మదనపల్లె, మే 21: తెలుగుదేశం పార్టీ అధిష్టానం ముందుగానే ప్రచురణ చేసిన మహానాడు-2013 ముసాయిదా తీర్మానాలు పుస్తకంలోని అంశాలను చదువుతూ.. మంగళవారం మదనపల్లెలో జరిగిన మినీ మహానాడు వేదికపై ప్రసంగాలు చేశారు. అనుకున్న రీతిలో నియోజకవర్గం మహానాడుకు రామసముద్రం, మదనపల్లె, నిమ్మనపల్లెకు చెందిన కార్యకర్తలు, నాయకులు అధికసంఖ్యలో హాజరయ్యారు. మదనపల్లె పట్టణానికి చెందిన ముఖ్యనేతలు మహానాడు వేదికపై ఆశీనులై ప్రసంగాలు చేశారు. అబ్జర్వర్‌గా వచ్చిన వల్లిగట్ల వెంకటరమణ సభలో ప్రసంగాలు చేస్తున్న వారి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ముందుగా మిట్స్ క్రిష్ణకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణల అమలులో కాంగ్రెస్ విఫలమైందన్నారు. విద్యుత్ రెగ్యులేషన్ కమిషన్ ప్రభుత్వానికి అనుసంధానంగా ఉంటుందని, రెగ్యులేషన్ కమిషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపుతోందని ఆరోపించారు. చంద్రబాబు పాలనలో అత్యాధునిక పరికరాలు లేకపోయినా ప్రతిఏటా 7వేల మెగావాట్లు విద్యుత్ మిగులుగా ఉంచేవారని, నేడు రాష్ట్రం నుంచి ఉత్పత్తిఅవుతున్న విద్యుత్‌ను ప్రక్కరాష్ట్రాలకు అమ్ముకుంటూ సొమ్ముచేసుకుని విద్యుత్ కొంటున్నామని కుంటుసాకులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. 2004కు ముందే అధికారంలో ఉన్న చంద్రబాబు 2014కు 20వేల మెగావాట్ల విద్యుత్ అవసరముంటుందని హెచ్చరించారని గుర్తుచేశారు. న్యాయవాది మాలతి మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో మహిళలకు భద్రత, యువతులు స్వతంత్య్రం, విద్యార్థులు, యువతకు మంచి భవిష్యత్ ఉండేదని, నేడు నిర్వీర్యమవుతోందని విమర్శించారు. మహానాడులో మాజీ ఎమ్మెల్యే రమేష్ మాట్లాడుతూ తీవ్రవర్షాభావంలో అల్లాడుతున్న ప్రాంతాల్లో ప్రత్యేక మేఘమధనం చేయాలని, టమోటా ఆధారిత పరిశ్రమలు ఏర్పాటుచేయాలని, ఎండుతున్న చెరువులన్నింటిని నీటిపారుదల ప్రాజెక్టులకు అనుసంధానం చేయాలని, గొర్రెలు పెంపకానికి, భారీ పరిశ్రమల ఏర్పాటుకు రూ.5లక్షలకు పైగా ఏలాంటి జామీను లేకుండా రుణాలు పంపిణీ చేయాలని, జిల్లాలోనే అత్యధిక జనాభా కలిగిన మదనపల్లె నీరుగట్టువారిపల్లెను చేనేతక్లస్టర్‌గా ఏర్పాటుచేసి, శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని, మైనార్టీలకు ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని తదితర అంశాలను మినీ మహానాడులో తీర్మాణాలు చేయాలని కోరారు. అనంతరం రాటకొండ బాబురెడ్డి మాట్లాడుతూ మినీ మహానాడులో వచ్చే గ్రామ, మండల, పట్టణ, నియోజకవర్గస్థాయి సమస్యలపై తీర్మాణం చేసి మహానాడుకు పంపాలని సూచించారు. ఉపాధిహామీ పథకం 1999లోనే చంద్రబాబునాయుడు కేంద్రానికి ప్రతిపాదనలు పంపారని గుర్తుచేశారు. అంతేకాకుండా అగ్రవర్ణకులాల్లోని పేదలందరికీ ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటుచేసి ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. అదేవిధంగా ప్రజలకిచ్చే హామీలు, మహానాడు ముసాయిదా తీర్మాణాలు గ్రామాల్లోకి తీసుకెళ్ళాలన్నారు. అనంతరం వల్లిగట్ల రెడ్డెప్ప మాట్లాడుతూ చంద్రబాబు పాదయాత్ర ద్వారా అమలుచేసిన డిక్లరేషన్‌లపై గ్రామసభల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం తెలుగురైతు రాష్ట్ర కార్యదర్శి గుర్రప్పనాయుడు కొన్నితీర్మాణాలతో కూడిన వినతిపత్రాన్ని అబ్జర్వర్‌కు అందజేశారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు బోడిపాటి శ్రీనివాస్, బొమ్మనచెరువుశ్రీరాములు, మహేష్, శివ, బాలుస్వామి, రాటకొండ సోమశేఖర్‌నాయుడు, సంగంరమేష్, మేకల రెడ్డిశేఖర్, రామ్మోహన్‌రాజు, మేస్ర్తి శ్రీనివాసులు, క్రిష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ అధిష్టానం ముందుగానే ప్రచురణ చేసిన
english title:
tdp
Date:
Wednesday, May 22, 2013