మామిడి చెట్టు జిగురును నువ్వుల నూనెతోగాని, కొబ్బరినూనెతోగాని కలిపి ఆరారా రాస్తుంటే, గజ్జి, చిడుము, దురదలు తగ్గుతాయి.
రావిచెట్టు బెరడు కషాయం కాచి పుక్కిలించితే నోటి పూత తగ్గుతుంది. ఈ కషాయంతో కడుగుతూంటే దీర్ఘకాలంగా ఉన్న పుళ్లు, వ్రణాలు మానుతాయి. గుండ చేసి రాసినా మంచి ఫలితముంటుంది.
‘జిల్లేడు వేరును’ నూరి రాసినా, పట్టు వేసినా బోదకాలు తగ్గిపోతుంది.
శొంఠి గంధం, మంచి గంధం కలిపి పట్టువేస్తే తలనొప్పి తగ్గుతుంది. దాల్చిన చెక్క రసం కఫాన్ని, వాతాన్ని తగ్గిస్తుంది.
‘పెద్దములకవేరు’గాని, చిన్న ములక వేరు రసంగాని తేనెతో కలిపి రాస్తూ లోనికి పుచ్చుకుంటుంటే పేను కొరుకుడు తగ్గి జుట్టు మొలుస్తుంది.
‘ములకవేరు’ గురివింద వేరు నూరి (తాజాగా ఉండాలి) బట్టతలపై రాస్తూంటే క్రిములు చనిపోయి, జుట్టు మొలుస్తుంది.
గంజాయి వేళ్ళుగాని, ఆకులు గాని, నూరి రాస్తే జుట్టు మొలుస్తుంది.
బీట్‌రూట్ రసాన్ని వేసి దుంపని నూరి ఆ ముద్దను ముఖానికి పట్టించి ఆరాక సున్నిపిండితో రుద్దుకుంటే ముఖం కాంతివంతవౌతుంది.
మామిడి చెట్టు జిగురును నువ్వుల నూనెతోగాని
english title:
herbs
Date:
Wednesday, April 17, 2013