పటు శాస్త్రాగమ దృష్టి నివ్విధమునన్ భావించి వీక్షించి యు
ద్భట వృత్తిన్ భవదీయ భక్తి నికర బ్రహ్మాండకుండైన నా
దటలో గాచు కొనంగ వచ్చువిదితోద్దండ ప్రతాపోత్కట
సపుట కోఫానల మూర్తియై యముడు కొంపోకుండ సర్వేశ్వరా
భావం: సర్వేశ్వరా శాస్త్రాగమ దృష్టితో ఆలోచించి చూసి, నీ మీద భక్తి అనే బ్రహ్మాండంలో ఉన్నట్లయతే విపరీతమైన క్రోధంతో ఉన్న యముడు తీసికోని పోకుండా ఆ బ్రహ్మాండంలో కాపాడుకోవచచ్చు.
ఈశ్వరునికి ఈశాన, తత్పురుష, అఘోర, వామదేవ, సద్యోజాతాలనే ఐదుముఖాలున్నాయనీ ఈ ఐదు ముఖాలలో ఒకటి ఊర్థ్వముఖంగాను, మిగిలిన నాలుగు ప్రాక్చశ్చిమోత్తర దక్షిణ దిశలుగానూ ఉంటాయ. వీటిలో నుంచి ఉద్భవించిన పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తే శివసాయుజ్యం పొందుతారు. అది కష్టమనిపిస్తే , లేక ఏ మంత్రమూ రాకపోయనా శివుడిని మనసార ధ్యానిస్తే చాలు శివుడు భక్తికి వశుడౌతాడు. అలాంటి శివుడిని నమ్ముకొన్నవారికి మృత్యుభయం ఉండదు కాక ఉండదు.
సర్వేశ్వర శతకములోని పద్యమిది నిర్వహణ: శ్రీపావని సేవా సమితి, హైదరాబాద్