తూర్పు చైనాలోని ‘జెజియాంగ్’ గురించి లోకానికి అంతగా తెలీదు. ఎక్కడో చరిత్ర పుటల్లో అక్షరబద్ధంగా మారిపోయింత్తర్వాత ఆ సంస్కృతి సంగతి పట్టించుకున్న వారూ లేరు. ఇది 1,339 ఏళ్లనాటి కథ. ‘జెజియాంగ్’ ప్రాంతంలో అందమైన ఖియాండువా సరస్సు గర్భంలో ఒక మహానగరం నిక్షిప్తమై ఉన్నట్టు స్థానికులు చెప్పుకుంటూ ఉంటారు. కానీ చూసిన వాళ్లులేరు. అదే ‘షిచెంగ్ సిటీ’. గత ఏడాది చైనీస్ నేషనల్ జియోగ్రాఫిక్ మేగజైన్ ఈ నగరంపై సిరీస్‌ని రిలీజ్ చేయటంతో ప్రపంచ పర్యాటకుల దృష్టి ఆ సరస్సుపై పడింది. కానీ 1959లో ఇక్కడికి సమీపంలోని జ్సియాన్ నదిపై హైడ్రో పవర్ స్టేషన్ నిర్మించాలన్న ప్రతిపాదనలతో చరిత్రని తిరగేస్తే కనిపించిన అద్భుతం శాస్తవ్రేత్తలను ఆలోచనల్లోకి నెట్టేసింది. దీంతో అంతర్జాతీయ పురాతత్వ శాస్తవ్రేత్తలు ఈ సరస్సుపై పరిశోధనలు జరిపారు. వేల సంవత్సరాలుగా నీటిలో చెక్కుచెదరక గత వైభవాన్ని చాటుతోన్న మహా నగరాన్ని ‘టైమ్ కాప్సిల్’ అని వ్యవహరించారు. క్రీ.శ.208లో ఇక్కడ మహా సంస్కృతి విలసిల్లిందనీ.. నాగరికతతో భాసిల్లిందనీ చరిత్ర చెబుతోంది. ప్రకృతి వైపరీత్యాల కారణంగానూ.. తరచూ జరిగే యుద్ధాల వల్ల ఈ నాగరికత శిథిలమై పోయింది. ఐతే- అందమైన కోట సరస్సు గర్భంలోకి ఎలా వెళ్లిందన్నది మిస్టరీ. దీనికి సంబంధించిన చరిత్ర ఆధారాలు అంతగా లేవు. కానీ ఒక మహా నగరాన్ని నీటి పొరల్లో చూట్టం తీయటి అనుభూతి. అప్పుడప్పుడు కొంతమంది స్థానికులు సరస్సులోకి ‘డైవ్’ చేసి నగరాన్ని చూసేవారు. 2001 నాటికి ‘బీజింగ్ డైవింగ్ క్లబ్’ నొకటి నెలకొల్పి పర్యాటకులకు ఆ నగరాన్ని చూసే భాగ్యాన్ని కల్పించారు. 2005లో స్థానిక పర్యాటక శాఖ మరిన్ని అనే్వషణలు చేపట్టి సరస్సులో ఎక్కడెక్కడ నగర శిథిలాలు ఉన్నాయో కనిపెట్టారు. సబ్‌మెరైన్‌ను ఏర్పాటుచేస్తే తప్ప ఆయా ప్రాంతాలను చూట్టం కుదరదు. దాంతో 23.6 మీటర్ల ఎత్తు, 3.8 మీటర్ల పొడవు కలిగిన సబ్‌మెరైన్‌ని 40 మిలియన్ యాన్‌ల ఖర్చుతో కొనుగోలు చేసింది పర్యాటక శాఖ. 2004 నాటికి పర్యాటకుల రద్దీ పెరగటంతో సరస్సులో సబ్‌మెరైన్‌ని ఉపయోగించరాదన్న చట్టాన్ని చేసింది చైనా ప్రభుత్వం. కానీ - ఔత్సాహికులను నిరోధించే చట్టాలు ఇంతవరకూ రాలేదు. ఆ తర్వాత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెకానిక్స్, చైనీస్ అకాడెమీ ఆఫ్ సైన్స్ సంయుక్తంగా ‘ఆర్కిమెడిస్ బ్రిడ్జ్’ని కట్టాలన్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. ఇదొక క్లిష్టతరమైన కష్టతరమైన ప్రాజెక్ట్. నీటిలో పకడ్బందీ టనె్నల్‌ని నిర్మించటం ఖర్చుతో కూడుకున్నది. ఈ ప్రాజెక్ట్‌కి నార్వే, జపాన్, స్విస్, బ్రెజిల్, యుఎస్ దేశాలు మేమున్నామంటూ చేతులు కలిపాయి. ఖియాండువా సరస్సులో నిర్మించిన ‘ఆర్కిమెడిస్’ బ్రిడ్జ్ ప్రపంచంలోనే మొట్టమొదటిది కావటం విశేషం. ప్రస్తుతం సరస్సులోని నగర శిథిలాల వరకూ వెళ్లి చూట్టం మాటల్లో చెప్పలేని అనుభూతి.
తూర్పు చైనాలోని ‘జెజియాంగ్’ గురించి
english title:
city in a lake
Date:
Sunday, May 26, 2013