న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: చైనాలోని నాంజింగ్‌లో వచ్చే ఏడాది జరుగనున్న యూత్ ఒలింపిక్ గేమ్స్ బాలుర విభాగంలో పోటీపడేందుకు భారత వెయిట్‌లిఫ్టర్లు రెండు కోటా బెర్తులు కైవసం చేసుకున్నారు. కజకిస్తాన్ రాజధాని తాష్కెంట్‌లో ఇటీవల ముగిసిన ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్స్‌లో భారత లిఫ్టర్లు రాహుల్ రాగాల వెంకట్ బాలుర 77 కిలోల విభాగంలో ఒక రజత పతకంతో పాటు కాంస్య పతకాన్ని కైవసం చేసుకోగా, బాలుర 50 కిలోల విభాగంలో జంజాంగ్ దేరు రజత పతకాన్ని సాధించాడు. దీంతో బాలుర విభాగంలో భారత్ మొత్తం 125 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో నిలువడంతో యూత్ ఒలింపిక్ గేమ్స్‌లో భారత లిఫ్టర్లకు రెండు కోటా బెర్తులు లభ్యమయ్యాయి. అయితే బాలికల విభాగంలో భారత్ 72 పాయింట్లు సాధించి 16వ స్థానంలో నిలువడంతో యూత్ ఒలింపిక్ గేమ్స్ కోటా బెర్తు తృటిలో చేజారింది.
చైనాలోని నాంజింగ్‌లో వచ్చే ఏడాది
english title:
u
Date:
Wednesday, April 17, 2013