‘ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు’ అన్నది పాత సామెత. జైలు దొంగని కూడా ఆ ఈశ్వరుడు పట్టలేడు. జైల్లో దొంగలే వుంటారు కదా మరి! ఆ పట్టుకోలేని దొంగ ఎవరా? అని ఆశ్చర్యపడొద్దు. హర్యానాలోని రోహ్తక్ జైలులో దొంగలు- కొమ్ములు తిరిగిన దొంగలు! జైల్లోనే వుంటూ మొబైల్ ఫోన్‌లతో బయట తమ కార్యకలాపాల్ని చక్కబెట్టుకుంటారు. వాళ్లందరికీ ఛార్జర్స్‌నీ, సిమ్‌కార్డులనీ గుట్టుగా అందించే వ్యక్తిపేరు అరుణ్‌లాల్ (29). ఆ జిల్లా జైలుకి అంబాలా నుంచి బదిలీపై వచ్చిన జైలు డాక్టరే- ఆ దొంగ. ఆయన హస్తలాఘవ కోవిదుడు. సిమ్‌కార్డులు, ఛార్జర్స్ పెట్టుకొన్న అతడి ద్వారా నాటకం నడుస్తోంది! పోలీసులకి ‘ఉప్పు’ అం దింది. అనే్వషణ మొదలైంది. యాభై సెల్‌ఫోన్స్ బయట పడ్డాయి. డాక్టర్ అరుణ్‌లాల్‌కి- అంబాలాలో ఇలాంటి క్రిమినల్ రికార్డు వుంది. కానీ రోహ్తక్ జైల్లో మొబైల్ వ్యవహారంపై కొంతకాలం క్రితమే నలుగురు వార్డర్లు సస్పెండ్ అవడమే కాదు- అరెస్టు కూడా అయ్యారు. అది అలా వుండగా.. ఈ డాక్టర్‌గారి సహాయంతో- నలుగురు కరడుగట్టిన దొంగలు ‘మొబైల్ ఆపరేషన్లు’ చేస్తూండగా పట్టుబడ్డారు. దొంగలు, పోలీసులు కుమ్మక్కయిపోతేనే ఇలాంటి ‘కుతంత్రాలు’ జరుగుతాయి. జైలు డాక్టరే ఇంత మంచి ‘ట్రీట్‌మెంట్’ దొంగలకివ్వడం క్రిమినల్ హిస్టరీలో ఒక మైలు రాయి. డాక్టర్ అరుణ్‌లాల్ మీద బోలెడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అదే ‘సెల్’లో తోసేశారో లేకపోతే ‘స్పెషల్ జైలు’కి తరలించారో తరువాతి కథ తెలియా లంటే మనం వేచి చూడాలి!
‘ముద్దు’ కోసం లంచం!
రిషీకపూర్ కొడుకు, నెంబర్ వన్ హీరో రణబీర్ కపూర్‌కి- ‘్ధక్ ధక్’ గరల్‌గా వాసికెక్కిన మాధురీ దీక్షితమ్మ అంటే వెర్రి వ్యామోహంట! ఇటీవల ఆమె ‘యహ్ జవానీ హై దివానీ’ సిన్మాలో ఓ ఐటమ్ సాంగ్‌కి స్టెప్పులు, భంగిమ లు కురిపించింది. ఆ పాటలో నటించిన రణబీర్‌కపూర్ ఆమె బుగ్గమీద ఓ ‘ముద్దు’ టక్కున పెట్టేసుకున్నడట. ఐతే- ఆ ‘ముద్దు’ అఫీషియలేనుట! డైరెక్టర్ అయాన్‌ముఖర్జీకి ‘‘నేను లంచం యిచ్చి మరీ దీనికి ఒప్పించానండీ!’’ అంటూ గొప్పగా చెప్పుకున్నాడు- రణబీర్. వాళ్ల డాడీ, నాటి హీరో అయన రిషీకపూర్- మాధురీతో చాలా సినిమాల్లో రంజుగా నటించాడు. ‘‘హీ వాజ్ లక్కీ!’’ అంటాడు రణబీర్! ‘‘ఏదో విధంగా ఆ గొప్ప నటి, నర్తకీమణి అయిన మాధురీతో తెరపై కనబడాలన్నదే నా ప్రగాఢ వాంఛ!’’ అంటాడీ కుర్రహీరో!
‘ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు’ అన్నది పాత సామెత.
english title:
jail
Date:
Tuesday, May 21, 2013