శ్రీశైలం, మే 3: శ్రీశైలంలోని ప్రాచీన కట్టడాలను పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఆ దిశగా దేవస్థానం చర్యలు చేపట్టడం శుభపరిణామని విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. మల్లికార్జునస్వామి దర్శనార్థం శ్రీశైలం వచ్చిన స్వరూపానందేంద్ర విలేఖరులతో మాట్లాడుతూ గో సంరక్షణశాలను దేవస్థానం ఎంతో నిబద్ధతతో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో దేవస్థానం ఆధ్వర్యంలో కోడెదూడలను విక్రయించే విధానాన్ని రద్దు చేయాలని నిర్ణయించడం ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు. తొలుత స్వరూపానందేంద్ర సరస్వతికి ఆలయ గోపురం వద్ద అర్చకులు వేద మంత్రాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం మల్లికార్జున స్వామికి అభిషేకం చేసిన స్వామీజీ అమ్మవారిని దర్శించుకున్నారు. దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోసంరక్షణశాల, హేమారెడ్డి, మల్లమ్మ మందిరాన్ని సందర్శించారు.
2011 లెక్కల ప్రకారమే
స్థానిక సంస్థల ఎన్నికలు
వరంగల్, మే 3: రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు 2011 జనాభా లెక్కల ఆధారంగానే ఎన్నికలు జరగబోతున్నాయి.. రిజర్వేషన్ల ఖరారుకు 2001 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటారా..? లేక 2011 జనాభా లెక్కలు కొలమానమా? అని సాగుతున్న మీమాంసకు శుక్రవారం రాష్ట్ర పంచాయతీరాజ్ అధికారులు తెరదించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్‌రెడ్డి శుక్రవారం వరంగల్‌లో మూడు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన సమావేశంలో ఎన్నికల నిర్వహణపై ఒక స్పష్టత కనిపించింది. 2011 జనాభా లెక్కల ఆధారంగానే ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర పంచాయతీరాజ్ అదనపు కమిషనర్ శంకర్‌రెడ్డి తెలిపారు. అనంతరం పత్రికా విలేఖరుల సమావేశంలో ఎన్నికల కమిషనర్ రమాకాంతరెడ్డి మాట్లాడుతూ ‘ప్రభుత్వం 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎన్నికలు జరిపేందుకు సిద్ధమైతే ముప్పయ్ లేదా 35 రోజుల్లో ఏర్పాట్లు చేస్తాం’అని ప్రకటించారు. స్థానిక ఎన్నికలకు రాష్టవ్య్రాప్తంగా 2.10 లక్షల పోలింగ్ కేంద్రాలు అవసరమని.. కేవలం 18వేల ఇవిఎంలే ఉన్నందున బ్యాలెట్ పత్రాల ద్వారానే ఎన్నికలు జరుపుతామని వివరించారు. సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో ఏడేళ్ల తరువాత జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారయంత్రాంగం అన్నిరకాలుగా సిద్ధమవుతోందని ఆయన వివరించారు. ఓటర్లజాబితా, పోలింగ్ స్టేషన్ల జాబితాల ముద్రణకు జిల్లాల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు.
అక్రమ వసూళ్ల కేసులో
కార్మిక శాఖ అధికారులకు జైలు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మే 3: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనులు చేసే కాంట్రాక్టర్ల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడిన ఇద్దరు కార్మికశాఖ ఉద్యోగులకు సిబిఐ న్యాయమూర్తి జైలు, జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పుచెప్పారు. కార్మికశాఖలో సహాయ కమిషనర్‌గా పనిచేస్తున్న టి రమేష్, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన లేబర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి ఎన్ గుణకర్‌లు 2006 ఆగస్టు నెలలో విశాఖలో పర్యటించిన సమయంలో పోర్టుట్రస్టు, హెచ్‌పిసిఎల్‌లో కాంట్రాక్టు పనులు చేస్తున్న కాంట్రాక్టర్లనుంచి అక్రమ వసూళ్ళకు పాల్పడినట్టు సిబిఐకి ఫిర్యాదులు అందాయి. దీంతో 2006 ఆగస్టు 26న వీరు బసచేస్తున్న హెచ్‌పిఎల్ ట్రాన్సిట్ హౌస్‌పై సిబిఐ అధికారులు దాడి చేయగా, వీరి వద్ద సుమారు 60 వేల రూపాయల నగదును గుర్తించారు. ఈ మొత్తానికి సంబంధించిన సమగ్రమైన సమాచారం వీరి వద్ద లేకపోవడంతో సిబిఐ కేసు నమోదు చేసింది. వాదోపవాదనలు విన్న తర్వాత నిందితులపై నేరం రుజువు కావడంతో ఒక్కొక్కరికి మూడు సంవత్సరాల జైలు, 10 వేల రూపాయల జరిమానా విధిస్తూ సిబిఐ కేసుల న్యాయమూర్తి ఎన్ ఆనందరావు తీర్పుచెప్పారు.
