Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

టిఆర్‌ఎస్ పెళ్లి సందడి

$
0
0

సంగారెడ్డి , మే 12: జిల్లా కేంద్రం సంగారెడ్డిలో ఆదివారం జరిగిన తెరాస జిల్లా అధ్యక్షులు ఆర్.సత్యనారాయణ కూతురు వివాహానికి తెరాస అధినేత కెసిఆర్, రాష్ట్ర మంత్రి గీతారెడ్డి, మెదక్ ఎంపి విజయశాంతి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు, తెలంగాణ ఐక్య వేదిక అధ్యక్షులు ఆచార్య కోదండరాం, మాజీ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, సోలిపేట రాంలింగారెడ్డిలు హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు.

రూ.20 వేల కోట్లతో
బిసి సబ్‌ప్లాన్ ప్రకటించాలి
* ఆర్.కృష్ణయ్య డిమాండ్
* 15న కలెక్టరేట్‌ల ముట్టడికి పిలుపు
సంగారెడ్డి , మే 12: 20 వేల కోట్లతో బిసి సబ్ ప్లాన్ ప్రకటించాలని ఈ నెల 15న తలపెట్టిన కలక్టరేట్‌ల ముట్టడి ధర్నాలను విజయవంతం చేయాలని బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రం సంగారెడ్డి ఐబిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బిసి కార్పొరేషన్‌ల ద్వారా బ్యాంకులతో నిమిత్తం లేకుండా రుణాలు మంజూరు చేయాలని, కులవృత్తులను ఆధునీకరించడానికి కార్పొరేట్ స్థాయిలో వ్యాపారం నడిపించడానికి ఒక్కొక్కరికి వృత్తిని బట్టి 10 లక్షల నుండి 50 లక్షల వరకు రుణాలు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 16 కుల వృత్తుల ఫెడరేషన్‌లకు జనాభా నిష్పత్తిలో బడ్జెట్ కేటాయించాలన్నారు. సొసైటీల ఏర్పాటుతో నిమిత్తం లేకుండా వ్యక్తిగతంగా రుణాలివ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి బిసి జూనియర్ అడ్వకేట్లకు ఒక్కొక్కరికి నెలకు 6 వేల స్ట్ఫైండ్ మూడు సంవత్సరాలపాటు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం త్వరలో పంపిణీచేయబడే 8వ విడత భూ పంపిణీలో భూమిలేని నిరుపేద బిసి కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 ఎకరాల భూమి కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. చిన్నకారు, సన్నకారు రైతులకు బోరు వేసి పంపుసెట్‌లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి బిసి రైతుకు సోలార్ పంపుసెట్లు వందశాతం మంజూరు చేయాలన్నారు. పాఠశాలస్థాయి విద్యార్థులకు ఫ్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్ స్కీం పునరుద్దరించి ఒక్కొక్కరికి నెలకు 500 రూపాయలు ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో బిసి ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఎ.రాంకోటి ముదిరాజ్, బిసి హక్కుల పోరాట కమిటీ అధ్యక్షులు రాఘవేందర్, బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రామాగౌడ్, నాయకులు సిరిబాబు తదితరులు పాల్గొన్నారు.

