రుద్రవరం, మే 21: జాతీయ గ్రామీ ణ ఉపాధి హామీ పథకం కూలీలకు వరమని, జిల్లాలో 1.75 లక్షల మంది వ్యవసాయ కూలీలు ఉపాధి పనులు చేస్తున్నారని కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి, డ్యామా పిడి హరినాథ్‌రెడ్డి తెలిపారు. రుద్రవరం మండల పరిధిలోని తెలు గు గంగ ప్రధాన కాలువ కింద మహి ళా రైతు వౌలమ్మ పొలంలో పండ్ల మొక్కలు నాటేందుకు చేస్తున్న పనులను మంగళవారం వారు పరిశీలించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వందల కోట్ల రూపాయలతో ఉపాధి పనులు జరుగుతున్నాయన్నారు. రుద్రవరం మండలంలో 4 వేల హెక్టార్లలో పండ్ల తోటల పెంపకం చేపట్టడం జరుగుతోందన్నారు. ఇరిగేషన్, మైనర్ ఇరిగేషన్, వ్యవసాయ శాఖ సమన్వయంతో పనులు చేపట్టామన్నారు. ఇప్పటి వరకు 15 ఎకరాల్లో పనులు జరుగుతున్నాయన్నారు. మండలంలో 7 చెరువులు ఎంపికయ్యాయని త్వరలోనే పనులు చేపట్టి పూర్తిచేయడం జరుగుతుందన్నారు. ఇందరమ్మ పచ్చతోరణం పథకం కింద జూన్ 15 నాటి కి పొలం గట్లపై, చెరువు గట్లపై మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తిచేయాలన్నారు. కలెక్టర్ వెంట ఎపిడి విజయశేఖర్, రాజు, తహశీల్దార్ పాల్గొన్నారు.
రాజీవ్ ఆశయాలను నెరవేరుద్దాం
* మంత్రి టిజి వెంకటేష్
కల్లూరు, మే 21: రాజీవ్‌గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, రాజీవ్ ఆశయాలను నెరవేర్చడానికి ప్రతి ఒక్కరూ ముందుకురావాలని రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ పిలుపునిచ్చారు. నగరంలోని డిసిసి కార్యాలయంలో మంగళవారం డిసిసి అధ్యక్షుడు బివై రామయ్య ఆధ్వర్యంలో రాజీవ్‌గాంధీ వర్ధంతి సభ నిర్వహించారు. తొలుత రాజీవ్‌గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నగరంలోని సి.క్యాంపు సెంటర్‌లో ఉన్న రాజీవ్‌గాంధీ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి టిజివి మాట్లాడుతూ రాజీవ్‌గాంధీ వర్ధంతి రోజున తీవ్రవాద వ్యతిరేక దినం జరుపుకుంటున్నామని, కావున ప్రతిఒక్కరూ హింసకు దూరంగా వుంటూ అహింసా మార్గంలో నడిచి దేశంలో శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి కృషి చేయాలన్నారు. డిసిసి అధ్యక్షడు బివై రామాయ్య మాట్లాడుతూ టిడిపి, వైకాపా నాయకులు రాష్ట్రంలో ఎన్ని పాదయాత్రలు చేసినా, ఎన్ని వేల కిలోమీటర్లు నడిచినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరన్నారు. ప్రపంచంలోనే పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిన ఏకైక రాజకీయ పార్టీ కాంగ్రెస్ అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు, నాయకులు అబ్దుల్ రజాక్, వాడాల చంద్రశేఖరరెడ్డి, మజురుల్ హక్, నారాయణరెడ్డి, తిప్పన్న, చున్నుమియ్యా, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు
రూ. 30 కోట్లు మంజూరు
* ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి
ఎమ్మిగనూరు, మే 21: మంత్రాలయం నియోజకవర్గంలో ఎస్‌ఎస్ ట్యాంకు, రోడ్ల నిర్మాణాలకు ప్రభుత్వం రూ. 30కోట్లు మంజూరు చేసిందని మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మంగళవారం విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సాతనూరు ఎస్‌ఎస్ ట్యాంకు నిర్మాణాలకు జిఓ.582కింద రూ. 6కోట్లు మంజూరైందని, అలాగే ఆర్డీఎఫ్ స్కీం కింద కల్లెకుంట నుంచి సూగూరు గ్రామం వరకు 9.7కి.మీ.రోడ్డుకు రూ. 6కోట్ల 6లక్షల మంజూరైందని, అలాగే ఐరన్‌గల్లు, చిన్నబొంపల్లి, పెద్దబోంపల్లి రోడ్డు నిర్మాణాలకు రూ. 6.12కి.మీ., రోడ్డుకు రూ. 6కోట్లు కల్లెకుంట నుంచి సూగూరు వరకు 9.7కి.మీ.రోడ్డుకు రూ. 5కోట్లు మంజూరైందని, వచ్చే నెల టెండర్లు పిలవడం జరుగుతుందని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తెలిపారు. అలాగే కోసిగి, వందగల్లు 6కి.మీ.రోడ్డుకు రూ. 6కోట్లకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందని, త్వరలో ఆ రోడ్డు కూడ మంజూరవుతుందని ఆయన పేర్కొన్నారు. మంత్రాలయం నియోజకవర్గంలో గ్రామగ్రామానికి రోడ్డు, అలాగే వాటర్ ట్యాంకు నిర్మాణానికి నిధులు మంజూరు కావడం జరిగిందని, నీళ్ల ట్యాంకులు నిర్మించడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
12 మంది కెజిబివి ప్రత్యేక అధికారులపై
వేటుకు రంగం సిద్ధం!
కర్నూలు స్పోర్ట్స్, మే 21: జిల్లాలోని కస్తూరిబా బాలికల విద్యాలయాల్లోని 12 మంది ప్రత్యేక అధికారులపై వేటు వేసేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. వీరు జిల్లాలోని కెజిబివిల నిర్వహణలో అవకతవకలకు పాల్పడ్డారని రుజువుకావడంతో ఈ నెల 15వ తేదీ రాష్ట్ర పథక సంచాలకుల కార్యాలయం నుంచి కమిటీ వచ్చి విచారణ నిర్వహించింది. దీంతో వారు చేసిన అభియోగాలు రుజువు కావడంతో వారిపై పెన్షన్ రూల్స్ ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసు కూడా నమోదు చేసేందుకు ఆస్కారం వుంది. ప్రస్తుతం వీరిపై చర్యలకు సంబంధించిన దస్త్రం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వున్నట్లు తెలుస్తోంది. కలెక్టర్ దీనికి ఆమోదం తెలిపాక వారిపై సంబంధిత శాఖ వారు వేటు వేయనున్నారు. వేటు పడే స్పెషల్ ఆఫీసర్లలో వేణుగోపాల్‌రెడ్డి (దొర్నిపాడు), ఎవిఎస్.శర్మ (గోస్పాడు), బసవరాజు (ఆదోని), బసన్న (ఎమ్మిగనూరు), ఉరుకుందప్ప (కౌతాళం), వెంగల్‌రెడ్డి (బేతంచెర్ల), వెంకయ్య (సంజామల), చౌడోజీరావు (ఆస్పరి), వెంకటరమణ (గూడూరు), పురుషోత్తం (హాలహర్వి), ఎలియా పీటర్ (కోసిగి), వెంకటరమణ (దేవనకొండ), ఖాజామొహిద్దీన్ (మద్దికెర) వున్నారు. అయితే వీరిలో కొందరు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.