నెల్లూరు, ఏప్రిల్ 28: శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా నెల్లూరు జిల్లాలో పలుచోట్ల అర్ధరాత్రి దాటిన తర్వాత అశ్లీల నృత్యాలు ప్రదర్శిస్తున్న 20మంది డ్యాన్సర్లను అదుపులోకి తీసుకున్నామని జిల్లా ఎస్పీ రమణకుమార్ తెలిపారు. ఇటువంటివాటిపై నిషేధం ఉండడం వల్ల రికార్డింగ్ డ్యాన్స్‌లపై దాడులు చేస్తున్నామన్నారు. నెల్లూరు రూరల్ మండలంలో శుక్రవారం రాత్రి దాడులు చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. శనివారం రాత్రి చిల్లకూరు మండలం బద్దెవోలులో ట్రాక్టర్‌పై అశ్లీల నృత్యాలు ప్రదర్శిస్తున్న ముగ్గురు మహిళలు, 14 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరంతా ఒంగోలు, గుంటూరు, నెల్లూరు ప్రాంతాలకు చెందినవారన్నారు. వీరినుంచి 19వేల నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.
నిర్వాహకులు పరారీలో ఉన్నారని ఎస్పి తెలిపారు.
14మంది డ్యాన్సర్ల అరెస్టు
english title:
n
Date:
Monday, April 29, 2013