Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

‘ఆన్‌లైన్’ నమః!

$
0
0

ప్రపంచం మారిపోతోంది, ప్రపంచీకరణలో

భాగంగా విశ్వం కుగ్రామంగా పరిణామం

చెందుతున్న దశలో విద్య, అభ్యసన,

పరిపాలన, నిర్వహణ సైతం సరికొత్త

రూపాన్ని సంతరించుకుంటోంది. విద్యార్థి

తరగతి గదిలోని నల్లబల్ల-చాక్‌పీస్

స్థానంలో ఎలక్ట్రానిక్ పరికరాలను

వెతుక్కుంటున్నాడు, కంప్యూటర్‌ను

వౌస్‌ను వినియోగించుకుంటున్నాడు.

తరగతి గదిలో టీచర్ స్థానంలో

ఇ-లెర్నింగ్ మెటీరియల్

అత్యవసరమైంది. వర్చ్యువల్‌గా తన

అనుమానాలను తీర్చుకుంటున్నాడు.

తరగతి గదిలో నేర్చుకునేందుకు ఉన్న

ఆంక్షలు, పరిమితులను

చెరిపేస్తున్నాడు. ఎపుడు

కావాలనుకుంటే అపుడే నేర్చుకునేలా

కొత్త సాంకేతికత విద్యార్థికి దోహదం

చేస్తోంది. ప్రవర్తనలో, పరిపక్వతలో,

సంపూర్ణ మూర్తిమత్వాన్ని

సాధించడంలో ఉపాధ్యాయుడు లేని

లోటును కొత్త సాంకేతికత

మైమరిపిస్తోంది. అప్పటికపుడే విద్యార్థి

స్థాయిని, కౌశలాలను, నేర్చుకున్న

అంశాలపై పట్టును సాధించడమేగాక,

తన అభ్యసన అవరోధాలను శాస్ర్తియంగా

గుర్తించి లోపాలను పసిగట్టి

ఎత్తిచూసేందుకు ఎంతో దోహదం

చేస్తోంది. ఈ క్రమంలో వచ్చిందే ఇ

లెర్నింగ్, ఆన్‌లైన్ యంత్రాంగం.
నేడు ఏం మాట్లాడినా అంతా ఆన్‌లైన్,

ఆధార్ మొదలు, రేషన్‌కార్డు

కావాలన్నా, అడ్మిషన్లకు దరఖాస్తు

చేయాలన్నా, పరీక్ష రాయాలన్నా,

ఫలితాలు చూడాలన్నా, కొత్త కోర్సుల్లో

చేరాలన్నా ఏం చేయాలన్నా ఆన్‌లైన్

వ్యవహారమే. పాఠ్యాంశాలను

నేర్చుకునేందుకు ఇపుడు ఆన్‌లైన్‌లో

అవకాశాలు విస్తృతమయ్యాయి.
దేశవ్యాప్తంగా ఉన్నత సాంకేతిక విద్యా

కోర్సుల్లో బోధకుల కొరతను, సరికొత్త

పాఠ్యాంశాల్లో తర్ఫీదు పొందిన టీచర్ల

కొరతను సైతం ఈ లెర్నింగ్, ఆన్‌లైన్

లెర్నింగ్ విద్యార్ధులకు ఎంతో

తోడ్పాటును అందిస్తుంది.
నిజానికి నిత్యజీవితంలో విద్యార్థి తన

లక్ష్యాన్ని చేరుకోవడానికి దోహదపడేదే

కరిక్యులమ్. దానినే మనం

పాఠ్యప్రణాళిక అంటున్నాం. ఇంటికి

బదులు పాఠశాల విద్యకు

కారకత్వమైంది, ప్రస్తుత సంస్కృతి

నుండి తెలియని భవిష్యత్ సంస్కృతికి

మారడం, ఆధార, స్వతంత్రత వ్యక్తి

స్థిరత్వాల సహజ షరతుల స్థావరంగా

కూడా మనం చెప్పవచ్చు. చిన్నవారిని

విద్యావంతులుగా చేసే సమగ్ర

ప్రయత్నంలో అతిపెద్ద అంశమే

కరిక్యులమ్. ఇందులో మూడు

మూలాధారాలు ఉంటాయి. చదువుల

కార్యక్రమం, కృత్యాల కార్యక్రమం,

దారిచూపే కార్యక్రమం. విద్యార్థి

పెరుగుదలకు తగిన సూచనల

రూపకల్పన నిర్మాణం. ఇది ఆశయాలు

ఏర్పరచిన విలువలపైనా,

విద్యాలక్ష్యాలపైనా, ఉద్దేశాలపైనా

ఆధారపడి ఉంటుంది. కనుక

కరిక్యులమ్ ఆశయాల సాధనకు లక్ష్యాల

గుర్తింపునకు, ఉద్దేశాలను

నెరవేర్చేందుకు సహకరిస్తుంది. వ్యక్తిగత

సమస్యలతో పాటు, వ్యక్తికి

విద్యాకార్యక్రమానికి సమైక్యశక్తి,

దాంతో పాటు సంయుక్త స్వయం

సేవలను అందిస్తుంది.

