సీతానగరం, మే 8: మండల కేంద్రంలోని సీతానగరం- పార్వతీపురం ప్రధాన రహదారిలో ఉన్న రైల్వేగేటుపై నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయింది. దీంతో అటు ప్రయాణికులు, ఇటు వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రయాణికులకు రైల్వేగేటు కష్టాలను తీర్చేందుకు 2009లో సుమారు 16 కోట్ల రూపాయల నిధుల వ్యయంతో ఆర్వోబి నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రెండు సంవత్సరాల కాల వ్యవధిలో వంతెన నిర్మాణం పూర్తిచేయడానికి గుత్తేదారునికి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రారంభంలో వేగవంతంగా జరిగినా నిర్మాణ పనులు కాలక్రమేనా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. అయితే ఈ మధ్యలో నిర్ణీత సమయానికి నిర్మాణం పూర్తిచేయనందున గుత్తేదారు కాంట్రాక్టును ప్రభుత్వం రద్దుచేసింది. ఏం జరిగిందో గాని తరువాత మళ్లీ అతడికే నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. 80 మీటర్ల పొడవుతో 24 స్తంభాలతో నిర్మాణం కావల్సి ఉండగా మరో 10 స్తంభాలకు స్లాబ్‌ల నిర్మాణంతోపాటు చిన్నచిన్న పనులు మిగిలి ఉన్నాయి. దాదాపు వంతెన నిర్మాణం పూర్తికావల్సిన తరుణంలో పనులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీతానగరం రైల్వేగేటుతో నిత్యం నరకయాతన అనుభవిస్తున్నామని, ఈ మార్గం గుండా నిరంరం ప్రయాణించే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్థానిక ప్రజాప్రతినిధులు గాని అధికారులుగాని నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా ప్రజలకు నిత్యం ప్రయాణించడానికి అనువైన ఆర్వోబిల నిర్మాణాల విషయంలో ప్రభుత్వానికి నిర్లక్ష్యం తగదని చెప్పుకోవాలి. గుత్తేదారుపై తగు ఒత్తిడి తీసుకువచ్చి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేసేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురి మృతి
బొబ్బిలి(రూరల్), మే 8: వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో ఇద్దరు మృతిచెందగా ఒకరు తీవ్రంగా గాయపడిన సంఘటన వెలుగుచూసింది. విజయవాడ నుంచి రాయగడకు సిమెంట్ లోడుతో వెళుతున్న లారీ మండలం పారాది గ్రామ సమీపంలో బుధవారం తెల్లవారు జామున ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో క్లీనర్ పాండు (53) అక్కడికక్కడే మృతిచెందగా డ్రైవర్ వెంకటేశ్వరులు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే 108 వాహనంలో డ్రైవర్‌ను బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం చేర్పించారు. వెంకటేశ్వర్లుకు కాలు విరగడంతోపాటు తలకు తీవ్ర గాయాలయ్యాయి. మృతిచెందిన క్లీనర్ పాండుది ఉయ్యూరు దగ్గర ఘంటసాల గ్రామం. డ్రైవర్‌ది విజయవాడ వద్దగల కండ్రి గ్రామం. బొబ్బిలి నుంచి విజయనగరం వెళుతున్న గుర్తుతెలియని వాహనం గొర్లె సీతారాంపురం గ్రామ సమీపంలో జి.రామారావు (55)ను ఢీకొంది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. రామారావు స్వగ్రామం రామభద్రపురంలోని చొక్కాపువీధిలో నివాసం ఉంటున్నాడు. బొబ్బిలి మండలం రాచ్చేరువలస గ్రామంలో ఉన్న భార్య, పిల్లలను చూసేందుకు సైకిల్‌పై బుధవారం వెళ్లి తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని బంధువులు , పోలీసులు తెలిపారు. వి.ఆర్.ఒ. సుధాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సి.ఐ. రాఘవులతోపాటు సిబ్బంది బుధవారం సంఘటనా స్థలానికి వెళ్లి పూర్తిస్థాయిలో పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సి.ఐ.రాఘవులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో రైతు దుర్మరణం
గంట్యాడ : మండలానికి చెందిన రామభద్రపురం జంక్షనలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన రైతు జి.గణపతి అక్కడికక్కడే మృతి చెందాడు. ఉపాధి కూలీ అయిన గణపతి మధ్యాహ్నం ఉపాధి పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. ఆసమయంలో విద్యుత్ ఉండడంతో పొలంలోని వ్యవసాయ మోటారు వేసేందుకు సైకిల్‌పై వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా వెనుక నుంచి వస్తున్న ట్రాక్టర్ ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతని తలమీదుగా ట్రాక్టర్ చక్రం వెళ్లిపోడవంతో అక్కడే చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గణపతి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు.
రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి
బొండపల్లి : రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన అంబటివలస గ్రామం వద్ద జరిగింది. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. దత్తిరాజేరు మండలం కె.కొత్తవలసకు చెందిన ఆటో డ్రైవర్ ఈదుబిల్లి దుర్గారావు(21) విజయనగరంలో మామిడి కాయల బుట్టలు దించి గజపతినగరం వైపు వస్తుండగా అంబటి
మండల కేంద్రంలోని సీతానగరం- పార్వతీపురం ప్రధాన రహదారిలో
english title:
a
Date:
Thursday, May 9, 2013