Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

పేదల ఖిల్లా సిక్కోలు

$
0
0

జిల్లాలో పదేళ్ల తర్వాత జనాభా గణాంకాలు చూస్తే 2011 జనాభా లెక్కలలో స్వల్పంగా పెరుగుదల కన్పించింది. తాజా లెక్కలు ప్రకారం సిక్కోల్ జనాభా.27,03,114 మంది. ఇందులో 6,81,330 కుటుంబాలు. గత జనాభా లెక్కలతో సరిపోల్చితే జనాభా వృద్ధి రేటు 11.10శాతంగా నమోదైంది. జిల్లాలో దారిద్య్రరేఖకు దిగువనున్నవారు 34.5 శాతం. మధ్యతరగతి కుటుంబాలు 57.4 శాతం. దేశ సంపన్నుల జాబితాలో సిక్కోల్ పేరునిలబెట్టిన జి.ఎం.ఆర్. వంటి పారిశ్రామిక వేత్త మినహాయిస్తే..మిగిలిన ధనవంతుల శాతం చూస్తే 8.1 మాత్రమే. ఇటీవల సర్కార్ నిర్వహించిన సర్వేలో తేటతెల్లమైన గణాంకాలివి. ఇందులో సురక్షిత మంచినీరు తాగుతున్నవి కేవలం 21.4 శాతం కుటుంబాలే. ఘోరాతిఘోరమైన విషయమేమిటంటే...అసలు మరుగుదొడ్ల సౌకర్యం లేని కుటుంబాలు 79.2 శాతం. 74.4 శాతం కుటుంబాలకు స్నానపు గదులే లేవు- కానీ, సెల్‌ఫోన్లు వినియోగిస్తున్న కుటుంబాలు 58.2 శాతం. ఇదీ సిక్కోల్ ప్రగతి. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలోని కుటుంబాలు వాటి స్థితిగతులపై ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గణాంకాలివి. ఏటా వేల కోట్ల రూపాయలతో పనులు చేస్తున్నామంటున్నారు. అందరికీ తాగునీరు ఇస్తున్నామంటున్నారు. మరుగుదొడ్ల నిర్మాణానికి సబ్సిడీల రూపంలో కోట్ల రూపాయల సొమ్మును కేటాయించారు. ఇదంతా ఎక్కడికి పోతోంది!? ఎవరికి వెళుతోంది?? కనీసం ప్రజలకు మరుగుదొడ్ల సౌకర్యం కల్పించలేని..తాగడానికి గుక్కెడు నీళ్లివ్వలేని పాలకులను ఎమనాలి? ఇవే కాదు..నివేదికలో ఎన్నో వాస్తవాలు బయటపడ్డాయి. ఒకే గదితో సరిపెట్టుకున్న కుటుంబాలూ తక్కువేమీ లేవు. ఏకంగా 46.7 శాతంగా ఉంది. నలుగురు సభ్యులున్న కుటుంబాలు 31.4 శాతం ఇక ఉమ్మడి కుటుంబాల జాడే లేదు. తొమ్మిదికిపైగా సభ్యులున్న కుటుంబాలు కేవలం 1.8 శాతమే. వ్యాధుల వ్యాప్తికి బావుల నీరే కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నా..ఇంకా ఆ నీటినే తాగుతున్న కుటుంబాలు 34.3 శాతం ఉన్నాయి. విద్యుత్ లేక కిరోసిన్ వాడుతున్న కుటుంబాలేమో 12.2 శాతం. జీవితాలతో ఎంతోకొంత ఉపాధి పొందుతున్న సిక్కోల్ జనాన్ని ఉద్దరించటంలో పాలకులు ఘోరంగా వైఫల్యం చెందారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? ఇంకా తవ్వేసుకోవడానికి గనులెక్కడున్నాయి..ఇసుకను ఎలా తవ్వేసుకోవాలి. కోటరీలోని మనుషులకు ఇంకా ఏమేం పందేరాలు ఇవ్వాలి...అడ్డమైన పనులు చేయడానికి పనికొచ్చే అధికారులు రాష్ట్రంలో ఎక్కడున్నారో ఏరికోరి..ఇక్కడికి ఎలా తెచ్చుకోవాలని..అన్న యాతనే తప్ప - జనం సంక్షేమానికి ఏం చర్యలు తీసుకున్నారో.. నివేదికలే సాక్ష్యం!
