సింహాచలం, మే 10: సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహ స్వామి వారి నిజరూప దర్శనం (చందనోత్సవం) నిర్వహణ దేవాదాయశాఖ అధికారులకు ప్రతి సంవత్సరం సవాల్‌ను విసురుతోంది. రాష్ట్రంలోని వేరే ప్రధాన దేవాలయాల్లో నిశ్చింతగా ఉత్సవాలను నిర్వహించగలిగే అధికారులు సింహాచలం చందనోత్సవం అంటే బెంబేలెత్తిపోతున్నారు. ఇక్కడ నామ్‌కే వాస్తేగా దేవాదాయ శాఖ నిర్వహణ పెత్తనం అంతా రెవెన్యూ, పోలీసుశాఖలదే. ఎన్ని క్యూలైన్లు పెట్టిన, ఎన్ని టిక్కెట్లు ప్రవేశపెట్టినా ఆరోజు మాత్రం మంత్రులు, అధికారులు ప్రకటించిన దానికి విరుద్ధంగా ఉండటం సహజమైపోయింది. ముఖ్యంగా గాలిగోపురం మార్గం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ మార్గంలో ప్రవేశాన్ని నిషేధించగలిగితే చందనయాత్ర పూర్తయినట్లు భావించవచ్చు. గత సంవత్సరం జూలైలో జరిగిన ఆషాడపౌర్ణమి, గిరి ప్రదక్షిణే దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు. దీనికి ప్రధాన కారణాలు రెండు ఒకటి గాలిగోపులద్వార దర్శనం నిలిపివేత, రెండవది విఐపిల తాకిడి లేకపోవడం. విఐపిలతో వచ్చే వారిని క్యూలో వెళ్ళమన్నా వినకుండా గాలిగోపురంతో పాటు బైటకు వచ్చే మార్గాన్ని కూడా ఆక్రమించి నానా గొడవ చేస్తుంటారు. ఇక్కడ దేవాదాయ, దేవస్థానం ఉద్యోగుల మాటకు విలువే ఉండదు. ఇదంతా ఒక ఎత్తయితే విధి నిర్వహణను సక్రమంగా పాటించని దేవాదాయశాఖ ప్రత్యేకాధికారులు. ఈ కోవలేకే వస్తుంది గతేడాది అడిషినల్ కమిషన్ వ్యవహరించిన తీరు. ఈ ఏడాది వస్తున్న అడిషినల్ కమిషనర్, ఇఓలు కలిగి గాలిగోపుర దర్శనాన్ని నిలిపివేయ గలిగితే క్యూలో వచ్చే సామాన్య భక్తునికి నిజరూప దర్శనం సుగమమవుతుంది. లేనిఎడల ఈనుగాచి నక్కలపాలైన చందంగా తయారవుతుంది.
సింహాచలం శ్రీ వరాహ
english title:
simhachalam
Date:
Saturday, May 11, 2013