విశాలాక్షినగర్, ఏప్రిల్ 14: అంబేద్కర్ రాజ్యాంగ రచనతోనే భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వానికి పునాది పడిందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్ అన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం మర్రిపాలెంలోని అంబేద్కర్ భవన్‌లో 122వ జయంత్యుత్సవం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సమాజంలో బడుగు, బలహీన వర్గాల సంక్షేమంతో పాటు అభివృద్ధి కోసం రాజ్యాంగ బద్దంగా హక్కులు కల్పించారన్నారు.
ధనిక, పేద తారతమ్యం లేకుండా అందరికి సమాన హోదా కల్పించేది విద్య ఒక్కటేనని గుర్తించారన్నారు. ప్రతిఒక్కరూ ఉన్నత విద్యలను అభ్యసించాలని అంబేద్కర్ ఆకాంక్షించారని పేర్కొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ శేషాద్రి మాట్లాడుతూ దేశంలో సామాజికంగా అందర్ని సమైక్య పరిచిన ఘనత డాక్టర్ అంబేద్కర్‌కే దక్కుతుందని అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ద్వారా అందరికీ సమానమైన హోదా, అవకాశాలు కల్పంచారని గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, డాక్టర్ మళ్ల విజయప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు జి. సుమన, జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, అదనపు సంయుక్త కలెక్టర్ వై. నరసింహారావు, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు డి. శ్రీనివాసన్, ఎస్సీ కార్పొరేషన్ ఇడి నంబూద్రిపాల్, దళిత నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.
అంబేద్కర్ రాజ్యాంగ రచనతోనే భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వానికి
english title:
unity in diversity
Date:
Monday, April 15, 2013