హైదరాబాద్, ఏప్రిల్ 20: కనుమరుగవుతున్న గ్రామీణ సంస్కృతి, సాంప్రదాయాలను భావి తరాలకు గుర్తు చేసేవి కళలేనని, వాటిని రక్షించుకోవాల్సిన అవసరం నేటి యువతపై ఉందని విశ్రాంత ఐఎఎస్ అధికారి కెవి రమణాచారి అన్నారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ సలహాదారుడిగా సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా సాంస్కతిక శాఖ ప్రముఖలు ఆయనను రవీంద్రభారతిలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రమణాచారి మాట్లాడుతూ తాను ఎక్కడ ఉన్నా సాంస్కృతిక శాఖకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సాంస్కృతి శాఖను నిర్వహించేది ఐఎఎస్ కాదని, పర్యవేక్షించేది మాత్రమే ఐఎఎస్ అన్నారు. సాంస్కృతి శాఖకు ఎన్నో అనుబంధ విభాగాలు ఉన్నాయని వాటిని సమపాళ్లల్లో చూచినప్పుడే శాఖకు పేరు వస్తుంద్నారు. ఐఎఎస్‌లకు సమస్యలపై అవగాహన ఉండాలే తప్ప అహంకారం ఉండకూడదన్నారు. తమకు మంచి జరుగుతుందని సుదూర ప్రాంతాల నుంచి ఎన్నో ప్రయాసలతో హైదరాబాద్‌కు వస్తారని, సందర్శకులను పలకరిస్తే చాలు అదే పది వేలు అనుకుంటారని ఆయన గుర్తు చేశారు. తనకోసం వీడ్కోలు సభ ఏర్పాటు చేసిన అభిమానులకు రమణాచారి కృతజతలు చెప్పుకున్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన దేవాదాయ శాఖ కమిషనర్ బలరామయ్య మాట్లాడుతూ రమణాచారి సాంస్కృతిక శాఖకు ఎంతో సేవ చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమం వీడ్కోలు కాకూడదని ఆయన్ని మరి కొనే్నళ్లు పదివిలో కొనసాగిస్తే సాంస్కృతిక శాఖకు మేలు జరుగుతుందన్నారు. తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలు విజయవంతం కావడానికి రమణాచారి కృషి ఎంతో ఉందన్నారు. సాంస్క్కతిక శాఖ డైరెక్టర్ కవితా ప్రసాద్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. (చిత్రం) రమణాచారిని సన్మానిస్తున్న దేవాదాయ శాఖ కమిషనర్ బలరామయ్య
* విశ్రాంత ఐఎఎస్ అధికారి రమణాచారి
english title:
ramana chary
Date:
Sunday, April 21, 2013