సప్రమాణతాయుతమైన ఈ కార్యక్రమం

విద్యార్థులకు భవిష్యత్ చూపుతుంది.

ప్రస్తుతం బోధనకు శిక్షణ వనరులుగా

భిన్నమైనవి, వక్రమైనవి

వినియోగిస్తున్నారు. సాంకేతిక

విపరీతకల్పన, రాత వస్తువులు అతిగా

వ్యాప్తి చెందడం వల్ల పాఠ్యప్రణాళిక

విషయం వినియోగసాధనంచేత,

వనరుల చేత ప్రభావితం అవుతోంది.

విషయాంశాలతో పాటు వనరులు

పాఠ్యప్రణాళికలో భాగమయ్యాయి.

అయితే బోధనలో వచ్చిన కొత్త

పద్ధతులు సరిహద్దులు దాటించి

సఫలతను అందిస్తున్నాయి.
అభ్యాసకుల జీవితానికి సంబంధం ఉన్న

వాస్తవికమైన విద్యావ్యవస్థను

తయారుచేయడానికి-అభివృద్ధి

చేయడానికి భారతదేశంలో ఒక అతి పెద్ద

విప్లవం మొదలైంది. ఇందుకోసం విద్యా

సాంకేతికం కీలకమైన పాత్రను

పోషిస్తోంది. భారత విద్యావ్యవస్థను

ఒత్తిడి చేస్తున్న కొన్ని సమస్యల

పరిష్కారానికి వ్యవస్థా పద్ధతి

అందుబాటులో ఉన్నా, అన్ని వనరుల

వినియోగం- అభ్యసనం సమస్యలకు

పరిష్కారంగా ప్రధాన దారులు చూపేవిగా

ఉన్నాయి. విద్యాసాంకేతికం

సమర్ధవంతమైన అవిరళ ఉపయోగానికి

తగిన ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ప్రధానంగా విద్యాసూక్ష్మ పద్ధతులు

(ఎడ్యుకేషనల్ టెక్నిక్స్) తగిన

సాఫ్ట్‌వేర్‌ను, సరికొత్త ఉపకరణాలను

భారీ ఎత్తున ఉత్పత్తి చేయాల్సి ఉంది.

పరిశోధన ద్వారా వాటిని నిరంతరం

అభివృద్ధి జరగాలి. బోధనకు తగిన

సూక్ష్మపద్ధతుల వినియోగం

ఉపాధ్యాయులకు సమర్ధవంతమైన

వృత్యంతర శిక్షణ అందించాల్సి ఉంది.
అన్ని భాషల్లో ఇ లెర్నింగ్, ఆన్‌లైన్

అభ్యసన పెద్ద ఎత్తున జరుగుతోంది.

దాదాపు అన్ని సబ్జెక్టుల్లో నిపుణులు

పెద్ద ఎత్తున పుట్టుకొచ్చారు. మెడ్‌ఆర్సీ

సంస్థ ప్రపంచంలో ఎంబిబిఎస్ కోర్సులో

ఏ ఒక్కరూ రూపొందించని రీతిలో 13

వౌలిక బోధనాంశాల్లో 6వేల

పాఠ్యాంశాలను రూపొందించి ఎలక్ట్రానిక్

పరిష్కారాలను సూచించింది.

పరిశ్రమల్లోనూ, ఆస్పత్రుల్లోనూ

దశాబ్దాలుగా పనిచేస్తున్న నిపుణులను

పిలిపించి వారితో పాఠాలను చెప్పించి

వాటిని ఎలక్ట్రానిక్ రూపంలో రికార్డు

చేశారు. ఇంటరాక్టివ్ బోర్డులో దానిని ఒక

పక్క ప్రదర్శిస్తూ మరో పక్క అందుకు

సంబంధించిన మల్టీమీడియా,

యానిమేషన్ ప్రదర్శన కళ్లకు కట్టినట్టు

360 డిగ్రీల్లో వీక్షించడం ద్వారా నేరుగా

జ్ఞాననాడులకు చేరేలా వీటిని

రూపొందించారు. ఉస్మానియా

యూనివర్శిటీలో బంగారు పతక గ్రహీత

అయిన డాక్టర్ నీరజ్ రాజ్ ఈ

గొప్పసాహసానికి పూనుకున్నారు.