* గృహాల నిర్మాణం తీరును పరిశీలించిన గణాంక నిపుణులు గడ్డి, తాటకు, వెదురు, కలప, మట్టి వినియోగం 20.9 శాతం ఉన్నట్టు నివేదించారు. ప్లాస్టిక్, పాలథిన్ 0.2 శాతం, టైల్స్ 12.7 శాతం ఇటుకలు 0.1 శాతం, రాయి. 0.6 శాతం, మెటల్, సిమ్మెంటు షీట్లు 9.7 శాతం, కాంక్రీటు 58.8 శాతం, ఇతర సామాగ్రి వినియోగం 0.1 శాతం, మట్టి 24.1 శాతం, సిమ్మెంటు 68 శాతంగా ఉన్నాయి.
* జిల్లాలో నివసిస్తున్న కుటుంబాలు తమ ఇళ్లని ఏఏ అవసరాలకు వినియోగిస్తున్నారో గణన చేశారు. ఇళ్లలో నివిస్తున్నవారు 86.4 శాతం, దుకాణాలు, కార్యాలయాలు 3.4 శాతం, దేవాలయాలు 2.3 శాతం, పాఠశాలలు, హోటళ్లు, లాడ్జీలు, అతిథిగృహాలు 2.4 శాతం, ఇతర అవసరాల వినియోగం 8.6 శాతం, తాళాలు వేసుకున్న ఇళ్లు 3.6 శాతం, ఆసుపత్రుల నిర్వాహణ 2.1 శాతంగా ఉన్నాయి.
* తాగునీటి సదుపాయం పరిశీలిస్తే - కుళాయి నీళ్లపై ఆధారం 28.1 శాతం, శుద్ధిచేసిన నీళ్లు 19.8 శాతం, బావులపై ఆధారం 34.6 శాతం, బోరు నుంచి అందే నీరు 12.8 శాతం, దగ్గరలో గల నీటి వనరులు 57 శాతం, దూరంగా ఉన్న నీటివనరులు 28.7 శాతం, చెరువులు, నదులు 3.5 శాతం.
* మరుగుదొడ్ల కోసం కోట్లాది రూపాయలు సబ్సిడీని సర్కార్ ఇచ్చినప్పటికీ, 21.2 శాతం కుటుంబాలకే మరుగుదొడ్లు అందుబాటులో ఉన్నాయి. అందులో సెప్టిక్ ట్యాంకులు ఉన్నవి కేవలం 17.2 శాతమే. అందుబాటులో లేక ఇక్కట్లు పడుతున్న కుటుంబాలు జిల్లాలో సుమారు 76 శాతం ఉన్నాయి. బహిర్భూమికి వెళ్లే వారు 77.6 శాతం వరకూ ఉంటారు.
* బ్యాంకుల ద్వారా సేవలందుకునే కుటుంబాలు 48 శాతం వరకూ ఉన్నాయి. ఇందులో సొంత ఇళ్లు కట్టుకునే వారు 88 శాతం ఉండగా, అద్దె ఇళ్లలో ఉన్నవారు 19.2 శాతం ఉన్నారు. ఇతరులు 15 శాతం వరకూ ఉంటారు.
* విద్యుత్ సౌకర్యం పరిశీలిస్తే - ఎలక్ట్రిసిటీ ఉన్న కుటుంబాలు 87.6 శాతం, సోలార్‌పై ఆధారపడిన వారు 0.8 శాతం కాగా, కిరోసిన్‌పై ఆధారపడిన కుటుంబాలు 12.9 శాతం. ఇతర ఇంధనాలపై ఆధారపడిన కుటుంబాలు 2.1 శాతంగా ఉంది.

