న్యూఢిల్లీ, మే 5: సగటు మనిషికి అందుబాటులో కారు అందచేసిన టాటా మోటార్స్ ‘నానో’ అమ్మకాల విషయంలో లక్ష్యాన్ని చేరుకోలేకపోతోంది. ఏప్రిల్ నెలలో కేవలం 948 యూనిట్లను మాత్రమే విక్రయించింది. గత ఏప్రిల్‌లో 8,028 యూనిట్లను విక్రయించగా ఈ ఏప్రిల్‌లో అమ్మకాలు 88 శాతం తగ్గి 948 యూనిట్లే అమ్మగలిగింది. గత సంవత్సరం ఏప్రిల్, ఈ ఏడాది ఏప్రిల్‌లో ఒక కారును కూడా ఎగుమతి చేయలేదు. ఎస్‌ఐఎఎం గణాంకాల ప్రకారం, 2011-12లో 74,527 నానో యూనిట్లను అమ్మగా, 2012-13లో 27.75 శాతం క్షీణించి 53,848 యూనిట్లను మాత్రమే టాటా విక్రయించింది. గత సంవత్సరంలో 166 యూనిట్లను ఎగుమతి చేయగా అంతకు ముందు సంవత్సరంలో 3,462 యూనిట్లను ఎగుమతి చేసింది.
సగటు మనిషికి అందుబాటులో కారు అందచేసిన టాటా
english title:
t
Date:
Monday, May 6, 2013