ప్రపంచంలో ఎవరో ఒకరు ఏదో ఒక

సబ్జెక్టుకు పరిమితం కాగా అన్ని

సబ్జెక్టుల్లో ఈ తరహా కంటెంట్‌ను

రూపొందించడం ద్వారా డాక్టర్ నీరజ్

రాజ్ రికార్డు సృష్టించారు. ఇది వైద్య

రంగానికి సంబంధించింది.
అలాగే ఇంటర్మీడియట్, వివిధ జాతీయ

స్థాయి ప్రవేశపరీక్షలకు, పోటీ పరీక్షలకు,

అర్హత పరీక్షలకు సైతం ఆన్‌లైన్

మెటీరియల్ అందించే సంస్థలు,

వ్యక్తులు, అనుమానాలు తీర్చేవారు

కోకొల్లలుగా వచ్చారు. అలాంటి సంస్థల్లో

ప్రధానంగా చెప్పుకోదగ్గ మరో ఇ లెర్నింగ్

టెక్నాలజీ కంపెనీ నెక్ట్స్ ఎడ్యుకేషన్

ఇండియా. టెక్నాలజీ ఆధారిత

ఎడ్యుకేషన్ ఎంటర్‌ప్రైజ్ అయిన నెక్ట్స్

ఎడ్యుకేషన్ హైదరాబాద్ కేంద్రంగా తన

కార్యకలాపాలకు నిర్వహిస్తోంది.

2007లో ఐఐటి పూర్వ విద్యార్ధులు

దీనిని ఏర్పాటు చేశారు. కె-12

విభాగంలోని విద్యార్థులకు సిబిఎస్‌ఇ,

ఐసిఎస్‌ఎ , ఐజీసీఎస్‌ఈ , 23 ఇతర

భారతీయ రాష్ట్రాల బోర్డు సిలబస్‌కు

అనుగుణమైన కంటెంట్‌ను 8 భాషల్లో

ఇది అందిస్తోంది. కంపెనీ పాఠశాలలు,

విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఈ

సేవలను అందిస్తోంది. సంస్థ

ఉత్పాదనలు సిమ్యులేషన్స్,

ప్రయోగాలు, యానిమేషన్స్,

ఇంటరాక్టివ్ టూల్స్, ఫార్మటివ్,

సమ్మేటివ్ అసెస్‌మెంట్స్, యాక్టివిటీ

కిట్స్‌ను కలిగి ఉంటుంది. జీవం ఉట్టిపడే

లాంటి 2 డి, 3డి గ్రాఫిక్స్ , వాయిస్

ఓవర్,

అంతర్జాతీయ ప్రమాణాలకు

అనుగుణంగా అధికస్థాయి ఇంటరాక్టివ్ ,

స్పష్టమైన శబ్దం, ఇన్నోవేటివ్ కోర్సు

డిజైన్ వంటి ఎన్నో వినూత్న విశిష్ట

పరిశోధనాత్మక రూపకల్పనలను

ఇన్‌బిల్ట్ ఐఆర్ రిమోట్ ద్వారా ఎంతో

తేలికగా యాక్సిస్ చేసుకునే అవకాశం

ఈ నూతన విప్లవంలో సాధ్యమైంది.

