కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 16: ప్రభుత్వ పాఠశాలలకు కోట్లాది రూపాయలు వెచ్చించి పక్కా భవనాలను నిర్మిస్తున్నట్టు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ తెలిపారు. గురువారం సూరారం గ్రామంలోని పాఠశాలలో 31.31 లక్షల రూపాయలతో నిర్మించిన అదనపు గదులు, శివాలయనగర్‌లో 25 లక్షల రూపాయలతో ఏర్పాటు చేయనున్న అండర్‌గ్రౌండ్ పనులను ఎమ్మెల్యే, కార్పొరేటర్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీశైలంగౌడ్ మాట్లాడుతూ విద్యాభ్యున్నతి కోసం ప్రభుత్వం ఎన్నినిధులైనా ఖర్చు చేస్తుందన్నారు. వేసవిలో నీటి ఎద్దడి రాకుండా ముందుజాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను అదేశించారు. మంజీరా పైపులైన్ల లీకేజీలను అరికట్టాలని వాటర్‌వర్క్స్ అధికారులను అదేశించారు. అభివృద్ధి కార్యక్రమాలకు ఎన్నినిధులైనా ఖర్చు చేస్తుందన్నారు. ముఖ్యంగా తాగునీటి ఎద్దడి రాకుండా ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడంతో పాటు, ఇందుకోసం ఎన్నినిధులైనా ఖర్చు చేస్తుందన్నారు. షాపూర్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ పాలకృష్ణ మాట్లాడుతూ మంచినీటి ఎద్దడి నివారణకు తగిన చర్యలు తీసుకుంటానన్నారు. కనీస సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో వాటర్‌వర్క్స్ ఏఇ రంగారావు, పాస్టర్ రాజారాం, నర్సింహ్మారెడ్డి, సురేష్, రాములు, అంజనేయులు, సుభాష్, వేణు, మండల విద్యాశాఖ అధికారి చంద్రప్ప, హెచ్‌ఎం లక్ష్మి, రాఘువరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, యాదిరెడ్డి, మల్లేష్‌యాదవ్, ఇంద్రసేనగుప్త, ఇంజనీర్ శ్యామ్ సుందర్‌రెడ్డి పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలకు పక్కా భవనాలు: కూన
english title:
s
Date:
Friday, February 17, 2012