విజయనగరం, ఏప్రిల్ 14: ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి జిల్లా పర్యటనకు వస్తున్న సందర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 16న గజపతినగరం మార్కెట్ యార్డు వద్ద అమ్మ హస్తం పథకాన్ని ప్రారంభించనున్నారు. ఆ రోజు మధ్యాహ్నాం 3 గంటలకు హెలీకాఫ్టర్‌లో ముఖ్యమంత్రి నేరుగా గజపతినగరం చేరుకుంటారు. ముందుగా అమ్మ హస్తం పథకం ప్రారంభించిన అనంతరం లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ తరువాత వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలిస్తారు. కాగా, ఎన్నికల ముందర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లా పర్యటనకు రానుండటంతో ఈ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకొంది. ముఖ్యమంత్రి మూడో దఫా జిల్లాకు విచ్చేస్తుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా ఉత్సాహం నిండుకుంది. గతంలో బొబ్బిలి, నెల్లిమర్లలోని గుషిణి ప్రాంతాలకు వచ్చారు. .ఇప్పటికే సభాస్థలిని పలుమార్లు అధికారులు పరిశీలించి పూర్తి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సభా వేదిక, బారికేడ్లు, హెలీప్యాడ్ నిర్మాణం, స్టాళ్ళ ఏర్పాటు, ప్రజానీకానికి వేర్వేరు ప్రవేశాలు కల్పించారు. మార్కెట్ యార్డు ఆవరణలో సభా వేదిక, విఐపిల మార్గం, బహిరంగ సభకు ప్రత్యేక ప్రవేశ మార్గాలు ఏర్పాటు చేశారు.జిల్లాలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలను తెలియజేసే 21 ప్రదర్శన శాలలను ఏర్పాటు చేశారు. కాగా, రూ.50 కోట్ల రుణాలు, మరో రూ.50 కోట్ల విలువైన ఆస్తుల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. ఇదిగాకుండా గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు అందించేందుకు ఏడు అంబులెన్స్ వాహనాలను ఆ రోజు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేశారు.
ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి జిల్లా పర్యటనకు వస్తున్న
english title:
cm's tour
Date:
Monday, April 15, 2013