విద్యార్థులకు డిజిటల్ క్లాసురూమ్

సొల్యూషన్స్, విద్యార్థులకు వైయుక్తిక

బోధనాభ్యసన పరిష్కారాలు, ఇంగ్లీషు,

సైన్స్, మాథ్స్‌లను తేలికగా అధ్యయనం

చేసుకునేందుకు వీలుకల్పించేవి,

ఆటోమెటెడ్ స్కూల్ మేనేజిమెంట్

పరిష్కారాలను రూపొందించారు.
నిజానికి మనం అర్ధశతాబ్దం క్రితం

ఎక్కడో ఉన్నాం, కాని నేడు

ప్రపంచంలోని అగ్రగామి దేశాల సరసన

పోటీపడుతూ ఆధునిక అభ్యసన

పద్ధతులను అనుసరిస్తున్నాం.
పరిశ్రమలు మానవ సహాయంతోనే

నడిచేటపుడు , బోధన ప్రక్రియ పలక,

నల్లబల్ల -సుద్ద, అచ్చు పుస్తకాలపై

ఆధారపడింది. 19వ శతాబ్ది

ప్రారంభంలో పరిశ్రమల రంగంలో

అనేకమార్పులు చోటు చేసుకున్నా,

అలాంటి విప్లవం విద్యారంగంలో చోటు

చేసుకోలేదు. గత 25 సంవత్సరాలుగా

ఈ రంగంలో కొంత మార్పు వస్తోంది. ఆ

మార్పులో భాగమే ఆధునిక

విద్యాబోధన. విద్యాసాంకేతికం పదం ఈ

సందర్భంగానే తొలిసారిగా యుకెలో

బ్రిన్మర్ జోన్స్ రిపోర్టులో వాడారు.
విద్యారంగంలో తొలి మూడు విప్లవాలుగా

భాషకు లిపి సృష్టించడం, కాగితం

తయారుచేయడం, ముద్రణ ప్రక్రియలను

చెబుతారు. ఎలక్ట్రానిక్ రంగంలో

పరిణామాలు అన్నీ ముఖ్యంగా రేడియో,

టివి, టేప్‌రికార్డర్, కంప్యూటర్ ప్రవేశ

ఫలితం ఇవన్నీ నాలుగోవిప్లవంగా

చెప్పవచ్చు. ఆ నాలుగో విప్లవమే

విద్యాసాంకేతికం.
విద్యాసాంకేతికం బహుముఖీనమై

విద్యాపాలనను సంపూర్ణంగా

మార్చేసింది.
1960కి ముందు నాటి

విద్యాసాంకేతికం అనే పదం దృశ్యశ్రవణ

ఉపకరణాలు తరగతి గదిలో బోధనకు

బోధనా సామగ్రితో ముడిపడి ఉండేది,

వేరే మాటల్లో చెప్పాలంటే ప్రత్యక్ష,

బోధనా అభ్యసనం కోసం ఉద్దేశించిన

సామాన్యమైన దృశ్య, శ్రవణ ఉపకరణాల

వినియోగమే విద్యా సాంకేతిక భావన.

కాని విద్యా సాంకేతికం,

బోధనోపకరణాలు కంటే భిన్నమైనది.

అది బోధనోపకరణాలను

వినియోగించుకోవచ్చు కాని

విద్యోపకరణాలకు పర్యాయపదం మాత్రం

కాదు. ఆ విధంగానే యంత్రాలుగాని,

సామూహిక ప్రసార సాధనాలైన రేడియో,

టివిల వాడకంలో ఉన్నా వాటికి

మాత్రమే పరిమితమైనది కాదు.
సమస్యల పరిష్కారానికి ఆధునిక

సాంకేతిక సూత్రాలను వినియోగించడం

ఒకవైపు, ఆధునిక ఇంజనీరింగ్

సూత్రాల వినియోగించి

విద్యుత్-యాంత్రికత ఉన్న సాధనాల

అభివృద్ధి, వాటికి విద్యోద్దేశాల వైపు

వాడటం ఇవన్నీ విద్యాసాంకేతిక

భావనలో భాగంగానే చెప్పవచ్చు.
బోధన అభ్యసనలకు వ్యవస్థావిశే్లషణ

వినియోగమే విద్యాసాంకేతికత

అవుతుంది.
విద్యారంగంలో రేడియో, టివి,

కంప్యూటర్, టేపురికార్డర్, చలన

చిత్రాలు, స్లయిడ్‌లు, హార్డ్‌వేర్- సాఫ్ట్‌వేర్

వినియోగం, పవర్‌పాయింట్

ప్రజెంటేషన్, ఇంటరాక్టివ్ బోర్డుల

ఉపయోగం శాస్త్ర సాంకేతిక రంగాల్లోని

ప్రగతి ఫలమే, పురోభివృద్ధి ఫలితమే.

కార్యక్రమయుత బోధన భావన,

అభ్యాసనా సిద్ధాంతాలు విద్యాసాంకేతికం

అర్థానికి, భావనకు కొత్త రూపాన్ని

సంతరించిపెట్టాయి. విద్యామనోవిజ్ఞాన

శాస్త్రం, విద్యా తాత్వికశాస్త్రం ,

విద్యామాపనం, మూల్యాంకనాల

విధంగా విద్యాసాంకేతికం కూడా ఒక

నూతన క్షేత్రంగా చెప్పవచ్చు.

అత్యధికంగా జనాభా పెరుగుదల,

విద్యలో గుణాత్మకమైన అభివృద్ధి

ఆవశ్యకతలపై 1972-73లలో

భారత ప్రభుత్వం ఒక విద్యా సాంకేతిక

ప్రాజెక్టును ప్రారంభించింది. మన దేశంలో

విద్యాసాంకేతిక రంగంలో జరుగుతున్న

కృషికి కేంద్రబిందువు ఒక విధంగా

ఎన్‌సిఇఆర్‌టి అని చెప్పవచ్చు.