ఉభయ రాష్ట్రాల ఇంజనీర్ల బృందం నిశిత పరిశీలన
భామిని, మే 15: ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల మధ్య వంశధార నది జలవివాదంపై ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు ఉభయ రాష్ట్రాలకు చెందిన ఇంజనీర్ల బృందం బుధవారం సర్వే నిర్వహించింది. ఒడిశాలోని ఓహితి ఇరిగేషన్ డివిజన్ ఇ ఇ ధీరేష్‌చంద్రదేవ్, ఆంధ్రాకు చెందిన ఇ ఇ ఎన్.రాంబాబుల నేతృత్వంలో భామిని మండలంలోని నేరడి బ్యారేజి, కాట్రగడ బి ప్రాంతాల్లో బుధవారం సర్వే జరిపారు. ఈ సర్వే వారం రోజుల పాటు కొనసాగుతుంది. వంశధార నది గమనంపై ఆంధ్రా, ఒడిశా ప్రభుత్వాలు సంయుక్తంగా సర్వే నిర్వహించి నివేదిక సమర్పించాలని ట్రిబ్యునల్ ఆదేశించడంతో నేరడి బ్యారేజి , కాట్రగడ బి ప్రాంతాల వద్ద బయోస్కోప్‌తో ఇంజనీర్ల బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో వంశధార నదీ ప్రవాహం వెడల్పు, నిర్మాణాల వలన ఎదురయ్యే సమస్యలు, తాగు, సాగునీటి సమస్యలను అనే్వషించేవిధంగా ఈ సర్వే కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఈ సర్వే కార్యక్రమంలో ఒడిశాకు చెందిన ఇంజనీరింగ్ బృందం సభ్యులు సురేష్‌కుమార్ బెహ్రా, బిజయకుమార్‌పాడి, పసి వెంకటేష్‌తో పాటు మరికొందరు సభ్యులు పాల్గొన్నారు. అలాగే ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఎస్‌సి బి.రాంబాబు, బి ఎన్ ఎస్ ఎస్ కుమార్, పి.నాగేశ్వరరావు, ఎ ఆర్ ఎన్ శర్మ, వై వీరశంకరరెడ్డి, బి ఎన్ ఎస్ ఎ కుమార్, వి సుధాకర్, ఎం ఎస్‌కె ప్రసాద్, ఎన్ వి ఎస్ క్రిష్ణప్రసాద్, డి సీతారాం, డిజె కామేశ్వరరావు, జి శ్యాం, ఎ ప్రకాశ్‌లు పాల్గొన్నారు.

వైకాపాకు బల్లాడ దంపతులు దూరం?
