Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

భారత్‌తో బంగ్లాదేశ్ భారీ థర్మల్ విద్యుత్ ఒప్పందం

$
0
0

ఢాకా, ఏప్రిల్ 20: థర్మల్ విద్యుత్ రంగంలో భారత్‌తో కలిసి పనిచేసేలా బంగ్లాదేశ్ మునుపెన్నడూ లేనివిధంగా ఓ భారీ ఒప్పందంపై శనివారం సంతకం చేసింది. ఇరు దేశాలు సంయుక్త వెంచర్‌లో భాగంగా 1.6 బిలియన్ డాలర్ల పెట్టుబడితో 1,320 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ మేరకు ఒప్పందంపై భారత్ తరఫున ఎన్‌టిపిసి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అరుప్ రాయ్ చౌధురి, బంగ్లాదేశ్ తరఫున బంగ్లాదేశ్ పవర్ డెవలప్‌మెంట్ బోర్డు (బిపిడిబి) చైర్మన్ అబ్దుల్ వాహబ్ ఖాన్ సంతకాలు చేశారు. రాబోయే ఐదేళ్లలో ఈ ప్లాంట్ కార్యకలాపాలు మొదలయ్యే అవకాశాలున్నాయి. ఈ విద్యుత్ ఒప్పందం ప్రకారం ప్రాజెక్టు మొత్తం నిధుల్లో 70 శాతం మార్కెట్ నుంచి సేకరించనుండగా, మిగతా 30 శాతం నిధులను భారత్ తరఫున ఎన్‌టిపిసి, బంగ్లాదేశ్ తరఫున బిపిడిబి సమానంగా సమకూర్చనున్నాయి. కాగా, ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య విద్యుత్ కొనుగోలు ఒప్పందం, అమలు ఒప్పందం కూడా కుదిరాయి. ఈ ఒప్పందాలపై రెండు దేశాల్లోని సంబంధిత అధికారులు సంతకాలు చేశారు.

థర్మల్ విద్యుత్ రంగంలో భారత్‌తో కలిసి పనిచేసేలా బంగ్లాదేశ్
english title: 
thermal power

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>