ఎసిబి వలలో
అవినీతి చేపలు
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు/విశాఖపట్నం/అనంతపురం, మే 3: లంచాలు తీసుకుంటూ అవినీతి శా ఖకు దొరికిపోయారు ప్రభుత్వ ఉద్యోగులు. రెండు జిల్లాల్లో లంచా వతారాల బండారం బయటపెట్టారు.ఆదాయానికి మించి ఆస్తులు కలిగియున్నారన్న ఆరోపణలపై గుంటూరు జిల్లా వినుకొండ గృహ నిర్మాణశాఖ డిఇ అద్దంకి శంకరరావు గృహాలపై ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. సుమారు 5 కోట్ల రూపాయల విలువైన భూములు, ఇళ్ళు, బంగారం, వెండి ఆభరణాలు గుర్తించారు. గృహ నిర్మాణశాఖ డిఇగా శంకరరావు గత మూడు సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఆరోపణలు వచ్చిన మీదట ఎసిబి దాడులు నిర్వహించినట్లు తెలిపారు. గుంటూరులోని కృష్ణనగర్‌లో ఒక అపార్టుమెంట్‌లో ఉంటున్న శంకరరావు ఇంటితోపాటు వినుకొండ, గుంటూరు, తెనాలి, అత్తోటలో(మూడు చోట్ల) ఆరు బృందాలు ఏకకాలంలో దాడులు జరిపాయి. దాడుల్లో ప్రాథమికంగా సుమారు 5 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు కలిగివున్నట్లు నిర్థారణకు వచ్చామని,
హౌస్‌ఫెడ్ రికవరీ అధికారి
ఇంటిపై తీసుకున్న రుణం తగ్గించేందుకు గాను బాధితుని నుంచి రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా ఎపి హౌసింగ్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ సొసైటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్, జిల్లా రికవరీ అధికారి ఆర్.సుబ్బయ్యను ఎసిబి అధికారులు శుక్రవారం అనంతపురంలో అదుపులోకి తీసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. కదిరికి చెందిన మహమ్మదాబీ ఎపి హౌసింగ్ సొసైటీ నుంచి ఇంటి నిర్మాణం కోసం గతంలో రూ. 87,500 రుణం తీసుకుంది. అయితే సకాలంలో రుణం చెల్లించకపోవడంతో ఇళ్లు వేలం వేస్తామని అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో ఆమె అల్లుడు షామీర్ బాషా హైదరాబాదులో ఉన్నతాధికారులను కలిసి రూ. లక్ష డిపాజిట్ చేశాడు. మహమ్మదాబీ ఆర్థిక పరిస్థితి సరిగా లేనందున మిగతా రుణంలో తగ్గించాలని విన్నవించాడు. దీనిపై విచారణ జరిపించాలని జిల్లా రికవరీ అధికారి ఆర్. సుబ్బయ్యను ఎండి ఆదేశించారు. నివేదిక మీకు అనుకూలంగా ఇవ్వాలంటే రూ. 20 వేలు లంచం ఇవ్వాలని సుబ్బయ్య బాధితులను కోరాడు. చివరకు రూ. 10 వేలకు బేరం కుదిరింది. దీంతో షామీర్‌బాషా ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు శుక్రవారం అనంతపురం నగరంలోని జెకె టైర్స్ దుకాణంలో ఆర్.సుబ్బయ్య బాధితుల నుంచి రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా ఎసిబి డిఎస్పీ సి.్భస్కరరెడ్డి అదుపులోకి తీసుకున్నారు.