ఎచ్చెర్ల, మే 15: జగన్ పార్టీలో చేరి పదవులు పందేరంలో అందలం ఎక్కాలని ఆశలు పెంచుకున్న పలువురు నాయకులకు ఆ పార్టీ అధిష్ఠానం తగిన గుర్తింపు ఇవ్వకపోవడంతో వారంతా వౌనముద్రలోకి జారుకున్నారు. అటువంటి నాయకుల వ్యవహారంతో వారి శ్రేణులతో పాటు అభిమానులు ఆయోమయానికి గురవుతున్నారు. ఆది నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ ఎంపిపిలు బల్లాడ జనార్ధనరెడ్డి, హేమమాలినిరెడ్డి జిల్లాలో మొదటిసారి కాంగ్రెస్ పార్టీని వీడి వైకాపాలో చేరారు. అంతేకాకుండా పార్టీ చేపట్టిన పలు కార్యక్రమాల్లో జిల్లా నుంచే వీరు ప్రధాన భూమిక పోషించారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా నుంచి ఈ దంపతుల్లో ఒకరికి ఎమ్మెల్యే టిక్కెట్ కావాలని అధిష్ఠానం వద్ద అనేకమార్లు విన్నవించుకోవడం, దీనిని పరిశీలిస్తామని జగన్మోహన్‌రెడ్డే భరోసా ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే ఇటీవల పార్టీ నియమించిన సమన్వయకర్తల జాబితాలో వీరికి చేదు అనుభవం ఎదురైంది. అంతేకాకుండా రణస్థలం మాజీ ఎం.పి.పి. గొర్లె పరిమళ భర్త కిరణ్‌కుమార్‌ను సమన్వయకర్తగా నియమించడంతో బల్లాడ దంపతులు భంగపడ్డారు. అనేక నియోజకవర్గాల్లో ఇద్దరేసి సమన్వయకర్తలను నియమించి ఎచ్చెర్ల నియోజకవర్గం వచ్చేసరికి ఒకరికే అవకాశం కల్పించడం పట్ల బల్లాడ అనుచరులంతా తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అప్పటి నుంచి ఇప్పటివరకు పార్టీ చేపట్టిన ఎటువంటి కార్యక్రమాల్లో బల్లాడ దంపతులు పాల్గొనకుండా దూరంగా ఉంటున్నారు. దీంతో కాంగ్రెస్ గూటికి తిరిగి వీరు చేరనున్నారనే ప్రచారం ఊపందకుంది. ఇటీవలి స్థానిక ఎంపిడిఒ కార్యాలయ సూపరింటెండెంట్ పదవీ విరమణ కార్యక్రమంలో కూడా స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేతో వీరు వీడ్కోలు సభలో పాల్గొనడం మరింత అనుమానాలు తావిచ్చింది. ఈ దంపతులకు పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, మంత్రి ధర్మాన ప్రసాదరావు, కోండ్రు మురళీమోహన్‌తో ఉన్న సన్నిహిత సంబంధాల బట్టి తిరిగి సొంత పార్టీలోకి రావాలనే ఒత్తిళ్లు కూడా అధికంగా ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మొన్నజరిగిన సహకార ఎన్నికల్లో కూడా ధర్మవరం నుంచి టిసిగా ఎన్నికైన వైసీపీ అభ్యర్థిని అధికార పార్టీ నుంచి ఎస్.ఎం.పురం సహకార పీఠాన్ని ఆశించి బరిలో దిగిన బోర సాయిరాంకే అండగా నిలపడంలో బల్లాడే కీలక పాత్ర పోషించారు. లావేరు, జి.సిగడాం, రణస్థలం మండలాల్లో కొంతమంది కిరణ్‌కుమార్ నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పార్టీ శ్రేణులే చర్చించుకుంటున్నాయి. ఈ విషయాన్ని గ్రహించిన నియోజకవర్గం సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్ పలుమార్లు బల్లాడ దంపతులను బుజ్జగించాలని ప్రయత్నించినా, ఫలితం లేకపోయిందని ఆ పార్టీ శ్రేణులే చర్చించుకుంటున్నాయి. మరోసీనియర్ నాయకుడు గొర్లె హరిబాబునాయుడు తొలుత నియోజకవర్గాన్ని చుట్టుముట్టి వివిధ కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ప్రజాసమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఇదే స్పీడును హరిబాబునాయుడు కొనసాగించి జగన్ అభిమానుల్లో ఉత్తేజం నింపుతారని అందరూ భావించినప్పటికీ ఇంతలో ఏమైందో తెలీదు గాని ఆయన కూడా ఒక్కసారి ముఖం చాటేశారు. పార్టీకి రానున్న ఎన్నికలు ప్రతిష్ఠాత్మకం కానుండటంతో ఇప్పటి నుంచే నేతలను బుజ్జగించకుంటే పార్టీకి వలసల బెడద తప్పేటట్లు లేదని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.
