ప్రాంతాలు, జిల్లాలు సంగతి అలా వుంచితే, మన మధ్య మసలిన మహానుభావుల వివరాలు, వైనాలు కాస్తయినా తెలుసుకోవడం, వీలయితే గ్రంథస్థం చేయడం అత్యంతావశ్యకం. శ్రీకాకుళానికి చెందిన రామిశెట్టి చేసినదీ పనే. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెంది, వివిధ రంగాల్లో తమ ప్రతిభాపాటవాలు ప్రదర్శించిన గొప్పవారి జీవిత విశేషాలను రేఖామాత్రంగా రచించారు. నిజానికి ఇందులో చోటు చేసుకున్న వారందరి ప్రతిభ ప్రదర్శన, వ్యక్తిగత వివరాలతో, ఒక్కొక్కరికి ఒక్కో గ్రంథమే రాయచ్చు. అల్లూరి మొదలుకొని అక్షర క్రమంలో రచయిత రావిశాస్ర్తీ వరకు వివిధ రంగాల మహానుభావుల జీవిత విశేషాలను అలా అలా అందించారు రచయిత. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లోనే ఇంతమంది ప్రముఖులు, ప్రతిభామూర్తులు వున్నారా అని అనిపించినా ఆశ్చర్యం కాదు. ఎందుకంటే పక్కింటి సంగతులపైనే దృష్టిసారించే హడావుడిలో సొంత ఇంటి గొప్పతనం మరిచిపోవడం మామూలే కాబట్టి. అందుకే రచయిత లేశమాత్రంగానైనా ఉత్తరాంధ్ర ప్రముఖుల వివరాలను గుదిగుచ్చి, ఒక్క పుస్తకంగానైనా అందించే ప్రయత్నం అభినందించదగ్గదే. ఇప్పుడు ఈ పుస్తకం ఆధారంగా, ఇప్పటికే బహుథా పేరొందిన వారి సంగతిని పక్కన పెట్టి, మిగిలిన వారి గురించి సవివర పుస్తకాలు వస్తే మరీ అభినందనీయం.
============
ఉత్తరాంధ్ర స్ఫూర్తిప్రదాతలు
-రామిశెట్టి
ప్రతులకు: రామిశెట్టి భాగ్యరేఖ
డాటరాఫ్ వెంకటరావు (లేటు)
డోర్ నెం.2-15-56,
ఇల్లిసిపురం వీధి,
శ్రీకాకుళం - 532 001
944 170 7772