బొబ్బిలి, ఏప్రిల్ 17: ఎన్‌సిఎస్ యాజమాన్యం చెరకు రైతుల పట్ల నిర్లక్ష్యం చూపుతోందని, అందుకు తగిన మూల్యం చెల్లించకతప్పదని రైతు సంక్షేమసంఘం అధ్యక్షుడు వేమిరెడ్డి లక్ష్మునాయుడు ఆరోపించారు. బుధవారం చెరకు అభివృద్ధి కేంద్రం సూపర్‌వైజర్‌కు చెరకు రైతుల సమస్యలకు సంబంధించిన వినతిపత్రాన్ని అందించారు. అనంతరం విలేఖర్లతో మాట్లాడుతూ బిల్లుల చెల్లింపులో నిర్లక్ష్యంతోపాటు బ్రెజిల్ నుంచి ముడి పంచదారను దిగుమతి చేసుకుని కర్మాగారం ద్వారా ఆడించి విక్రయించుకోవడం దారుణమన్నారు. బిల్లులు చెల్లించాలని పలు పర్యాయాలు ఆందోళన చేస్తున్నప్పటికీ పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. అయినప్పటికీ ప్రజాప్రతినిదులు కనీసం నోరుమెదపడం లేదని ఆరోపించారు. ఇప్పటికైన ఫ్యాక్టరీ యాజమాన్యం స్పందించి చెరకు రైతుల సమస్యలను పరిష్కరించాలని లేనిపక్షంలో ఫ్యాక్టరీ వద్ద నిరవదిక దీక్షలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మోహనరావు, శ్రీనివాసరావు, లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు.
‘షాపుల్లో సిబ్బందికి నియామకపు లేఖలు’
4.సమావేశంలో మాట్లాడుతున్న లేబర్ ఆఫీసర్ విజయకుమార్‌రెడ్డి
పార్వతీపురం, ఏప్రిల్ 17: షాపుల్లో పనిచేసే వారికి కచ్చితంగా నియామకపు లేఖలు ఇవ్వాలని పార్వతీపురం కార్మికశాఖాధికారి సిహెచ్ విజయ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం స్ధానిక కార్మికశాఖాధికారి కార్యాలయంలో దుకాణాల (వ్యాపార) ప్రతినిధులు, కార్మిక సంఘ నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ షాపుల్లో పనిచేసే వారికి నియామకపు ఉత్తర్వులు ఇవ్వకుంటే తమ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే వెంటనే నియామకపు లేఖలు ఇప్పించే చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. వ్యాపారాలు నిర్వహిస్తున్న దుకాణదారులు ఏర్పాటు చేస్తున్న బోర్డులు కచ్చితంగా తెలుగులోనే ఉండాలన్నారు. ఇతర భాషాల్లో బోర్డులున్నప్పటికీ మొదటి ప్రాధాన్యత తెలుగుకే ఇవ్వాలన్నారు. ప్రతి దుకాణ నిర్వాహకులు తమ షాపునకు రిజిస్ట్రేషన్ కచ్చితంగా చేయించుకోవాలని, అలాగే రిజిస్ట్రేషన్ నవీనీకరణ కూడా చేయించుకోవాలన్నారు. ఇలాంటి వాటికోసం ఈనెల 24న రాష్ట్ర వ్యాప్తంగా మెగా రిజిస్ట్రేషన్, రెన్యువల్ మేళాను నిర్వహిస్తున్నట్టు విజయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. రిజిస్ట్రేషన్లు, రెన్యువల్ చేయని షాపులపై మే నెలలో తమశాఖ పరంగా సర్వేచేస్తామన్నారు. అయితే రిజిస్ట్రేషన్లు, రెన్యువల్ చేయని షాపులు ఉంటే కచ్చితమైన చర్యలు తీసుకుంటామని కార్మికశాఖాధికారి హెచ్చరించారు. ఇదిలా ఉండగా భవన నిర్మాణ కార్మికుల కోసం కొత్తగా ఒక జీవోను విడుదల చేసిందని విజయకుమార్ రెడ్డి తెలిపారు. భవన నిర్మాణ కార్మికులు గతంలో పని చేసిన చోట ప్రమాదవశాత్తు మృత్యువాత పడితే ప్రమాద బీమా రూ.2లక్షలు చెల్లించేందుకు కార్మికశాఖ చర్యలు తీసుకునేదని, కొత్త నిబంధనలు ప్రకారం భవన నిర్మాణ కార్మికులు ప్రమాదావశాత్తు మృత్యువాత పడితే అలాంటి వారికి సైతం ప్రమాదబీమా వర్తించే వీలు కల్పించే చర్యలు కార్మికశాఖ చేపట్టిందన్నారు. ఈ సమావేశానికి కార్మికవర్గాల తరుపున సిటూ నాయకుడు బొత్స వెంకటరమణ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరుపున పెంటపాటి కిరణ్, బట్టల వర్తక సంఘం తరుపున గోపాల
ఎన్‌సిఎస్ యాజమాన్యం చెరకు రైతుల పట్ల నిర్లక్ష్యం చూపుతోందని,
english title:
c
Date:
Thursday, April 18, 2013