గ్రేటర్ నోయిడా, మే 5: 12వ పంచవర్ష ప్రణాళికాంతమైన మార్చి 2017 నాటికి కరెంట్ ఖాతా లోటు(సిఎడి)ను 2.5 శాతానికి తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లూవాలియా ఆదివారం చెప్పారు. ఆసియా డవలప్‌మెంట్ బ్యాంక్ (ఎడిబి) 46వ వార్షిక ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 2012-13 ఆర్థిక సంవత్సరానికి సిఎడి 5 శాతం ఉంటుందని అంచనా వేశారు. కాగా సిఎడిని తగ్గించేందుకు ప్రభుత్వం దశలవారిగా కృషి చేస్తోందని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడం, రుణాలను తగ్గించడం వంటి చర్యలను చేపట్టిందని, అయినా దేశీయ మదుపును పెంచి దీర్ఘకాలికి వౌలికసదుపాయాల కల్పనకు వినియోగపడేలా చూడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కాగా సిఎడి లోటు చాలా ఎక్కువగా ఉన్నందున అంత భారీ స్థాయిలో పొదుపును పెంచడం కూడా కష్టమైన పని ఆయన చెప్పారు. విదేశీ పెట్టుబడులతో వౌలికసదుపాయాలు కల్పించిన కొద్దీ విదేశీ మారకద్రవ్య ప్రభావం ఉంటుందని అన్నారు.
* మాంటెక్ సింగ్
english title:
p
Date:
Monday, May 6, 2013