రాజ్యాధికారంతోనే మైనార్టీలకు న్యాయం
జహీరాబాద్, మే 12: రాజ్యాధికారంతోనే మైనార్టీలకు న్యాయం జరుగుతుందని ఎంఐఎం అధినేత, పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసి అన్నారు. జహీరాబాద్ పట్టణంలోని ఉన్నత పాఠశాలమైదానంలో శనివారం రాత్రి నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మైనార్టీలకు జరుగుతున్న అన్యాయన్ని ఏకరువుపెట్టారు. విద్యార్థులు మొదలు మైనార్టీ వార్గాల వారికి ఎందులోనూ న్యాయం జరుగడంలేదన్నారు. దీని పర్యావసానాన్ని ప్రభుత్వాలకు రుచిచూపిస్తామని ఆయన హెచ్చరించారు. మైనార్టీలతోనే మన్మోహన్‌సింగ్ ప్రధాని కాగలిగాడని, తాము లేకుంటే ఆపదవి వచ్చి ఉండేది కాదన్నారు. అయినా కనీసం తమ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇప్పించాలని అడిగితే వౌనంగా తలూపారేకాని మంజూరు చేయలేదన్నారు. గుజరాత్ సిఎం.నరేంద్రమోడి ప్రభుత్వంలో మైనార్టీలకు స్వేచ్ఛలేదన్నారు. ఇల్లు కొనాలన్నా, అమ్మాలన్నా, మతం మారాలన్నా ప్రభుత్వ అనుమతి తప్పనిసరన్న నిబంధలను విధించాడన్నారు. మైనార్టీలను వేధిస్తున్న ఇలాంటి పార్టీలను ఓడించాలని, ప్రభుత్వాలను గద్దెదించి తమ ప్రతాపాన్ని చాటాలని పిలుపునిచ్చారు. ప్రధాని కావాలని కలలుకన్న అద్వానినే ఆనాడు అడ్డుకున్నామని, మోడీని ఎలాకానిస్తామన్నారు. ఎంఐఎంను బలపర్చడంతోనే మైనార్టీల సంక్షేమం కలుగుతుందన్నారు. టిఆర్‌ఎస్, వైఎస్‌ఆర్‌సిపిలతోపాటు అన్ని పార్టీలు మైనార్టీలకు ద్రోహం తలపెట్టినవేనని స్పష్టంచేశారు. దివంగత సిఎం వైఎస్‌ఆర్ చాలాసార్లు క్యాబినెట్‌లో చేరాలని కోరాడని, దానిని తాను తిరస్కరించానన్నారు. మైనార్టీలకు న్యాయం చేయండి చాలని కోరామన్నారు. కానీ అప్పుడు కూడా మైనార్టీలకు ఒరిగిందేమిలేదన్నారు. మైనార్టీలకు బడ్జెట్‌లో సముచిత న్యాయం దక్కలేదన్నారు. విద్యార్థులు చదువుకునేందుకు సరైన వసతులులేవని, చాలినన్ని స్కాలర్‌షిప్‌లు ఇవ్వకుండా వారిని చదువులను పరోక్షంగా అడ్డుకుంటున్నారన్నారు. ప్రధాన మంత్రి తమకు అన్యాయం చేశారని ఆరోపించారు. బడ్జెట్‌లో రూ.3500కోట్లు బడ్జెట్‌లో కేటాయించి విద్యార్థులందరికి స్కాలర్‌షిప్‌లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్, బీహార్ తదితర రాష్ట్రాల్లో బిపిఎల్‌లో ఉన్నవారికే ఇళ్లు ఇస్తున్నారు. దీంతో అక్కడి మైనార్టీలకు అన్యాయం జరుగుతోందన్నారు. మహారాష్టల్రో 10శాతం బడ్జెట్‌ను మైనార్టీలకు కేటాయించారని ఇది ఎందుకు సరిపోదన్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో దళితులకు తాము మద్దతిచ్చేందుకు సిద్ద్దంగా ఉన్నాం. రానున్న స్థానిక సంస్థలు మొదలు అన్ని ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ పోటీచైస్తుందన్నారు. బాబరీ మజీద్‌ను కూల్చిన వారిలో మోదటి వరుసలో ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన ఆద్వాని తరువాత ఉమాభారతి, మురళీ మనోహర్‌జోషిలున్నారన్నారు. ఎంఐఎం నాయకులు, జిహెచ్‌ఎంసి. మాజీ మేయర్ జాఫర్ హుస్సేన్, సయ్యద్ అహ్మద్‌పాషా తదితరులు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా బలాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఘనంగా..
బసవ జయంతి వేడుకలు
సదాశివపేట, మే 12: సమసమాజ స్థాపన కోసం నిరంతరం శ్రమించిన మహాత్మ బసవేశ్వరుడి జయంతి వేడుకలను వీరశైవ లింగాయత్‌లు ఘనంగా నిర్వహించారు. స్థానిక లక్ష్మీకాంప్లెక్స్ సమీపంలోని బసవేశ్వరుడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన సమాజాభివృద్ధి కోసం చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ సమాజం సభ్యులు బోడగామ శ్రీశైలం, చీల మల్లన్న, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ కోడూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మోడల్ డైట్‌సెట్
గజ్వేల్, మే 12: డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో స్థానిక జూనియర్ కళాశాలలో ఆదివారం మోడల్ డైట్‌సెట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజు మాట్లాడుతూ విద్యార్థుల్లో భయం, బెరుకుదనం పోగొట్టి చక్కటి ఫలితాలు సాధించే క్రమంలో మోడల్ పరీక్షలు ఉపయుక్తంగా మారుతాయని తెలిపారు. పోటీ పరీక్షలకు సమాయత్తం చేసే క్రమంలో మోడల్ ఈసెట్, మోడల్ టెట్, మోడల్ విఆర్వో వంటి పరీక్షలు నిర్వహిస్తూ ప్రోత్సహిస్తున్నట్లు స్పష్టం చేశారు. విద్యా, ఉపాధి, ఉద్యోగ రంగాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో నిరు ద్యోగం పెరిగిపోతున్నట్లు విమర్శించారు. క్రమశిక్షణతో విద్యనభ్యసిస్తూ ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించగా, ఈ డైట్‌సెట్‌లో 200ల మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. నేతలు మల్లేశం, వెంకటేశ్వర్లు, ఉప్పలయ్య, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