1973లో విద్యాసాంకేతిక కేంద్రాన్ని

స్థాపించారు. మన రాష్ట్రంలో 1974-

75లో రాష్ట్ర విద్యా సాంకేతిక విభాగం

ఏర్పాటైంది. 1978లో ఎన్‌సిఇఆర్‌టి

దేశంలోని నాలుగు ప్రాంతీయ

విద్యాకళాశాల్లోనూ విద్యా సాంకేతిక

విభాగాలను ప్రారంభించింది. గత పది

సంవత్సరాలలో దేశంలోని అనేక

విశ్వవిద్యాలయాలు ఇటి సెల్స్‌ను

ఏర్పాటుచేసుకున్నాయి. మద్రాసులోని

టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లు

కూడా ఈ రంగంలో గణనీయమైన కృషి

చేశాయి. సుమారు 15 ఏళ్ల క్రితం

ఏర్పాటైన ఇండియన్ అసోసియేషన్ ఫర్

ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ అండ్ ఎడ్యుకేషనల్

ఇన్నోవేషన్ అనే సంస్థ విద్యా

సాంకేతికరంగం అభివృద్ధి,

పరిశోధనలకు సంబంధించిన విజ్ఞాన

విషయాలను దేశం నలుమూలల నుండి

సేకరించి విద్యావేత్తలకు అందించడం

కోసం ప్రతి ఏడాది దేశంలోని ఒక్కో

భాగంలో సమావేశాలను నిర్వహిస్తూ

ప్రశంసనీయమైన కృషి చేస్తోంది.

మానవ అభ్యసనా ప్రక్రియ అభివృద్ధికి,

వ్యవస్థల సాంకేతిక పద్ధతులు,

ఉపకరణాల అభివృద్ధి వినియోగం,

మూల్యాంకనం కలిపి మనం

విద్యాసాంకేతికంగా చెప్పవచ్చు. బోధన

శిక్షణల సార్ధకత సామర్థ్యాలను సంవృద్ధి

చేయడం, బోధనాభ్యసన , అభ్యసన

పరిస్థితుల గురించి శాస్ర్తియ జ్ఞానం

క్రమబద్ధమైన వినియోగమే

విద్యాసాంకేతికం అవుతుంది.

విద్యాగమ్యాలను చేరుకునేందుకు

ప్రావీణ్య పద్ధతులను శాస్ర్తియంగా

వినియోగించడం కూడా

విద్యాసాంకేతికమే. విద్య ,

శిక్షణావసరాలకు వినియోగించే ఆధునిక

నైపుణ్యం,పద్ధతులు, విద్యా ప్రక్రియకు,

శాస్త్ర సాంకేతిక రంగాల్లో సూత్రాలు,

నూతన ఆవిష్కరణల వినియోగంగా

విద్యాసాంకేతికాన్ని నిర్వచించవచ్చు.

విద్యా శిక్షణా సందర్భ సమస్యలకు

సైతం ఉపయోగించుకోవచ్చు. అభ్యసన

వనరుల నిర్వహణకు

క్రమశిక్షణాయుతం, క్రమబద్ధం అయిన

పోకడే లక్షణంగా ఉన్నదే

విద్యాసాంకేతికంగా చెప్పవచ్చు.

విద్యార్థులను, ఉపాధ్యాయులను

సాంకేతిక పద్ధతులను ఉపయుక్తమైన

మార్గాల్లోకి కలిపేందుకు , సంక్లిష్టమైన

కార్యక్రమాల్లో సైతం విద్యాసాంకేతికతను

భాగంగా చూడవచ్చు. మానవ

అభ్యసనా స్థితులకు శాస్ర్తియ ప్రక్రియ

వినియోగం, బోధన-అభ్యసనాల్లో

ఆధునిక పద్ధతుల, సాంకేతికాల

క్రమబద్ధమైన వినియోగంతో

సంబంధించినదే విద్యా సాంకేతికం.

కొన్ని సంప్రదాయకమైన, కొన్ని ఇంకా

ఉద్భవించాల్సిన వైవిధ్యం ఉన్న పాత్రల్లో

ఉపాధ్యాయులను కలుపుతుంది.

భౌతిక, ప్రవర్తనా శాస్త్రాల సిద్ధాంతాల

ఆధునిక నైపుణ్యాల వినియోగం,

విద్యావిధానాన్ని మరింత ఫలవంతం

చేయడమే విద్యాసాంకేతికం అవుతుంది.

