హైదరాబాద్, మే 1: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 1990లో జరిగిన అత్యాచారం కేసులో పరారీలో ఉన్న ఆరో నిందితుడిని సిఐడి అధికారులు అరెస్టు చేశారు. ఒక మహిళను న్యూస్ పేపర్ కారులో ఎక్కించుకుని మిర్యాలగూడ శివారులో సామూహిక అత్యాచారం చేసిన కేసులో సిఐడి అధికారులు ఆరుగురిని నిందితులుగా గుర్తించారు. వీరిలో ఐదుగురిని అరెస్టు చేయగా ఆరవ నిందితుడు వాహిద్‌ను ఇప్పుడు అరెస్టు చేసినట్లు సిఐడి అధికారులు తెలిపారు. బాధితురాలు అత్యాచారానికి గురైన తర్వాత వారి నుంచి తప్పించుకుని నేరేడుచర్ల పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన నేరేడుచర్ల పోలీసులు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ తర్వాత సిఐడికి బదిలీ చేశారు. ఈ కేసును విచారించిన సిఐడి అధికారులు ఐదుగురిని అరెస్టు చేశారు. వీరందరికి ఏడేళ్ల జైలు శిక్ష కూడా పడింది. కానీ ఆరవ నిందితుడు వాహిద్ పరారీలో ఉన్నాడు. ఇతనిపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. చివరకు సిఐడి అధికారులు అరెస్టు చేసి కోర్టుకు తరలించగా రిమాండ్ విధించింది.
కానిస్టేబుల్ ఉద్యోగాలకు
19న రాత పరీక్ష
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 1: రాష్ట్ర పోలీసు శాఖలో 6,071 పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి 2012 డిసెంబర్ 31న విడుదల చేసిన నోటిఫికేషన్‌ను అనుసరించి రాత పరీక్షను ఈ నెల 19న నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. రాతపరీక్షకు ఎంపిక చేసిన 16,693 మంది అభ్యర్థులకు హాల్‌టిక్కెట్లు జారీ చేస్తున్నట్లు ఆ ప్రకటన వెల్లడించింది. పోలీసు శాఖలోని సివిల్, ఎఆర్, ఎపిఎస్‌పితో పాటు ఎస్‌పిఎఫ్‌లో కానిస్టేబుల్స్, ఎపిఫైర్ సర్వీస్‌లో ఫైర్‌మెన్ పోస్టులు కలిపి 6,071 ఉన్నట్లు బోర్డు తెలిపింది. రాతపరీక్షకు ఎంపికైన అభ్యర్థుల వివరాలు ఎపి పోలీసు వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు వెల్లడించింది. అభ్యర్థులు ఈ సమాచారం మేరకు హాల్‌టిక్కెట్లను పొందాలని పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ మాలకొండయ్య ఆ ప్రకటనలో తెలిపారు.
జైలులో జగన్‌ను
కలిసిన మణిగాంధీ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 1: కర్నూలు జిల్లా, కొడుమూరు నియోజకవర్గం కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే శిఖామణి తనయుడు, ప్రస్తుతం టిడిపి నాయకుడు మణిగాంధీ బుధవారం చంచల్‌గుడా జైలులో విచారణ ఖైదీగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి చర్చలు జరిపారు. మణిగాంధీ త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. మణిగాంధీ వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భూపాల్‌రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 1990లో జరిగిన అత్యాచారం
english title:
a
Date:
Thursday, May 2, 2013