విజయనగరం, ఏప్రిల్ 14 :భరతజాతికి దిశను నిర్దేశించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. అంబేద్కర్ జయంతి స్థానిక అంబేద్కర్ కళ్యాణ మండపంలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా కోలగట్ల అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అట్టడుగు స్థాయి నుంచి భారత రాజ్యాంగం రచించే స్థాయికి ఎదిగిన అంబేద్కర్ కృషి, పట్టుదల అందరికీ ఆదర్శ నీయమన్నారు. జిల్లా కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ సమస్యల పరిష్కారానికి, అభ్యున్నతికి, సంక్షేమానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక పకడ్భందీగా అమలు చేయడానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇందిరమ్మ కలల గ్రామ సభను జరుపుతున్నామన్నారు. జిల్లాలో 3.5 కోట్ల రూపాయలతో ఎస్సీ, ఎస్టీ వసతి గృహాల ఆధునికీకరణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ బిహెచ్‌ఎస్ వెంకటరావు, జెడ్‌పి సిఇఓ ఎన్.మోహనరావు, ఆర్డీఓ రాజకుమారి, సోషల్‌వేల్ఫేర్ డిడి జీవపుత్రకుమార్, డిఆర్‌డిఎ, మెప్మా, డుమా, ఐసిడిఎస్ పిడిలు జ్యోతి, రమణ, శ్రీరాములనాయుడు, రాబర్ట్స్, ఎస్సీ సోసైటీ ఇడి మనోరమ, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు బాలాజీ జంక్షన్‌లోని అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య పూలమాల వేసి ఘననివాళులర్పించారు. పలు దళిత సంఘాల నాయకులు జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని బాబాసాహెబ్‌కు నివాళులర్పించారు.
భరతజాతికి దిశను నిర్దేశించిన మహోన్నత వ్యక్తి
english title:
ambedkar
Date:
Monday, April 15, 2013