విద్యావిధానంలో ప్రమాణ,

పరిణామాభివృద్ధికై భౌతిక

ప్రవర్తనాశాస్త్రాల నుండి గ్రహించిన

శాస్ర్తియ విజ్ఞానంగా కూడా

వివరించవచ్చు. విద్యావ్యాసంగానికి

,శాస్ర్తియ విజ్ఞానాన్ని ముఖ్యంగా

మనోవిజ్ఞానాన వార్తా ప్రసార, వ్యవస్థా

విశే్లషణ సిద్ధాంతాలను

అనుసంథానించడాన్ని విద్యా సాంకేతికం

అని చెప్పవచ్చు. ఇదంతా ఎందుకంటే

ఆధునిక బోధన పద్ధతుల్లో వచ్చిన

సాంకేతిక ప్రగతి-వికాసం తెచ్చిన

సరికొత్త సౌకర్యాలేనని చెప్పడానికే.
విద్యాసాంకేతికం సంకుచితమైన

అర్థం-పరిమితమైన భావనతో

కూడుకున్నది కాదు. ఇది చాలా

విస్తృతమైనది. సరైన సమయంలో

తగిన పరికరాలను ఉపయోగించడం,

సరైన అవగాహనను కల్పించడం,

ఫిల్ముల వంటి జ్ఞానేంద్రియ సాధనాలు

ప్రత్యాక్షానుభవాన్ని కలిగిస్తాయి.

శాస్ర్తియ శిక్షణకు, బోధనా కళకు మధ్య

విద్యాసాంకేతికం సారధి వంటిది.

విద్యాసాంకేతిక పరిధికి సరిహద్దులు

లేనప్పటికీ , ఈ దిగువన కొంత వరకూ

దాని పరిధి ఇవ్వడానికి ప్రయత్నం

జరిగింది.
సమాజం కోరికలు, విద్యావసరాలు

గుర్తించడం వంటి అంశాలను

చర్చించడానికి ఇది ప్రయత్నిస్తుంది.

సమాజంలోని వ్యక్తుల అవసరాలు,

కోరికలు తృప్తిచెందించడానికి

అవసరమైన వనరులను సర్వే చేస్తుంది.

