గ్రేటర్ నోయిడా, మే 5: మనదేశానికి రానున్న మూడేళ్లలో 600 కోట్ల డాలర్ల రుణసాయాన్ని అందించనున్నట్లు ఆసియా డవలప్‌మెంట్ బ్యాంక్ (ఎడిబి) ఆదివారం ప్రకటించింది. ఎడిబి 46వ వార్షిక సమావేశం ముగింపు కార్యక్రమంలో ఆ బ్యాంక్ అధ్యక్షుడు టెకిహికో నకొవ ప్రకటించారు. నిధుల సమీకరణలో బ్యాంక్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ భారత్‌కు సాయాన్ని కొనసాగిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ‘్భరత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి కృషి చేస్తున్నామని, దీనిలో భాగంగా భారత్‌కు కనీసం 200 కోట్ల డాలర్ల రుణసాయానికి తక్కువ కాకుండా కొనసాగేటట్లు కృషి చేస్తాం ’ అని ఆయన హామీ ఇచ్చారు. ఎడిబి నుంచి రుణం తీసుకునే పెద్ద దేశాలలో మనదేశం ఒకటి. 2012లో ఎడిబి దేశంలో రవాణా, విద్యుత్, వాణిజ్యం, వర్తకం, ఆర్థిక రంగాలకు సుమారు 2,500 కోట్ల డాలర్ల రుణాన్ని సమకూర్చింది. రుణంలో భాగంగా ఏమైనా ప్రాజెక్టులు గురించారా? అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, ఇంకా ఏమీ లేదని తమ బృందం అన్నింటినీ పరిశీలిస్తోందని అన్నారు. ప్రపంచదేశాలకు ఎడిబి ఏడాదికి కనీసం 1000 కోట్ల డాలర్ల రుణాన్ని అందచేస్తోంది. నిధుల సమీకరణ గురించి నకొవా వివరిస్తూ, నిధుల సమీకరణలో ఎడిబి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని, దీనిపై ప్రత్యేక శ్రద్ద అవసరమని భావిస్తోందన్నారు. ‘పెట్టుబడులు సమకూర్చడంలో సురక్షితం, రుణ వసూళ్లను కూడా కీలకంగా భావించాలి’ అని చెప్పారు. 2009లో ఎడిబి మూలధనం మూడు రెట్లయింది.
యుపి, తమిళనాడులో ‘సెల్’ వినియోగం అధికం
న్యూఢిల్లీ, మే 5: దేశంలో అతి పెద్ద రాష్టమ్రైన ఉత్తర్‌ప్రదేశ్‌లో అత్యధికంగా సెల్ ఫోన్ వినియోగదారులుండగా ఆ తర్వాత వరుసగా తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో వినియోగదారులున్నారు. యుపి మినహా మిగతా రాష్ట్రాలలో వినియోగదారుల మొత్తం సంఖ్య దేశ మొత్తం మీద వాడకందారులలో సగం మంది ఉన్నారు. ప్రపంచంలో మొబైల్ వినియోగదారుల సంఖ్యలో మనదేశం ద్వితీయ స్థానంలో ఉంది. టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) గణాంకాల ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి దేశంలో 861.66 మిలియన్ల మంది వినియోగదారులున్నారు. అయితే జనవరిలో 862.6 మిలియన్ల మంది మొబైల్ వినియోగదారులుండగా ఫిబ్రవరి నాటికి వీరి సంఖ్య 0.11 శాతం తగ్గి 861.66 మిలియన్లకు చేరింది. యుపిలో 121.60 మిలియన్ల మంది, తమిళనాడులో 71.81 మిలియన్లు ఉన్నారు. మహారాష్టల్రో 67.73 మిలియన్లు, ఆంధ్ర ప్రదేశ్, బీహార్‌లలో వరుసగా 64.12, 60.73 మిలియన్ల మంది ఉన్నారు. ఈ అయిదు రాష్ట్రాలలో మొత్తం 366 మిలియన్ల మంది వినియోగదారులున్నారు. కర్నాటక 52.45 మిలియన్ల మంది ఉండగా ఈ రాష్ట్రం 6వ స్థానంలో ఉంది. ఎంపీలో 51.43 మిలియన్ల మంది, గుజరాత్‌లో 51.23 మిలియన్ల మంది, రాజస్థాన్‌లో 47.83 మిలియన్ల మంది ఉన్నారు. దేశంలో మొబైల్, ల్యాండ్‌లైన్ వినియోగదారుల సంఖ్య ఫిబ్రవరి నాటికి 892 మిలియన్ల మంది ఉండగా జనశరలో 893.1 మిలియన్ల మంది ఉన్నారు.