అక్షయ లక్ష్మికి ఆహ్వానం
సిద్దిపేట టౌన్, మే 12: అక్షయ తృతీయ భారతీయులకు ఎంతో ప్రీతిపాత్రమైనది. ఈ రోజు బంగారం, ఆస్తులు కోనుగోలు చేస్తే మంచి జరుగుతుందని విశ్వాసం. ప్రతియేడు వైశాఖమాసం శుక్లపక్ష తదియను అక్షయ తృతీయగా పరిగణిస్తారు. ఈ నెల 13న అక్షయ తృతీయ జరగనుంది. పుత్తడి కొనుగోలుతో తమ భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని నమ్మకం. ఈ నమ్మకాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పసిడి దుకాణా దారులు కస్టమర్లను ఆకర్షించేందుకు పలు విధాలుగా ప్రచారాలు చేస్తున్నాయి. అంతర్జాతీయంగా పసిడి, వెండి లోహలకు నెలకొన్న అనిశ్చితి ఫలితంగా ధరలు ఒడిదుడుకులుగా ఉంది. గత యేడాది కంటే ప్రస్తుతం ధరలు తగ్గి ఉండడంతో కస్టమర్ల తాకిడి ఎక్కువ ఉంటుందని భావించి కొన్ని బ్యాంకులు ఫైనాన్స్‌లు ప్రత్యేక ఏర్పాట్లతో రుణాలను కూడా ఇస్తున్నాయి. అక్షయ తృతీయ రోజు అత్యధికంగా క్రయ విక్రయాలు జరిగే విధంగా వ్యాపారులు ఏర్పాట్లు చేసుకున్నారు. కస్టమర్లు ఇబ్బందులు పడకుండా ముందస్తుగా బుకింగ్ అవకాశాలు ఏర్పాట్లు చేసారు. ప్రస్తుతం మార్కెట్లో బంగారం ధరలు కొద్దిగా తగ్గినందున సామాన్యులు సైతం అక్షయ తృతీయ రోజున వారి స్థాయియికి వీలుగా కొనుక్కోడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఇందుకు పట్టణంలో భారీ స్థాయిలో బంగారం, వెండి అమ్మకాలు సాగించడానికి సిద్ధంగా ఉంచారు. అక్షయ తృతీయ అందరికి మంచి చేయాలని ఆశిద్ధాం.

కుంభమేళాలో భక్తుల సందడి
న్యాల్‌కల్, జహీరాబాద్, మే 12: మండలంలోని పంచవటి క్షేత్రంలో 10వరోజు కుంభమేళాకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా భక్తులు కుంభమేళాలో పుణ్య స్నానాలుచేసి గంగామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాధు, సంతులు యజ్ఞాలు నిర్వహించగా పండితులు హోమాలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా బోదన్‌నుంచి వచ్చిన నారాయణ, ధన్నారం సిద్ద్ధారెడ్డిల ఆధ్వర్యంలో భజన కీర్తనలు నిర్వహించారు. వారితోపాటు కుంభమేళాకు వచ్చిన భక్తులు భజన కీర్థనల్లోపాల్గొన్నారు. భక్తులు మంజీరనదిలో ప్రమిదలు వెలిగించి వదిలారు. ప్రత్యేక పూజలు నిర్వహింహించారు. అదేవిధంగా పంచవటిలోని దేవతా మూర్తులను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. మేళా ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో మహిళా భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఈ సందర్భంగా మంజీరానది వద్ద సందడి నెలకొంది. సాధువులు కుంభమేళాకు వచ్చిన భక్తులను ఆశీస్సులు అందజేశారు. మంజీరా కుంబమేళాకు వచ్చిన భక్తులకు ఈ ప్రాంగణంలో భోజన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. సాదువులు రోజువారి కార్యక్రమంలో భాగంగా ఆదివారం కూడా ధ్వజస్తంభానికి, పల్లకీకి పూజలు నిర్వహించారు. అనంతరం ఆటపాటలతో పల్లకీని ఊరేగిస్తూ మంజీరనది వరకు వెళ్లారు. అక్కడ గంగామాతకు పూజలు నిర్వహించారు. పుణ్యస్నానాలు చేశారు. అదేమార్గంలో తిరుగు ప్రయాణమయ్యారు. మేళాప్రాంగణానికి చేరుకుని వచ్చిన భక్తులును ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

జిల్లా కేంద్రం సంగారెడ్డిలో ఆదివారం జరిగిన తెరాస జిల్లా
english title: 
trs

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles