మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు పెచ్చుమీరడంతో విశ్వ విద్యాలయాల్లోని లేడీస్ హాస్టళ్ల వద్ద ఆంక్షలు విధించేందుకు రంగం సిద్ధమైంది. ముఖ్యంగా ఈ హాస్టళ్ల వద్ద పురుషుల రాకపోకల్ని నియంత్రించేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని విశ్వవిద్యాలయ నిధుల సంఘం (యుజిసి) తాజాగా కొన్ని మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది. అన్ని విశ్వవిద్యాలయాలు విధిగా ఈమేరకు చర్యలు తీసుకోవాలని యుజిసి ఆదేశించింది. వర్సిటీల్లో, లేడీస్ హాస్టళ్లలో భద్రతను పటిష్టం చేసేందుకు సంబంధిత వైస్ చాన్సలర్లు తరచూ సమీక్షలు జరపాలని కూడా యుజిసి ఉత్తర్వులు జారీ చేసింది. లేడీస్ హాస్టళ్ల గేటు బయట తమ వారిని కలుసుకునేందుకు పురుషులకు అనుమతి ఇస్తారు. రాత్రి ఏడున్నర గంటల తర్వాత సందర్శకులను అనుమతించ రాదని, హాస్టళ్ల వద్ద సిసి కెమెరాలతో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని యుజిసి ఆదేశించింది. విశ్వవిద్యాలయాల్లో ఇంతవరకూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోయినా, యువతుల భద్రత దృష్ట్యా ఈ చర్యలు చేపట్టాలని యుజిసి సూచించింది. యువతుల్లో భద్రతా భావం ఏర్పడేలా నిఘా వ్యవస్థ అప్రమత్తంగా ఉండాలని, పురుష సందర్శకులను నియంత్రించాలని ఆదేశించినట్లు యుజిసి చైర్మన్ వేద్ ప్రకాష్ ప్రకటించారు. భద్రతా చర్యల్ని పర్యవేక్షించేందుకు సీనియర్ అధికారులతో టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయాలని కూడా సూచించారు. రాత్రి ఏడున్నర తర్వాత సందర్శకులను నియంత్రిస్తే హాస్టళ్ల వద్ద ఎలాంటి సమస్యలు ఉండవని నిపుణులు సిఫారసు చేశారు. యుజిసి ఆదేశాలను అన్ని విశ్వవిద్యాలయాలు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి రాష్ట్రంలోని వైస్ చాన్సలర్లకు విజ్ఞప్తి చేసింది.
మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు పెచ్చుమీరడంతో విశ్వ విద్యాలయాల్లోని
english title:
ladies
Date:
Tuesday, May 21, 2013