలీనానికి పాజిటివ్‌గా ఉన్న వారు తమ అభిప్రాయాలను మార్చుకోవలసి ఉంటుందిన అధికారపక్ష నాయకులే చెబుతున్నారు.
గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థలో అనకాపల్లి, భీమిలి
english title:
merger controversy
Date:
Monday, April 15, 2013