కౌలాలంపూర్, మే 3: మలేసియా ఓపెన్ గ్రాండ్ ప్రీ బాడ్మింటన్ టోర్నమెంట్లో భారత యువ సంచలన క్రీడాకారిణి పివి సింధు ఫైనల్‌కు దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరుస్తూ ముందంజ వేస్తున్న ఈ 17 ఏళ్ల హైదరాబాదీ శుక్రవారం నాటి సెమీ ఫైనల్లో మూడోసీడ్ క్రీడాకారిణి సస్పిరీ తయెరతానచాయ్ (్థయిలాండ్)ను 21-17, 21-11 తేడాతో కేవలం 34 నిమిషాల్లోనే ఓడించి సంచలనం సృష్టించింది. టైటిల్‌కు మరింత చేరువైంది. ఫైనల్లో ఆమె ఐదో సీడ్ గుజువాన్ (సింగపూర్)తో తలపడనుంది. తొలి సెట్ ప్రారంభంలో తడబడినప్పటికీ, ఆతర్వాత పుంజుకున్న సింధు ఆరు వరుస పాయింట్లను సంపాదించి, ఆధిపత్యాన్ని నిరూపించుకుంది.
మలేసియా ఓపెన్ గ్రాండ్ ప్రీ బాడ్మింటన్ టోర్నమెంట్లో
english title:
m
Date:
Saturday, May 4, 2013