న్యూఢిల్లీ, మే 1: చైనాను ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉందని సైనికదళ అధిపతి జనరల్ బిక్రం సింగ్ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌తో పాటు భద్రతా వ్యవహారాలకు సంబంధించి కేంద్ర మంత్రివర్గ ఉప సంఘానికి భరోసా ఇచ్చినట్లు తెలిసింది. 1962 మైండ్‌సెట్‌తో పనిచేయటం ఎంత మాత్రం మంచిది కాదని ఆయన ఉపసంఘానికి స్పష్టం చేసినట్టు సమాచారం. 1962లో ఉన్న భారత సైన్యానికి ప్రస్తుత సైన్యానికి ఎంతో తేడా ఉందని, కనుక గతంలో మాదిరిగా జరుగుతుందేమోనని అనుమానించకుండా దేశ పరువు, ప్రతిష్టలను ఇనుమడింపజేసేలా వ్యవహరించాల్సిన అవసరం ఉందని బిక్రం సింగ్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. చైనా తమ సరిహద్దు వైపు అత్యాధునిక రోడ్లు, రైల్వే లైన్లు ఏర్పాటు చేసుకోవటంతో పాటు ఇతరత్రా అన్ని ఆధునిక హంగులను సమకూర్చుకుంటోందని, పైగా మనం మన వైపు బంకర్ల నిర్మాణం చేపడితే అభ్యంతరాలు చెబుతూ బంకర్లు, రోడ్లు నిర్మించకూడదని షరతులు విధిస్తోందని బిక్రం సింగ్ చెప్పినట్లు తెలిసింది.
భయపడాల్సిన అవసరం లేదు ప్రధానికి ఆర్మీ చీఫ్ నివేదిక
english title:
c
Date:
Thursday, May 2, 2013