హైదరాబాద్, ఏప్రిల్ 28: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ ఎత్తివేస్తారా? అంటూ ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజానాథ్ ప్రశ్నించారు. ఆదివారం నగరంలోని ఎల్బీ స్టేడియంలో పేద ముస్లిం విద్యార్థులకు ఉచితంగా మంత్రి సైకిళ్ళు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చంద్రబాబు అన్నీ మార్చేస్తానని చెప్పడం చూస్తే, బాబు ఏమి మారుస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కార సమయంలో పారిపోయే బాబు ప్రతిపక్ష నేతగా విఫలమయ్యారని అన్నారు. బాబును శాశ్వతంగా రాష్ట్ర ప్రజలు తిరస్కరించారని, భవిష్యత్లో ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కదని ఆక్షేపించారు. చంద్రబాబు నాయుడు ఎన్ని జిమ్కిక్కులు చేసినా ప్రజలు నమ్మే రోజులు పోయాయన్నారు. వస్తున్నా మీకోసం పాదయాత్రలో ఆయన సాధించింది శూన్యమన్నారు. ప్రజలు అన్ని విషయాలను పరిశీలిస్తున్నారని తగిన సమయంలో బాబుకు తగిన బుద్ధి చెబుతారని చెప్పారు. పాదయాత్ర ముగిసిన సందర్భంగా భారీ ర్యాలీ ఏర్పాటు చేయడం చూస్తే వాపును చూచి బలుపుగా అనుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
..........................
హైదరాబాద్లో ఆదివారం ముస్లిం విద్యార్థులకు సైకిళ్లను అందజేస్తున్న ప్రాథమిక విద్యా శాఖ మంత్రి శైలజానాథ్
.......................
ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజానాథ్ వెల్లడి
english title:
b
Date:
Monday, April 29, 2013