విస్తృతమైన విద్యాలక్షాలను గమ్యాలను,

ఎప్పటికపుడు గుర్తించి తెలియజేస్తుంది.
వ్యక్తీకరించిన లక్ష్యాలు, తయారుచేసిన

పాఠ్యప్రణాళిక, అందుబాటులో ఉన్న

వనరులు, వీటికి అనుగుణంగా

ఉపయుక్తమైన బోధనాభ్యసన సామగ్రీని

తయారుచేయడం, అభివృద్ధిలతో కూడా

సంబంధం ఉంటుంది.
తమ సంక్లిష్టమైన బాధ్యతలను

నిర్వహించేందుకు తగిన వారిగా

ఉపాధ్యాయులను తయారుచేసేందుకు

తగిన శ్రద్ధ వహిస్తుంది. విద్యార్థి బోధనా

నమూనాలు సూక్ష్మబోధన ,

బృంద బోధన, ఉపాధ్యాయ ప్రవర్తనా

సంస్కరణ, తరగతి పరస్పర చర్యలు

వంటి శీర్షికలు కూడా ఇందులో మనం

ప్రస్తావించగలుగుతాం.
బోధనా భావన, బోధనా

ప్రక్రియవిశే్లషణ, బోధనా సూత్రాలు,

అభ్యసన సిద్ధాంతాల సంబంధం

బోధనాభ్యసన సంబంధం మొదలైన

వాటిని చర్చించేందుకు కూడా

ప్రయత్నిస్తుంది. వివిధ రకాల దృశ్య

శ్రవణ ఉపకరణాలు, వాటి ఎంపిక,

ఉపయుక్తత, తయారీ, అభివృద్ధి

పరచడం, దృశ్య శ్రవణ విధానాల ద్వారా

జ్ఞానం అందించడం, ఆ ఉపకరణాలు ఏ

విధంగా భద్రపరచాలి వంటి అంశాలు

కూడా ఇటి ద్వారా తెలుస్తాయి.
బోధనాభ్యసన వ్యాసాంగాల ప్రక్రియ,

ఉత్పాదకంల అవిరళ మూల్యాంకనం

కోసం తగిన సాధనాలను పనిముట్లను

నిర్మించేందుకు, ప్రణాళిక

నేర్పరిచుకునేందుకు బోధన ప్రక్రియపై

తగిన నియంత్రణ కూడా ఈ విధానంలో

ఉంటుంది. తద్వారా అవసరమైన

మార్పులను, చేర్పులను చేసుకుని

అభివృద్ధికి వీలుకలిగి ఉంటుంది.
ఇంత వరకూ విద్యా సాంకేతిక క్షేత్రంలో

జరిగిన అధిక భాగపు పని మాధ్యమ

కేంద్రీకృతం (మీడియా ఓరియంటెడ్),

ఉత్పాదక కేంద్రితం (ప్రోడక్ట్

ఓరియంటెడ్), ఉత్పాదన కేంద్రకం

నుండి ప్రక్రియా కేంద్రకానికి ప్రస్తుతం

మొగ్గు కనిపిస్తోంది. వర్తమాన

భారతదేశ విద్యాసాంకేతికవేత్త కేవలం

కార్యక్రమయుత పుస్తక రచయిత లేదా

మాధ్యమ నిపుణుడు మాత్రమేగాక,

విద్యావ్యవస్థలకు సంబంధించిన అన్ని

అంశాల పథక రచన , విధులతో

సంబంధం ఉన్న వ్యక్తి పరికల్పనల

నిర్వహణలోనూ, ఆచరణలోనూ,

వ్యవస్థా విశే్లషణ వినియోగం ప్రస్తుతం

ఎక్కువ ప్రాముఖ్యతను

సంతరించుకుంటోంది. అంతేగాక,

సాంకేతికాల వినియోగంలో

ప్రత్యామ్నాయ వ్యూహాలను

రూపొందించడానికి కూడా ప్రాముఖ్యత

ఇస్తున్నారు.
ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఎన్నో

లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని వాటిని

అమలుచేసేందుకు ప్రయత్నిస్తోంది.

దీర్ఘకాల ప్రాతిపదికపై విద్యావసరాల

నిమిత్తం అంకితభావం ఉన్న శాటిలైట్

వ్యవస్ధను తయారుచేయడం,

విద్యాఛానల్‌ను ప్రారంభించడం తొలి

ప్రాధమ్య అంశాలు. అన్ని

విశ్వవిద్యాలయాల్లో కాలేజీల్లో

రేడియోస్టేషన్లు ఏర్పాటు చేయాలి, అన్ని

ప్రధాన భాషల్లో గుర్తించిన సమూహాలకు

కనీస విద్యా టివి రేడియో

కార్యక్రమాలను అందించడం, భారతీయ

భాషల్లో తగిన సామర్థ్యాలను ఉత్పత్తి

చేసేందుకు దేశంలోనే ప్రోగ్రాంలను

తయారుచేసేందుకు సౌకర్యాలను

విస్తరింపచేయడం, అప్రసారిత

పద్ధతులు గ్రాఫిక్ బోధనోపకరణాలను

ఉపయోగించి పాఠ్యప్రణాళికా సహాయ

సామగ్రీ ఉత్పత్తి, ప్రసారాలకు

సౌకర్యాలకు సంస్థలను అభివృద్ధి

చేయడం, విద్యామాద్యమం కోసం

మానవశక్తి ఉత్పత్తికి శిక్షణా

కార్యక్రమాలు సౌకర్యాలను అభివృద్ధి

చేయడం, ప్రాధమిక పాఠశాలలకు

రేడియోలు, టివిలు అందించడం, ఏ

విధమైన ఆలస్యం లేకుండా మాధ్యమ

కార్యక్రమాల నుండి వినియోగదారీతనం

, హింస మొదలైన అంశాలను

తొలగించడం, కంప్యూటర్ ఆధారిత

బోధనాంశాలను, సాంకేతిక నిపుణులను

తయారుచేయడం, కంప్యూటర్

కోర్సులను పెద్ద ఎత్తున నిర్వహించడం,

విద్యాటెక్నాలజీ మిషన్‌ను

ప్రారంభించడం వంటి ఎన్నో

ఆలోచనలను ప్రభుత్వం చేసింది.

ఇందులో చాలా వరకూ ఇప్పటికే

నెరవేరాయి. ఈ ఆధునిక పోకడల్లో

ప్రభుత్వం కంటే ప్రైవేటు రంగమే

ముందంజలో ఉంది.
***

అన్ని భాషల్లో ఇ లెర్నింగ్, ఆన్‌లైన్

అభ్యసన పెద్ద ఎత్తున జరుగుతోంది.

దాదాపు అన్ని సబ్జెక్టుల్లో నిపుణులు

పెద్ద ఎత్తున పుట్టుకొచ్చారు. మెడ్‌ఆర్సీ

సంస్థ ప్రపంచంలో ఎంబిబిఎస్ కోర్సులో

ఏ ఒక్కరూ రూపొందించని రీతిలో 13

వౌలిక బోధనాంశాల్లో 6వేల

పాఠ్యాంశాలను రూపొందించి ఎలక్ట్రానిక్

పరిష్కారాలను సూచించింది.

