చైతన్యకృష్ణ, ఛాందిని జంటగా శ్రీ కరుణాలయం ప్రొడక్షన్స్ పతాకంపై బేబి మనస్విని సమర్పణలో రూపొందించిన చిత్రం ‘కాళీచరణ్’. శ్రీ ప్రవీణ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం తుది మెరుగులు దిద్దుకుంటోంది. హైదరాబాద్ ఫిలిమ్ ఛాంబర్ హాలులో ఆదివారం సాయంత్రం ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర దర్శకుడు శ్రీ ప్రవీణ్ మాట్లాడుతూ ఇటీవల విడుదల ఆయిన చిత్రంలో పాటలకు మంచి ఆదరణ లభిస్తోందని, విన్నవారందరూ ఇళయరాజా పాటల్లా ఉన్నాయని మెచ్చుకున్నారని, పూర్తిస్థాయి కమర్షియల్ చిత్రంగా రూపొందిన ఈ సినిమాలో సందర్భానుసారంగా పాటలు వస్తాయని, పాటలను చూసిన రామ్‌గోపాల్‌వర్మ కూడా అద్భుతంగా ఉన్నాయని కామెంట్ చేశారని ఆయన తెలిపారు. కెమెరా పనితనం హైలెట్‌గా నిలిచే ఈ సినిమా తప్పక హిట్ అవుతుందని ఆయన అన్నారు. కథ చెప్పినప్పుడు ఎవరైనా పెద్ద హీరోను తీసుకోమని తాను చెప్పానని, పాత్రకు తాను ఖచ్చితంగా యాప్ట్ కనుక వారు హీరోగా తనను తీసుకున్నారని, 1980నాటి పరిస్థితులకు అనుగుణంగా ఈ చిత్రం ఉంటుందని, దాదాపు పది నెలలు గడ్డం పెంచి, తాను నటించానని, దర్శకుడు చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని, కథానాయకుడు కృష్ణ చైతన్య తెలిపారు. నటనకు అవకాశం వున్న పాత్రలో తొలిసారిగా పరిచయమవుతున్నందుకు సంతోషంగా వుందని చాందిని తెలిపారు. నాగినీడు, రావురమేష్, కవితా శ్రీనివాసన్, పంకజ్ కేసరి, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: నందన్‌రాజ్, ఎడిటింగ్: ప్రవీణ్‌పూడి, కెమెరా: విశ్వాదేవబత్తుల, సతీష్‌ముత్యాల, నిర్మాత, దర్శకత్వం: శ్రీ ప్రవీణ్.
చైతన్యకృష్ణ, ఛాందిని జంటగా శ్రీ కరుణాలయం
english title:
t
Date:
Tuesday, April 23, 2013