సబ్‌ప్లాన్ ప్రకటించాలని బిసిల గర్జన
* కలెక్టరేట్ వద్ద ధర్నా
శ్రీకాకుళం (టౌన్), మే 15: రాష్ట్రంలో ఇరవై వేల కోట్ల రూపాయలతో బిసి సబ్‌ప్లాన్ ప్రకటించాలని కోరుతూ జిల్లా బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వివిధ బిసి కులాల సంఘ నాయకులంతా కలిసి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బుధవారం స్థానిక ఎన్జీవో హోం నుండి బయలుదేరిన ర్యాలీ కలక్టరేట్ వద్ద ధర్నా చేపట్టిన అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పి.చంద్రపతిరావు మాట్లాడుతూ బిసి కార్పొరేషన్ల ద్వారా బ్యాంకుతో నిమిత్తం లేకుండా రుణాలు మంజూరు చేయాలని, కులవృత్తులను ఆధునికీకరించడానికి, కార్పొరేట్ స్థాయిలో వ్యాపారం నడిపించడానికి ఒక్కొక్కరికి వృత్తిని బట్టి 50 లక్షల రూపాయల వరకు రుణాలు మంజూరు చేయాలని కోరారు. ప్రభుత్వం త్వరలో పంపిణీ చేయబోయే ఎనిమిదవ విడత భూముల పంపకంలో భూమిలేని బిసి కుటుంబాలకు రెండేసి ఎకరాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బిసిలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని, చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో కటకం నాగేశ్వరరావు, అల్లంశెట్టి హరిబాబు, సతివాడ ధర్మారావు, టి.తిరుపతిరావు, డోల పాపారావు తదితరులు పాల్గొన్నారు.
.................

అందుబాటులో త్రీజి సేవలు
జిల్లా టెలికం అడ్వైజరీ కమిటీ సభ్యుడు నారాయణ
ఆమదాలవలస, మే 15: టెలికాం వ్యవస్థలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులు కారణంగా ప్రపంచం మనిషి అరచేతిలోకి వచ్చిందని, ఇందులో భాగంగా ఏర్పాటైన త్రీజి సేవలు అందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా కృషిచేస్తానని జిల్లా టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యుడు లోపింటి నారాయణ తెలిపారు. బుధవారం ఇక్కడి ప్రెస్‌క్లబ్ వద్ద ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టెలికం వ్యవస్థ ఉన్నత స్థాయికి చేరుకుందని, ఇది సామాన్య మానవాళికి ప్రయోజనకరమైన గృహోపకరణంగా మారిందన్నారు. అదేవిధంగా టెలికం శాఖ సరికొత్త పథకాలను ప్రవేశపెడుతూ ప్రజల్లోకి మరింత చేరువవుతోందని, బ్యాడ్‌బ్రాండ్ సేవలు మరింత విస్తరిస్తున్నాయన్నారు. బిఎస్‌ఎన్‌ఎల్ సేవలు సామాన్య మానవుడికి మరింత చేరువకావాలనే ఉద్దేశంతో తమ అడ్వైజరీ కమిటీ పనిచేస్తుందన్నారు. ఈ సమావేశంలో గాజుల కొల్లివలస, తిమ్మాపురం, పార్వతీశంపేట గ్రామాలకు చెందిన ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
క్రీడలతో పోటీతత్వం
*ఎమ్మెల్యే కృష్ణదాస్
జలుమూరు, మే 15: పట్టణ ప్రాంతాలకే పరిమితమైన క్రీడలు నేడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా పోటీతత్వంతో జరుగడం ఆనందదాయకమని ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ అన్నారు. మండలం శ్రీముఖలింగం గ్రామంలో స్థానికులు ఏర్పాటుచేసిన క్రికెట్ టోర్నమెంటు కార్యక్రమాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశలో క్రీడలపై ప్రతీ ఒక్కరికీ ఆసక్తి పెరగాలని, క్రీడారంగంలో ఆసక్తి పెరిగితే ఆరోగ్యం కూడా మెరుగవుతుందన్నారు. మారుమూల ప్రాంతాల్లో క్రీడారంగ అభివృద్ధి కోసం ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాయని చెప్పారు. యువత కేవలం పోటీతత్వం అవలంభించుకుని మంచి లక్ష్యాలతో జిల్లా, రాష్ట్రంలో విజేతలుగా నిలిస్తే గ్రామీణ ప్రాంతాలకు గుర్తింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హనుమంతు కిరణ్‌కుమార్, మాజీ జెడ్పీటిసి కొయ్యాన సూర్యారావు, కనుసు సీతారాం, పైడి విఠల్‌రావు, బస్వా యోగి పలువురు పాల్గొన్నారు.