పరిశ్రమల్లోనూ, ఆస్పత్రుల్లోనూ

దశాబ్దాలుగా పనిచేస్తున్న నిపుణులను

పిలిపించి వారితో పాఠాలను చెప్పించి

వాటిని ఎలక్ట్రానిక్ రూపంలో రికార్డు

చేశారు. ఇంటరాక్టివ్ బోర్డులో దానిని ఒక

పక్క ప్రదర్శిస్తూ మరో పక్క అందుకు

సంబంధించిన మల్టీమీడియా,

యానిమేషన్ ప్రదర్శన కళ్లకు కట్టినట్టు

360 డిగ్రీల్లో వీక్షించడం ద్వారా నేరుగా

జ్ఞాననాడులకు చేరేలా వీటిని

రూపొందించారు. ఉస్మానియా

యూనివర్శిటీలో బంగారు పతక గ్రహీత

అయిన డాక్టర్ నీరజ్ రాజ్ ఈ గొప్ప

సాహసానికి పూనుకున్నారు.

ప్రపంచంలో ఎవరో ఒకరు ఏదో ఒక

సబ్జెక్టుకు పరిమితం కాగా అన్ని

సబ్జెక్టుల్లో ఈ తరహా కంటెంట్‌ను

రూపొందించడం ద్వారా డాక్టర్ నీరజ్

రాజ్ రికార్డు సృష్టించారు. ఇది వైద్య

రంగానికి సంబంధించింది.

*
============
ఇంటర్మీడియట్, వివిధ జాతీయ స్థాయి

ప్రవేశపరీక్షలకు, పోటీ పరీక్షలకు, అర్హత

పరీక్షలకు సైతం ఆన్‌లైన్ మెటీరియల్

అందించే సంస్థలు, వ్యక్తులు,

అనుమానాలు తీర్చేవారు కోకొల్లలుగా

వచ్చారు. అలాంటి సంస్థల్లో ప్రధానంగా

చెప్పుకోదగ్గ మరో ఇ లెర్నింగ్ టెక్నాలజీ

కంపెనీ నెక్ట్స్ ఎడ్యుకేషన్ ఇండియా.

టెక్నాలజీ ఆధారిత ఎడ్యుకేషన్

ఎంటర్‌ప్రైజ్ అయిన నెక్ట్స్ ఎడ్యుకేషన్

హైదరాబాద్ కేంద్రంగా తన

కార్యకలాపాలకు నిర్వహిస్తోందని

దియాజ్ డెవ్ రెల్హాన్ చెప్పారు.

2007లో ఐఐటి పూర్వ విద్యార్థ్ధులు

దీనిని ఏర్పాటు చేశారు. కె-12

విభాగంలోని విద్యార్థులకు సిబిఎస్‌ఇ,

ఐసిఎస్‌ఎ , ఐజీసీఎస్‌ఈ , 23 ఇతర

భారతీయ రాష్ట్రాల బోర్డు సిలబస్‌కు

అనుగుణమైన కంటెంట్‌ను 8 భాషల్లో

ఇది అందిస్తోంది. కంపెనీ పాఠశాలలు,

విద్యార్ధులు, ఉపాధ్యాయులకు ఈ

సేవలను అందిస్తోంది. సంస్థ

ఉత్పాదనలు సిమ్యులేషన్స్,

ప్రయోగాలు, యానిమేషన్స్,

ఇంటరాక్టివ్ టూల్స్, ఫార్మటివ్,

సమ్మేటివ్ అసెస్‌మెంట్స్, యాక్టివిటీ

కిట్స్‌ను కలిగి ఉంటుంది. జీవం ఉట్టిపడే

లాంటి 2డి, 3డి గ్రాఫిక్స్ , వాయిస్

ఓవర్, అంతర్జాతీయ ప్రమాణాలకు

అనుగుణంగా అధికస్థాయి ఇంటరాక్టివ్ ,

స్పష్టమైన శబ్దం, ఇన్నోవేటివ్ కోర్సు

డిజైన్ వంటి ఎన్నో వినూత్న విశిష్ట

పరిశోధనాత్మక రూపకల్పనలను

ఇన్‌బిల్ట్ ఐఆర్ రిమోట్ ద్వారా ఎంతో

తేలికగా యాక్సిస్ చేసుకునే అవకాశం

ఈ నూతన విప్లవంలో సాధ్యమైంది.

విద్యార్ధులకు డిజిటల్ క్లాసురూమ్

సొల్యూషన్స్, విద్యార్ధులకు వైయుక్తిక

బోధనాభ్యసన పరిష్కారాలు, ఇంగ్లీషు,

సైన్స్, మాథ్స్‌లను తేలికగా అధ్యయనం

చేసుకునేందుకు వీలుకల్పించేవి,

ఆటోమెటెడ్ స్కూల్ మేనేజిమెంట్

పరిష్కారాలను రూపొందించారు.

కవర్ స్టోరీ
english title: 
cover story
author: 
--బి.వి. ప్రసాద్

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>