గజపతినగరం, ఏప్రిల్ 14 : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటన సందర్భంగా పటిష్ఠ భద్రతా చర్యలు తీసుకోవాలని విశాఖ రేంజి డిఐజి స్వాతిలక్రా ఆదేశించారు. ఆదివారం మధ్యాహ్నం స్థానిక మార్కెట్ కమిటీ యార్డులో మంగళవారం జరగనున్న సిఎం సభా ఏర్పాట్లను డిఐజి పరిశీలించారు. అలాగే హెలీప్యాడ్ నుంచి ముఖ్యమంత్రి వచ్చే వరకు రహదారులు పరిశీలించారు. సభకు ఎడమ వైపున వివిధ శాఖలకు చెందిన స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నందున ప్రజలు సభా వేదిక వద్దకు రాకుండా వేరే మార్గం ద్వారా సభా ప్రాంగణంలోకి వెళ్ళే ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే భద్రతా ఏర్పాట్ల దృష్యా విఐపి పాసులు ఉన్న వాహనాలు మాత్రమే ఎఎంసి గ్రౌండులోకి అనుమతులు ఇవ్వాలన్నారు. అలాగే సభ జరుగుతున్నంత సేపు సభచుట్టూ ఎక్కడబడితే అక్కడ ఉండకుండా సభా ప్రాంగణంలోకి పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అమ్మహస్తం ప్రారంభం సందర్భంగా లబ్ధిదారులను విఐపిలతోపాటు ప్రత్యేకంగా వారికి స్థానాలు కల్పించాలన్నారు. సభకు ఒక్కరోజు సమయం ఉన్నందున ఎఎంసి చుట్టూ పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి అనుమానితులను గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్పీ కార్తికేయ, ఎఎస్పీలు టి.మోహనరావు, రాహుల్‌దేవ్‌శర్మ, జెసి పిఎ శోభ, ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య, డిఎస్సీ ఫల్గుణరావు, సిఐ ఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటన సందర్భంగా పటిష్ఠ భద్రతా
english title:
swati lakhra
Date:
Monday, April 15, 2013