రూ.5.3 కోట్లతో 80 పనులు మంజూరు
నరసన్నపేట, మే 15: మండలంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 80 పనులను గుర్తించామని, దీనికి 5.30 కోట్లరూపాయలను వెచ్చించనున్నట్లు ఎ.పి.ఒ సత్యమూర్తి తెలిపారు. బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏప్రిల్ నెల నుండి అధిక సంఖ్యలో ఉపాధి కూలీలకు పని కల్పిస్తున్నామని వెల్లడించారు. ఇప్పటివరకు 10,335 మంది కూలీలకు పనికల్పించామని పేర్కొన్నారు. మండలంలో 775 గ్రూపులు పనిచేస్తుండగా షెడ్యూల్ తెగలకు సంబంధించి 70 గ్రూపులు, వికలాంగులకు చెందిన 16 గ్రూపులు పనులు చేస్తున్నాయని స్పష్టంచేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాన్ని అధిగమించేందుకు అన్నివిధాలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు 2,500 లక్ష్యం కాగా దానికి చేరువలో ఉన్నామని తెలిపారు.
నిధులొస్తే ఆలయ అభివృద్ధి సాధ్యం
జలుమూరు, మే 15: ప్రముఖ పుణ్యక్షేత్రం మండలం శ్రీముఖలింగం మధుకేశ్వర ఆలయానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే అభివృద్ధికి ప్రణాళిక తయారైందని కేంద్ర పురావస్తుశాఖ కన్జర్వేటివ్ అసిస్టెంట్ శ్రీనివాసరావు తెలిపారు. మండలం శ్రీముఖలింగంలోని మధుకేశ్వర స్వామిని బుధవారం ఆయన సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ గర్భగుడి ప్రాంగణంలో స్వామిచరిత్ర, ఆలయ శిల్పసంపదను తెలియజేస్తూ వారిని ఆలయ అర్చకులు పెదలింగన్న, రామ్మూర్తి, పి.నారాయణలు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శిల్పసౌందర్యాలను తిలకించారు. ప్రాంగణంలో చేపట్టాల్సిన అభివృద్ధిని పరిశీలించి ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామన్నారు.

గోవులకు రక్షణ కల్పించాలి
* స్వామి శ్రీనివాసానంద
శ్రీకాకుళం(రూరల్), మే 15: సింహాచలం లక్ష్మీనరసింహస్వామికి భక్తులు కానుకగా అందించిన గోవులను సంరక్షించాల్సిన బాధ్యత దేవస్థానం సిబ్బంది, పాలకవర్గంపైనే ఉందని భారత స్వాభిమాన్ ట్రస్టు జిల్లా అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానందసరస్వతీ పేర్కొన్నారు. ఎన్‌జిఒ హోమ్‌లో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింహాచలం దేవస్థానంలో గత వారం రోజులుగా 130 గోవులు, దూడలు మృతిచెందడం విచారకరమన్నారు. గోవులను నిర్లక్ష్యం చేసిన దేవస్థానం సిబ్బందిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నాలుగు దేవాలయాలకు ప్రతీనెలా కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని, అందులో ఒకటి సింహాచలం నృసింహస్వామి దేవాలయమన్నారు. భక్తుల నుంచి కోట్లాది రూపాయలు ఆదాయం వస్తుందని, భక్తులు కానుకగా సమర్పించిన గోవులు, దూడలకు రక్షణ కల్పించకపోవడం విచారకరమన్నారు. పరమపవిత్రమైన పుణ్యక్షేత్రంలో గోవులు మృతి దేశానికి అరిష్టమని స్వామిస్వరూపానందసరస్వతీ ప్రకటించినట్లు తెలిపారు. భక్తులు సమర్పించిన కానుకల్లో కొంత ధనాన్ని గోసంరక్షణకు ఖర్చుచేయాలని డిమాండ్ చేశారు. ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేదంటే రాష్ట్రంలోని స్వామిజీలతో శాంతియుతయాత్రను చేపట్టనున్నామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ, భారతీయ జనతాపార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శవ్వాన ఉమామహేశ్వరి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎన్ని ధనుంజయ్‌రావు, సిటిజన్‌ఫోరం జిల్లా అధ్యక్షుడు బరాటం కామేశ్వరరావు, విశ్వహిందూ పరిషత్ కార్యదర్శి సూరి చంద్రశేఖరరావు, పైడి సత్యం, జగదాంబ తదితరులు పాల్గొన్నారు.

స్వర్ణమయంలో స్వేచ్ఛావతి అమ్మవారు
ఇచ్ఛాపురం, మే 15: ఇచ్ఛాపురం గ్రామదేవత స్వేచ్ఛావతి అమ్మవారికి ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో 350 గ్రాముల బంగారం ముఖంతోపాటు, మరో 150 గ్రాముల బంగారంతో చేతులు తయారు చేశారు. 16 లక్షల రూపాయలతో బరంపురానికి చెందిన రవి అనే కళాకారుడు ఈ ఆభరణాలను తయారు చేసాడు. గతంలో ఆలయం వద్ద ఉన్న 44 గ్రాములు బంగారం, కమిటీ సభ్యులు నుండి 105 గ్రాముల బంగారం, భక్తులు నుండి 350 గ్రాముల బంగారంతో ఈ ఆభరణాలను తయారు చేసారు. బుధవారం ఉప్పలవీధిలో అమ్మవారి వద్ద ఏర్పాటు చేసిన ఈ ముఖాన్ని సందర్శనార్థం ఉంచారు. బుధవారం ఉదయం ప్రత్యేక పూజలు, సాయంత్రం ఊరేగింపు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కండ్రవీధిలో నర్శింహాస్వామి ఆకారంలో సైకత శిల్పాన్ని ఏర్పాటు చేసారు.
అభివృద్ధి కార్యక్రమాలపై
మంత్రి శత్రుచర్ల సమీక్ష
పాతపట్నం, మే 15: నియోజకవర్గ అభివృద్ధిపై రాష్ట్ర అటవీశాఖామంత్రి శతృచర్ల విజయరామరాజు బుధవారం అధికారులతో తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో అభివృద్ధిబాటలో నడిపేందుకు అధికారులు కృషిచేయాలన్నారు. కొరసవాడలో ఆరుకోట్ల రూపాయలతో నిర్మించనున్న లిఫ్ట్ ఇరిగేషన్‌కై మొదటి విడతగా 57 లక్షలు విడుదలయ్యాయన్నారు. వచ్చే ఖరీఫ్ సీజన్‌కు రైతుల ముంగిట ఈ లిఫ్ట్‌ఇరిగేషన్‌ను అందించనున్నట్లు తెలిపారు. రోడ్డు విస్తరణకై 51 కోట్లరూపాయలు మంజూరు చేశామని, ఈ పనులను ముందుగా పాతపట్నం నుంచి ప్రారంభించాలని అధికారులకు సూచించారు. జిల్లేడుపేట, కాగువాడ వంతెనలకు టెండర్లు పిలిచి పనులు వేగవంతం చేసేందుకు

జిల్లాలో పదేళ్ల తర్వాత జనాభా గణాంకాలు చూస్తే
english title: 
p

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>